Just In
- 33 min ago
నోటి దుర్వాసన రాకుండా నాలుకను ఎలా శుభ్రం చేసుకోవాలి?
- 35 min ago
National Doctors’ Day 2022 :వైద్య రంగానికి జీవితాన్ని అంకితం చేసిన బిదన్ చంద్ర రాయ్ గురించి నమ్మలేని నిజాలు..
- 1 hr ago
Ashada Bonalu 2022 in Telangana :బోనం అంటే ఏమిటి? బోనాల పండుగ జరుపుకునేందుకు గల కారణాలేంటో తెలుసా...
- 2 hrs ago
బ్లాక్ టీ లేదా మిల్క్ టీ, ఏ టీ తాగాలో తెలుసుకొని ఆరోగ్యంగా ఉండండి..
Don't Miss
- News
బీజీపీ మీటింగ్ వేళ : యశ్వంత్ సిన్హా - సీఎం కేసీఆర్ సమావేశం : హీటెక్కుతున్న రాజకీయం..!!
- Automobiles
మారుతి సుజుకి చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తుందా.. కారణం ఇదేనా..?
- Technology
108MP క్వాలిటీతో Xiaomi నుంచి సరికొత్త మొబైల్ రానుందా?
- Finance
EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో వడ్డీ డబ్బులు.. తెలుసుకోండి ఇలా..
- Movies
Virata Parvam 12 Days Collections: భారీ నష్టాల దిశగా విరాట పర్వం.. 14 కోట్లకు వచ్చింది ఇంతే!
- Travel
మనసును బంధించే బన్నెరఘట్ట నేషనల్ పార్క్!
- Sports
బంగ్లాదేశ్తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన వెస్టిండీస్.. వన్డే, టీ20 జట్లు ఇవే, ఆ ముగ్గురు ఔట్..!
మీరు ప్రెగ్నంట్ అయ్యారని కన్ఫర్మ్ చేసే వివిధ టెస్ట్ లు..!
ఓవల్యూషన్ రోజులు తెలుసుకోవడం ప్రెగ్నన్సీ ప్లాన్ లో చాలా ముఖ్యమైనది. ఒకవేళ మీరు ప్రెగ్నంట్ అయ్యారా లేదా అనేది తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా, ఉత్సాహంగా ఉంటే.. ఒవల్యూషన్ తర్వాత కొన్ని రోజులకు.. ప్రెగ్నన్సీ టెస్ట్ చేయించుకోవచ్చు.
అయితే ప్రెగ్నంట్ అయ్యారు అన్న ఫీలింగ్ చాలా సందర్భాలు, చాలా లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు. బాడీలో చేంజెస్, బ్రెస్ట్ లో పెయిన్, పీరియడ్ మిస్ అవడం, తరచుగా యూరిన్ కి వెళ్లడం, వాజినల్ డిశ్చార్జ్ వంటి లక్షణాలన్నీ ప్రెగ్నన్సీని సూచిస్తాయి. అయితే.. కొన్నిసార్లు అన్ని లక్షణాలు కనిపించినా.. ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ అవకపోవచ్చు. అయితే.. ప్రెగ్నన్సీ టెస్ట్ ఎలా చేయించుకోవాలి ? ఏయే ఆప్షన్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

జాగ్రత్తలు
గర్భం పొందండం, గర్భం పొందాలనుకోవడం మహిళలకు జీవితంలో చాలా అద్భుతమైన అనుభూతులను, అనుభవాలను ఇస్తుంది. ప్రెగ్నంట్ అవడానికి ముందు సరైన డైట్, డాక్టర్ చెక్ అప్స్ చేయించుకోవడం చాలా అవసరం. అలాగే.. చాలా జాగ్రత్తగా ఉండటం కూడా అవసరం.

బ్లడ్ టెస్ట్
మీరు ప్రెగ్నంట్ అయ్యారా లేదా అనేది తెలుసుకోవడానికి ఇదో బెస్ట్ పద్ధతి. బ్లడ్ టెస్ట్ ద్వారా హెచ్ సీ జీ లెవెల్స్ గుర్తించి.. ప్రెగ్నన్సీని డాక్టర్ కన్ఫర్మ్ చేస్తారు. ఒవల్యూషన్ అయిన 11 రోజుల తర్వాత.. బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే.. తెలుసుకోవచ్చు.

యూరిన్ టెస్ట్
ప్రెగ్నంట్ అయ్యారా లేదా అన్నది తెలుసుకోవడానికి మరో మార్గం ఇది. యూరిన్ లో హెచ్ సీ జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని చూపిస్తే.. ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ అయినట్టే. ఒకవేళ మీరు యూరిన్ టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే.. ఒవల్యూషన్ డే తర్వాత 13వ రోజు చేయించుకోవాలి.

టెస్ట్ కిట్
ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి మరో మార్గం.. టెస్ట్ కిట్. ఇది ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. మెడికల్ షాపులో అందుబాటులో ఉండే హోం ప్రెగ్నన్సీ కిట్ లో.. యూరిన్ డ్రాప్స్ వేయాల్సి ఉంటుంది. దాని ద్వారా మీరు ప్రెగ్నంట్ అయ్యారా లేదా అనేది గుర్తించవచ్చు. అయితే.. ఇది అన్నిసార్లు.. సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు.

పీరియడ్స్ మిస్ అవడం
పీరియడ్స్ మిస్ అయిన తర్వాత.. ప్రెగ్నన్సీని గుర్తించవచ్చు. అయితే.. పీరియడ్స్ మిస్ అవడానికి మరే ఇతర కారణాలైనా కావచ్చు. కాబట్టి.. పీరియడ్స్ మిస్ అయితే.. గైనకాలజిస్ట్ ని సంప్రదించి.. ప్రెగ్నన్సీని కన్ ఫర్మ్ చేసుకోవడం మంచిది.