For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: ఇన్ఫెర్టిలిటీకి కారణమయ్యే డైలీ హ్యాబిట్స్..!!

By Swathi
|

త్వరలో బేబీ కోసం ప్లాన్ చేస్తున్నారా ? ఒకవేళ అవును అయితే.. మిమ్మల్ని ఇన్ఫెర్టైల్ గా మార్చే కొన్ని కామన్ డైలీ హ్యాబిట్స్ గురించి అవగాహనకు రావాలి. వాటిని ఖచ్చితంగా తెలుసుకోవాలి.

ప్రపంచవ్యాప్తంగా.. ఇన్ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. బేబీ కోసం ప్రయత్నిస్తున్న చాలా మంది కపుల్స్.. అనేక సమస్యలను ఫేస్ చేస్తున్నారు.

ఇన్ఫెర్టిలిటీ సమస్య సాధారణంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లో స్పెర్మ్ కౌంట్, ఎరెక్టైల్ డిస్ ఫంగక్షన్, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ లో మాల్ ఫార్మేషన్స్ వంటి రకరకాల కారణాల వల్ల వస్తుంది. అయితే.. ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ కూడా ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతుంది.

త్వరగా, తేలికగా గర్భం పొందాలి అనుకునే భార్యాభర్తలు.. హెల్తీ లైఫ్ స్లైల్ ఫాలో అవ్వాలి. హెల్తీగా ఉండటానికి జాగ్రత్తపడాలి. అంటే మంచి ఆహారం, డైట్, వ్యాయామం కంపల్సరీ పాటించాలి. లేదంటే.. గర్భం పొందాలి అనుకున్నప్పుడు సమస్యగా మారుతుంది. మీరు త్వరలో బిడ్డకు పేరెంట్స్ అవ్వాలి అనుకుంటే.. ఇన్ఫెర్టిలిటీకి కారణమయ్యే ఈ డైలీ హ్యాబిట్స్ కి దూరంగా ఉండండి..

సోషల్ స్మోకింగ్

సోషల్ స్మోకింగ్

చాలామంది.. అప్పుడప్పుడు రెండు మూడు సిగరెట్స్ తాగడం వల్ల ఎలాంటి హాని జరగదని భావిస్తారు. కానీ.. మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరిలోనూ.. ఇది ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతుందని..అధ్యయనాలు చెబుతున్నాయి.

అతిగా తినడం

అతిగా తినడం

అతిగా, పరిమితికి మంచి తినడం వల్ల కూడా.. ఇన్ఫెర్టిలిటీ సమస్యకు కారణమవుతుంది. ఎక్కువగా తింటే ఒబేసిటీ బారిన పడతారు.. ఇది.. ఇన్ఫెర్టిలిటీకి ప్రధాన కారణం. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

హాట్ యోగా

హాట్ యోగా

హాట్ యోగా క్లాస్ వల్ల గది టెంపరేచర్ చాలా హాట్ గా ఉంటుంది. ఇది ఇటీవల చాలా ఫేమస్ అయింది. బరువు తగ్గడానికి ఈ యోగా చాలా ఎఫెక్టివ్ గా సహాయపడతుుంది. కానీ.. ఇలాంటి యోగా వల్ల.. ఇన్ఫెర్టిలిటీ సమస్య ఎదురవుతుంది. హీట్ వల్ల.. ఎగ్స్, స్పెర్మ్ ప్రొడక్షన్ పై దుష్ర్పభావం చూపుతుంది.

యాంటీ డిప్రెజంట్స్

యాంటీ డిప్రెజంట్స్

యాంటీ డిప్రజెంట్స్ తీసుకోవడం వల్ల కూడా.. ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతుంది. ఇవి సెక్సువల్ పర్ఫామెన్స్ విషయంలో.. ఇద్దరిలోనూ ప్రభావం చూపుతాయి. దీనివల్ల స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుంది.

ఎక్కువ ఆల్కహాల్

ఎక్కువ ఆల్కహాల్

ఇన్ఫెర్టిలిటీకి మరో అలవాటు.. రెగ్యులర్ గా.. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం. ఇలాంటి అలవాటు వల్ల.. తర్వాత స్పెర్మ్, ఎగ్ ప్రొడక్షన్ పై దుష్ర్పభావం చూపుతుంది.

విటమిన్ సప్లిమెంట్స్

విటమిన్ సప్లిమెంట్స్

కొన్ని విటమిన్ సప్లిమెంట్స్.. తీసుకోవడం వల్ల.. ఫెర్టిలిటీ సమస్య ఎదురవుతుంది. డాక్టర్ సలహా తీసుకోకుండా.. అదనంగా వాటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య ఫేస్ చేయాల్సి వస్తుంది.

ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ తాగడం

ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ తాగడం

ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగడం వల్ల కూడా.. ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతుంది. ఎందుకంటే.. ప్లాస్టిక్ లో ఉండే మలినాలు హార్మోన్స్ పై దుష్ర్పభావం చూపుతాయి.

English summary

These Daily Habits Can Make You Infertile!

These Daily Habits Can Make You Infertile! Infertility is a condition in which the couple is unable to reproduce, in spite of having unprotected sex.
Story first published: Friday, October 7, 2016, 10:33 [IST]
Desktop Bottom Promotion