For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ప్రెగ్నంట్ అని సూచించే.. ఆశ్చర్యకర లక్షణాలు..!

ఏమాత్రం ఊహించని విధంగా కొన్ని సున్నితమైన లక్షణాలు. .మీ శరీరంలో కనిపిస్తే.. మీరు కాస్త అలర్ట్ అవ్వాలి. డాక్టర్ ని సంప్రదించాలి. ఆ లక్షణాలు.. ప్రెగ్నన్సీని సూచించేవై ఉండవచ్చు.

By Swathi
|

ప్రెగ్నన్సీ అనేది చాలా అందమైన అనుభూతి. కానీ ఇప్పుడే వద్దు అనుకునేవాళ్లకు మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మీరు ప్రెగ్నంట్ అవడానికి మీరు, మీ భాగస్వామి సిద్ధంగా ఉన్నా లేకపోయినా.. కొన్ని సర్ ప్రైజ్ అవ్వాల్సి వస్తుంది.

signs of pregnancy

కొన్నిసార్లు..ప్రెగ్నంట్ అవ్వలేదు అని భావించినా.. మహిళ శరీరంలో కనిపించే మార్పులు, లక్షణాలు ఆమె గర్భం దాల్చినట్టు చూపిస్తాయి. సాధారణంగా గర్భం దాల్చినప్పుడు బ్లోటింగ్, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ..?

కానీ ఏమాత్రం ఊహించని విధంగా కొన్ని సున్నితమైన లక్షణాలు. .మీ శరీరంలో కనిపిస్తే.. మీరు కాస్త అలర్ట్ అవ్వాలి. డాక్టర్ ని సంప్రదించాలి. ఆ లక్షణాలు.. ప్రెగ్నన్సీని సూచించేవై ఉండవచ్చు.

గ్యాస్

గ్యాస్

ఒకవేళ మీరు ప్రెగ్నంట్ అయితే.. మీకు బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలు కనిపిస్తాయి. ఎందుకంటే.. మహిళల శరీరంలో హార్మోన్స్ లో మార్పుల వల్ల ఈ లక్షణాలు కనిపిస్తాయి.

తరచుగా యూరినేషన్

తరచుగా యూరినేషన్

చాలా తరచుగా యూరిన్ కి వెళ్తుండటం అనేది కూడా ప్రెగ్నంట్ ని సూచిస్తుంది. ప్రెగ్నన్సీ టైంలో బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. దీంతో కిడ్నీలు ఎక్కువ ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. దీంతో బ్లాడ్ త్వరగా ఫుల్ అయి.. గర్భాశయం పెద్దగా అవుతుంది. దీంతో బ్లాడర్ ఎప్పటికప్పుడు యూరిన్ కి వెళ్లాలని సూచిస్తూ ఉంటుంది.

వాజినల్ డిశ్చార్జ్

వాజినల్ డిశ్చార్జ్

వాటరీగా, మిల్కీ వైట్ గా వాజినల్ డిశ్చార్జ్ కంటిన్యూగా అవుతూ ఉంటే.. అది ప్రెగ్నంట్ అయ్యారని సూచిస్తుంది. ప్రెగ్నన్సీ టైంలో వాజినల్ డిశ్చార్జ్ చాలా కామన్.

పీరియడ్స్ మిస్ అవడం

పీరియడ్స్ మిస్ అవడం

ప్రెగ్నంట్ గా ఉన్నప్పడు పీరియడ్స్ మిస్ అవడం అనేది చాలా కామన్ సంకేతం. కానీ కొన్ని సార్లు ప్రెగ్నన్సీ మొదట్లో బ్లీడింగ్ కూడా అవుతుంది. సాధారణంగా వచ్చే డేట్ కంటే.. వారం ఆలస్యం అయింది అంటే.. రెస్ట్ తీసుకోవడం మంచిది. అయితే పీరియడ్స్ ఆలస్యం అయిన ప్రతిసారి ప్రెగ్నన్సీ సంకేతం కాదు.. ఎందుకంటే.. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య కూడా అయి ఉండవచ్చు.

వికారం

వికారం

మార్నింగ్ సిక్ నెస్, వాంతులు, వికారం వంటి లక్షణాలు ప్రతిరోజూ కనిపిస్తూ ఉన్నాయంటే.. ప్రెగ్నన్సీకి సంకేతం అయి ఉంటుంది.

బ్రెస్ట్ లు

బ్రెస్ట్ లు

పీరియడ్స్ టైంలో ఉన్నట్టు.. రొమ్ములు చాలా సున్నితంగా మారడం, కానీ వాపు వచ్చినట్టు, చాలా పెద్దగా ఉన్నాయంటే.. ప్రెగ్నన్సీకి సంకేతం కావచ్చు. నిపుల్ కి చుట్టూ డార్క్ నెస్ ఉంది అంటే.. ప్రెగ్నన్సీకి సంకేతంగా భావించాలి. హార్మోన్స్ లో చాలా మార్పుల కారణంగా, పాల ఉత్పత్తి కారణంగా.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఎక్స్ పెక్ట్ చేయకుండా పీరియడ్స్

ఎక్స్ పెక్ట్ చేయకుండా పీరియడ్స్

ఊహించకుండానే.. పీరియడ్స్ వచ్చాయంటే.. అది కూడా.. ప్రెగ్నన్సీకి సంకేతం కావచ్చు. మీ రుతుక్రమం తేదీ కంటే ముందే.. ప్రెగ్నంట్ అయ్యారంటే.. గర్భాశయంలో ఉండే ఎంబ్రో ఇంప్లాంట్స్ రక్తస్రావానికి కారణమవుతాయి.

వాసన, టేస్ట్

వాసన, టేస్ట్

కొన్ని రకాల వాసనలు, హఠాత్తుగా వచ్చే వాసనను భరించలేకపోవడం, టేస్ట్ వల్ల.. వాంతుల ఫీలింగ్ కలగడం వంటి లక్షణాలు.. ప్రెగ్నంట్ ని సూచిస్తాయి.

మైకం

మైకం

శరీరంలో ప్రొగెస్టోరోన్ పెరగడం వల్ల చాలా తరచుగా మైకం కలుగుతూ ఉంటుంది. మొదటి దశలో.. కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది, వాటర్ రిటెన్షన్ పెరుగుతుంది.

ఎమోషన్స్

ఎమోషన్స్

చాలా ఆత్రుతగా ఫీలవడం, డిప్రెసన్, ఎమోషన్ కి లోనవడం వంటి లక్షణాలు కూడా ప్రెగ్నన్సీని సూచిస్తాయి.

తీవ్ర అలసట

తీవ్ర అలసట

గర్భం పొందిన తర్వాత.. చాలా తీవ్రంగా అలసటకు గురవడం సాధారణ లక్షనం. సాధారణ అలసటకు, ప్రెగ్నన్సీ అలసటను గుర్తించలేకపోతారు.

English summary

Signs That Indicate That You Might Be Pregnant

Signs That Indicate That You Might Be Pregnant. Pregnancy is a beautiful feeling, but not when it is uncalled for.
Story first published: Tuesday, October 25, 2016, 10:10 [IST]
Desktop Bottom Promotion