For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా గర్భం పొందడానికి సహాయపడే అమేజింగ్ హోం రెమెడీస్..!!

ఒకవేళ మీరు కన్సీవ్ అవడానికి చాలా ఇబ్బందిపడుతుంటే.. కొన్ని ఎఫెక్టివ్ హోం రెమిడీస్.. మీకు అద్భుతంగా సహాయపడతాయి. అబార్షన్ అవకుండా.. త్వరగా కన్సీవ్ అవడానికి సహాయపడే.. అమేజింగ్ హోం రెమిడీస్ మీకోసం..

By Swathi
|

బిడ్డకు జన్మ ఇవ్వడం అనేది.. జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. గర్భం పొందడం అనేది.. మహిళ జీవితంలో.. అత్యంత ఆనందాన్ని కలిగించేది. ఒకవేళ మీరు, మీ భాగస్వామి బిడ్డకు జన్మ ఇవ్వాలని నిర్ణయించుకుంటే.. అందుకు అనుకూలమయ్యే.. విషయాలపై జాగ్రత్తపడాలి.

conceive

కొంతమంది మహిళలకు గర్భం పొందడం తేలికగానే ఉంటుంది. కొంతమందికి కన్సీవ్ అవడానికి సమయం పడుతుంది. కన్సీవ్ అవ్వాలని ప్రయత్నించిన.. మొదటి ఆరునెలల్లోపు.. దాదాపు చాలామంది మహిళలు గర్భం పొందుతున్నారు.

ఒకసారి మీరు బిడ్డకు జన్మనివ్వాలి అని డిసైడ్ అయిన తర్వాత.. ముందుగా మీరు డాక్టర్ ని సంప్రదించాలి. కన్సీవ్ అవడానికి ముందే.. జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓవల్యూషన్ నుంచి స్పెర్మ్ క్వాలిటీ, డైట్, అలవాట్లు, ఇతర విషయాలన్నీ.. ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతాయి. కాబట్టి.. ముందుగా డాక్టర్ ని సంప్రదించి.. జాగ్రత్తలు తీసుకోవాలి.

ఒకవేళ మీరు కన్సీవ్ అవడానికి చాలా ఇబ్బందిపడుతుంటే.. కొన్ని ఎఫెక్టివ్ హోం రెమిడీస్.. మీకు అద్భుతంగా సహాయపడతాయి. అబార్షన్ అవకుండా.. త్వరగా కన్సీవ్ అవడానికి సహాయపడే.. అమేజింగ్ హోం రెమిడీస్ మీకోసం..

దానిమ్మ

దానిమ్మ

దానిమ్మ మహిళల్లో ఫెర్టిలిటీని మెరుగుపరుస్తుంది. గర్భాశయానికి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే.. శిశువు హెల్తీగా డెవలప్ అవడానికి సహాయపడుతుంది. మగవాళ్లలో స్పెర్మ్ క్వాలిటీని పెంచుతుంది. ప్రతిరోజూ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల అద్భుత ఫలితాలు పొందవచ్చు.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు.. ప్రెగ్నంట్ అయ్యే అవకాశాలు పెంచే గ్రేట్ రెమిడీ.. ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ లో ఉండే మోనోశ్యాచురేటెడ్ ప్యాట్.. రీప్రొడక్టివ్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకుంటే.. ఫెర్టిలిటీని మెరుగుపరచవచ్చు.

డేట్స్

డేట్స్

ఆయుర్వేదం ప్రకారం డేట్స్.. గర్భం పొందే అవకాశాలను మెరుగుపరుస్తాయి. వీటిల్లో రకరకాల విటమిన్స్, మినరల్స్ ఉండటం వల్ల.. ఫెర్టిలిటీని మెరుగుపరుస్తాయి.

ఎలా తినాలి

ఎలా తినాలి

డేట్స్ నుంచి విత్తనాలు తీసుకోవాలి. 10 నుంచి 12 విత్తనాలను గ్రైండ్ చేసి.. ఒక స్పూన్ కొత్తిమీర తో కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడోవంతు స్పూన్ తీసుకుని ఆవుబాలలో కలిపి.. మరిగించాలి. రుతుక్రమం చివరి రోజు నుంచి..ఇలా వారంరోజులపాటు ప్రతిరోజూ తీసుకోవాలి. అలాగే డైలీ డైట్ లో డేట్స్ ని చేర్చుకోవాలి.

వెనిగర్

వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్.. ఇన్ఫెర్టిలిటీని మెరుగుపరచడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 2టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ను.. కొద్దిగా తేనె మిక్స్ తీసుకుని.. ఒక గ్లాసు నీటిలో కలుపుకుని ప్రతిరోజూ రెండుసార్లు తీసుకోవాలి.

ఒత్తిడి

ఒత్తిడి

ఒత్తిడి ఫెర్టిలిటీపై దుష్ర్పభావం చూపుతుంది. ఎక్కువగా ఒత్తిడికి గురైతే.. ప్రెగ్నంట్ అవడం కష్టం. కాబట్టి.. ఒత్తిడి తగ్గించుకోవడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి.

విటమిన్ డి

విటమిన్ డి

విటమిన్ డి లోపం.. ఇన్ఫెర్టిలిటీ, అబార్షన్ కి కారణమవుతుంది. కాబట్టి.. కన్సీవ్ అవడానికి ముందు.. విటమిన్ డి చెక్ చేయించుకోవాలి. అలాగే ఉదయాన్నే.. 10 నిమిషాలు ప్రతిరోజూ ఎండకు ఉండాలి. అలాగే.. హైవిటమిన్ డి ఫుడ్స్ అయిన సాల్మన్, చీజ్, ఎగ్ తీసుకోవాలి.

ఫోలిక్ యాసిడ్

ఫోలిక్ యాసిడ్

కన్సీవ్ అవ్వాలని ప్రయత్నించేవాళ్లకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. ఒవల్యూషన్ ని మెరుగుపరుస్తుంది. కనీసం కన్సీవ్ అవడానికి ఒక నెల ముందు ప్రతిరోజూ ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. అయితే డాక్టర్ సలహాతో తీసుకోవాలి. అలాగే.. ఆకుకూరలు, బ్రొకోలి, అవకాడో, ఎండుద్రాక్ష, బీన్స్ ని డైట్ లో చేర్చుకోవాలి.

English summary

Home Remedies to Help You Conceive

Home Remedies to Help You Conceive. Once you have decided to bring a new life into this world, you need to see a doctor. Many things need to be taken care of while trying to conceive.
Story first published: Wednesday, October 19, 2016, 10:33 [IST]
Desktop Bottom Promotion