పిల్లల్ని కనడానికి మగవారికి సరైన వయస్సు ఏది?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

పిల్లలని కనడానికి అమ్మాయికి సరైన సమయం ఏదనేదానిపై చాలా చర్చలు జరిగాయి కానీ పురుషులకు ఎప్పుడు తండ్రవటం కరెక్టో చాలా తక్కువగా చర్చించారు.

నిజానికి, మగవారు కూడా ఆరోగ్యమైన పిల్లలను కనడానికి సరైన వయస్సు అవసరమనే అవగాహన కలిగి ఉండాలి.

ఒక అధ్యయనం ప్రకారం, 40 ఏళ్ళకు పైబడిన భాగస్వాములున్న స్త్రీలలో, గర్భధారణకి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కానీ 25 ఏళ్ల వయస్సు ప్రాంతంలో భాగస్వాములున్న స్త్రీలు తొందరగా గర్భవతులవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వాస్తవాలు ఇదిగో.

What Is The Right Age For A Man To Have A Baby?

టెస్టోస్టిరాన్ స్థాయిలు

ఒక వ్యక్తి 30 ఏళ్ళ వయస్సు దాటాడంటే, అతని టెస్టోస్టిరాన్ స్థాయిలు ఏడాదికి 1% చొప్పున తగ్గుతూ పోతాయి. వీర్యకణాల ఉత్పత్తిపై కూడా ప్రభావం ఉంటుంది.

వీర్యకణాల నాణ్యత

వీర్యం నాణ్యత విషయానికొస్తే, 35 ఏళ్ళ తర్వాత నుండి తగ్గిపోతుంది. అంతేకాదు, వయస్సు పైబడుతున్న కొద్దీ, వీర్యకణాల కదలికపై కూడా ప్రభావం పడుతుంది.

What Is The Right Age For A Man To Have A Baby?

కదలిక

శుక్రకణాల నాణ్యత, కదలిక, ఆరోగ్యం 25 ఏళ్ళకి ముందు సరిగ్గా ఉంటాయి. 55 ఏళ్ళ తర్వాత నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది. ఆ సమయానికి మగవాళ్ళు సంతానోత్పత్తి సామర్థ్యం 50 శాతానికి పైగా కోల్పోతారు.

జీవన విధానం, అలవాట్లు

వయస్సే కాక, మగవారి సంతానోత్పత్తిపై ప్రభావం చూపే విషయాలేంటి? పొగతాగడం, పోషకాహారలోపం, బిగుతు లోదుస్తులు ధరించటం, నిద్రలేమి ఇవన్నీ మగవారి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.

What Is The Right Age For A Man To Have A Baby?

సరైన వయస్సు

అయితే ఒక వ్యక్తి తండ్రి అవటానికి సరైన సమయం ఏది? 22-25 ఏళ్ళ మధ్య వయస్సు అన్నిరకాలుగా సరైనది అయినా, చాలామంది ఆ సమయానికి స్థిరపడకపోవచ్చు. అందుకని 28-30 ఏళ్ళ మధ్య వయస్సు ఒక వ్యక్తి తండ్రవటానికి మంచి సమయం. 30 తర్వాత మగవారికి కూడా టైంబాంబు మొదలైనట్టే !

యుక్తవయస్సా?

ఒక అబ్బాయి తన యుక్తవయస్సు (15-19 ప్రాంతంలో)లో వీర్యకణాల ఉత్పత్తిని ప్రారంభిస్తాడు. ఆ సమయంలో కూడా పిల్లలు కలగవచ్చు. అందుకని అంత చిన్నవయస్సులో అలా జరగకుండా జాగ్రత్తపడటమే మంచిది.

What Is The Right Age For A Man To Have A Baby?

డిఎన్ ఎ

30 ఏళ్ళ తర్వాత, ప్రతి సంవత్సరం టి స్థాయిలు మెల్లగా పడిపోతూనే ఉంటాయి. 35 ఏళ్ళ తరవాత డిఎన్ ఎలో అనువర్తనాలు కూడా జరుగుతాయి. అందుకని అంతకుముందే పిల్లలని కనటం మంచిది.

English summary

What Is The Right Age For A Man To Have A Baby?

A lot has been discussed and debated about the right age for women to get pregnant but a very less has been discussed about the right age for men to become a father.