For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైపోథైరాయిడిజం ఉంటే పిల్లలు పుట్టడం కష్టమవుతుందా ?

By Swathi
|

హైపోథైరాయిడిజం ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతుందని.. తాజా అధ్యయనాలు తేల్చాయి. రీప్రొడక్టివ్ ప్రాసెస్ పై హైపోథైరాయిడిజం ప్రభావం ఉండటం వల్ల.. దీన్ని ఇన్ఫెర్టిలిటీకి కారణంగా చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు.

హైపోథైరాయిడిజం అంటే ఏంటి ? థైరాయిడ్ గ్రంథి అవసరమైనన్ని థ్రోక్సిన్, ట్రిడోథ్రైఓనైన్ హార్మనోన్లను ఉత్పత్తి చేయలేకపోయినప్పుడు ఆ సమస్యను హైపోథైరాయిడిజం అని పిలుస్తారు. ఈ హార్మోన్స్ సరిగా ఉత్పత్తి కానప్పుడు శరీరంలో రీప్రొడక్టివ్ సామర్థ్యాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా ఎగ్ క్రియేషన్ లో సమస్యకు కారణమవుతుంది.

Hypothyroidism

థైరాయిడ్ హార్మోన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల.. మహిళల్లో ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతుంది. అంతేకాదు హైపోథైరాయిడిజం కారణంగా పాలు ఉత్పత్తి చేసే హార్మోన్ అయిన ప్రొలాక్టిన్ కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఎక్కువగా ఉత్పత్తి అయితే.. అండానికి సమస్యగా మారుతుంది.

Hypothyroidism

హైపోథైరాయిడిజం సాధారణంగా మహిళల్లో రీప్రొడక్టివ్ ఏజ్ లో వస్తుంది. వాళ్ల 20 నుంచి 30ల మధ్యలో ఎక్కువగా గుర్తించే అవకాశాలుంటాయి. కానీ మెనోపాజ్ దశలో కూడా హైపోథైరాయిడిజం సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అయితే థైరాయిడ్ కి ట్రీట్మెంట్ ఉంది. థైరాక్సిన్ లేదా ట్రైఓడోథ్రైఓనైన్ శరీరంలో తగ్గిపోయినప్పుడు మెడిసిన్స్ ద్వారా వాటిని పెంచవచ్చు.

Hypothyroidism

కన్సీవ్ అవడానికి ప్రయత్నించే ముందు థైరాయిడ్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవడం వల్ల.. కండిషన్ ముందుగానే గుర్తించవచ్చు. థైరాయిడ్ టెస్ట్ ముందే చేయించుకోవడం థైరాయిడ్ గుర్తిస్తే.. సరైన మందులు వాడి మిస్ క్యారేజ్ కాకుండా నివారింవచ్చు. కన్వీవ్ అవడానికి ప్రయత్నిచేటప్పుడు సక్సెస్ అవకపోవడానికి థైరాయిడిజం కారణమని చెప్పలేం.

Hypothyroidism

ముఖ్యంగా ఫ్యాట్ పెరగడం, హార్ట్ రేట్ పెరగడం, మూడ్ స్వింగ్స్, డ్రై స్కిన్, నిర్జీవంగా మరిన గోళ్లు, జుట్టు రాలిపోవడం, జలుబు తట్టుకోలేకపోవడం, చర్మంపై పసుపు రంగు కనిపించడం, కాన్ట్సిపేషన్, రుతుక్రమ సమస్యలు, అలసట వంటి లక్షణాలు.. హైపోథైరాయిడిజంను సూచిస్తాయి.

ఈ లక్షణాలన్నింటినీ గుర్తించిన వెంటనే.. డాక్టర్ ని సంప్రదించడం మంచిది. మొదటి దశలోనే హైపోథైరాయిడిజంను గుర్తిస్తే.. సరైన మందుల ద్వారా దాన్ని నయం చేసుకోవచ్చు. సరైన మందులు వాడటం, సరైన ఆహార నియమాలు పాటించడం వల్ల.. థైరాయిడ్ నివారించడం తేలికైన పనే.

English summary

Is Hypothyroidism Cause For Infertility?

Is Hypothyroidism Cause For Infertility? Because of hypothyroidism, prolactin is produced in larger amounts than usual.
Story first published:Friday, June 17, 2016, 10:25 [IST]
Desktop Bottom Promotion