For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీకి 6నెలల ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

By Swathi
|

మీరు బేబీ కోసం ప్లాన్ చేస్తున్నారా ? వన్ ఇయర్ లో బుజ్జి పాపాయికి తల్లి కావాలని భావిస్తున్నారా ? అయితే.. మీ అలవాట్లలో ఖచ్చితంగా మార్పులు తీసుకురావాలి. కొన్ని రకాల హెల్త్ ఛేంజెస్ తో హెల్తీ ప్రెగ్నెన్సీ పొందవచ్చు. ప్రెగ్నెన్సీకి 6 నెలల ముందు మీ సిస్టమ్ ని అంతా క్లీన్ చేసుకుని, హెల్తీగా మార్చుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు.

గర్భధారణకు ముందు అది చాలా సులువైన పనిగా అనిపిస్తుంది. కానీ.. ప్రెగ్నెన్సీకి ముందు మగవాళ్లు, ఆడవాళ్లు చాలా ఎఫర్ట్ పెట్టినప్పుడే ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. కపుల్స్ లైఫ్ లో ప్రెగ్నెన్సీ అనేది ముఖ్యమైనది. కాబట్టి ఇద్దరూ తమ అలవాట్లలో చాలా మార్పులు తీసుకురావాలి. మహిళలు ఈ బాధ్యతను కాస్త సీరియస్ గా తీసుకోవాలి.

మానసికంగా, శారీరకంగా.. ప్రెగ్నెన్సీకి ముందు మహిళలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ప్రెగ్నెన్సీ బాధ్యతకు సిద్ధంగా ఉండాలి. వెయిట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం, బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవడం చాలా ముఖ్యమైన విషయాలను మహిళలు గుర్తించాలి. అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ అయిన స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇక ప్రెగ్నెన్సీకి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన హెల్తీ హ్యాబిట్స్ ఏంటో చూద్దామా..

వెయిట్

వెయిట్

కన్సీవ్ అవడానికి ముందు అధిక బరువు, తక్కువ బరువు రెండూ ప్రాబ్లమే. కాబట్టి.. మీ హైట్ కి తగ్గట్టు ఎంత వెయిట్ ఉండాలో ఒకసారి డాక్టర్ ని సంప్రదించి తెలుసుకుని.. అదే బరువు మెయింటేన్ చేయడం చాలా అవసరం.

ఫిట్

ఫిట్

ఒకవేళ మీరు ఉండాల్సినంత బరువే ఉన్నప్పటికీ.. ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి. ప్రెగ్నెన్సీలో శరీరంలో చాలా మార్పులు వస్తాయి. కాబట్టి మీ శరీరం చాలా హెల్తీగా, ఫిట్ గా ఉండాలి.

కాఫీ

కాఫీ

ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీ సమయంలో.. కాఫీ చాలా సీరియస్ ఎఫెక్ట్ తీసుకొస్తుంది. హెల్తీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకునేవాళ్లు.. లిమిట్ గా కాఫీ తీసుకోవడం చాలా మంచిది. సోడాలకు కూడా దూరంగా ఉండటం చాలా అవసరం.

ఒత్తిడి

ఒత్తిడి

తల్లి కావాలన్న మీ కలను నాశనం చేయడానికి ఒత్తిడి సైలెంట్ కిల్లర్ లాంటిది. మీరు బేబీ కావాలని ప్లాన్ చేస్తుంటే.. చాలా రిలాక్స్ ఉండాలి. ఒత్తిడి లేకుండా ఉంటేనే.. మీకు హెల్తీ ప్రెగ్నెన్సీ పొందగలరు.

డైట్

డైట్

ప్రెగ్నెన్సీ పొందడానికి 6 నెలల ముందు నుంచే.. హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ధాన్యాలు, చికెన్, ఎగ్స్, బీన్స్, డైరీ ప్రొడక్ట్స్ ని డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

ఫోలేట్

ఫోలేట్

ఫోలిక్ యాసిడ్ శరీరానికి అందడం వల్ల బర్త్ డిఫెక్ట్స్ లేకుండా.. హెల్తీ బేబీని పొందవచ్చు. బేబీ తల, వెన్నుభాగానికి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. వెజిటబుల్స్, సిట్రస్ ఫ్రూట్స్, బీన్స్ లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం.

స్మోకింగ్, డ్రింకింగ్

స్మోకింగ్, డ్రింకింగ్

ప్రెగ్నెన్సీకి ముందు స్మోకింగ్, డ్రింకింగ్ చేసే ఆడవాళ్లకు కన్సీవ్ అవడానికి 20 శాతం తక్కువ ఛాన్స్ ఉంటుంది.

డాక్టర్

డాక్టర్

ప్రెగ్నెన్సీకి ముందు.. కపుల్స్ ముందుగా డాక్టర్ ని సంప్రదించాలి. తమ హెల్త్ కండీషన్ ఎలా ఉంది.. ఎలాంటి మార్పులు అవసరమని తెలుసుకోవడం చాలా అవసరం.

English summary

Health Changes To Make Before Getting Pregnant

Health Changes To Make Before Getting Pregnant. Getting pregnant may seem easy at first, but there is a lot of effort a man and his woman need to put in before seeing a positive sign on the pregnancy test.
Story first published:Saturday, April 30, 2016, 11:31 [IST]
Desktop Bottom Promotion