Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
మగవారిలో డిప్రెషన్ ప్రెగ్నెన్సీ అవకాశాలను తగ్గించవచ్చు
మగవారిలో డిప్రెషన్ ప్రెగ్నెన్సీ అవకాశాలను తగ్గించవచ్చు
ఇంతకుముందు పరిశోధనలను ఉదహరిస్తూ, పరిశోధకులు సంతాన సాఫల్యం చికిత్సలు చేయించుకోవాలని ప్రయత్నిస్తున్న ఆడవాళ్లలో 41 శాతం మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారని తెలిపారు. అదే సంతాన సాఫల్య చికిత్సలకోసం ప్రయత్నించే మగవారిలో దాదాపు 50శాతం మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు.
సంతానలేమికి చికిత్స పొందుతున్న జంటల్లో మగవారిలో ఉన్న డిప్రెషన్ కి గర్భం దాల్చే అవకాశాలు తక్కువవ్వటానికి సంబంధం ఉన్నదని ఒక అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం, జంటల్లో పెద్ద డిప్రెషన్ లేని మగవారికంటే మేజర్ డిప్రెషన్ ఉన్న మగవారు 60 శాతం తక్కువగా గర్భం దాలుస్తారని తెలిపింది.

మరోవైపు, సంతాన సాఫల్యంపై ఆడవారి డిప్రెషన్ ఏ ప్రభావం చూపించలేదు.
అదనంగా, నాన్ సెలక్టివ్ సెరోటోనిన్ రీ అప్ టేక్ ఇన్హిబిటర్స్ (నాన్-ఎస్ ఎస్ ఆర్ ఐలు) అనే ఒక తరగతికి చెందిన యాంటీడిప్రెస్సెంట్లు వాడటం కూడా సంతాన సాఫల్య చికిత్స పొందుతున్న ఆడవారిలో త్వరగా అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా పెంచుతాయి.ఈ అధ్యయనం ఫెర్టిలిటీ మరియు స్టెరిలిటీ జర్నల్ లో ప్రచురితమైంది. కానీ మరో తరగతికి చెందిన యాంటీ డిప్రెసెంట్లు ఎస్ ఎస్ ఆర్ ఐలు గర్భస్రావాలకి కారణం కాదు. అలాగే ఆడవారిలో డిప్రెషన్ కానీ, ఏ ఇతర తరగతికి చెందిన యాంటీడిప్రెసెంట్లు కానీ ప్రెగ్నెన్సీ రావటానికి సంబంధం కలిగి వుండవు.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్’స్ యూనిస్ కెన్నడీ ష్రివర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్ మెంట్ (ఎన్ ఐసిహెచ్ డి),మేరీలాండ్,యూఎస్ లో పనిచేసే ఎస్థర్ ఐసెన్ బెర్గ్ మాట్లాడుతూ, “ మా పరిశోధన సంతానలేమి పేషంట్లకి,వారి డాక్టర్లకి చికిత్సా పద్ధతుల గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు కొత్త సమాచారం అందిస్తుంది.
ఇంతకుముందు పరిశోధనలను ఉదహరిస్తూ, పరిశోధకులు సంతాన సాఫల్యం చికిత్సలు చేయించుకోవాలని ప్రయత్నిస్తున్న ఆడవాళ్లలో 41 శాతం మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారని తెలిపారు. అదే సంతాన సాఫల్య చికిత్సలకోసం ప్రయత్నించే మగవారిలో దాదాపు 50శాతం మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు.

ఈ పరిశోధనకి, టీం 1650 స్త్రీలు, 1608 పురుషులను నాన్ ఐవిఎఫ్ చికిత్సలను కోరుతున్న జంటల్లో డిప్రెషన్ ప్రభావంపై డేటాను విశ్లేషించింది. 2.28 శాతం మంది మగవారితో పోలిస్తే స్త్రీలలో, 5.96 శాతం మంది మేజర్ డిప్రెషన్ తో బాధపడుతున్నారు.
యాంటీ డిప్రెసెంట్లు వాడని వారికంటే నాన్ ఎస్ ఎస్ ఆర్ ఐలు వాడే స్త్రీలలో మొదటి మూడునెలల్లో గర్భస్రావం 3.5 రెట్లు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.



Click it and Unblock the Notifications
