For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శృంగారం తర్వాత గర్భం వద్దనుకుంటున్నారా? అయితే ఈ పద్ధతులు పాటించండి..

|

ఈరోజుల్లో గర్భనిరోధక పద్ధతులలో చాలా మార్పులు వచ్చాయి. ఈరోజుల్లో పెళ్లి అయిన అబ్బాయిలు మరియు అమ్మాయిలు, పెళ్లి కాని పురుషులు, స్త్రీలు కలయిక తర్వాత గర్భం వద్దనుకుంటే అందుకు అనేక సులభమైన పద్ధతులు వచ్చాయి. ఇప్పుడిప్పుడే మన దేశంలో వీటిపై అవగాహన పెరుగుతోంది.

 Contraception Methods

ఇంతకుముందు కూా గర్భదారణను నివారించడానికి అనేక సరళమైన మార్గాలున్నాయని చాలా మందికి తెలీదు. అలాంటి వాటిపై ప్రచారం చేసేందుకు, అందరికీ అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 26వ తేదీన ప్రపంచ గర్భనిరోధక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సో ఈరోజు గర్భ నిరోధకానికి ఎలాంటి పద్ధతులు పాటించాలి. ఏమేమీ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

సరైన సమయంలో..

సరైన సమయంలో..

ఈ మధ్య కాలంలో చాలా మంది జంటలు శృంగారం మాత్రం నిత్యం కావాలని కోరుకుంటున్నారు. కానీ సంతానం విషయంకొచ్చేసరికి వాయిదా వేసుకుంటున్నారు. ఎందుకంటే వారు ఆర్థిక, కుటుంబ సమస్యలు ఇతర కారణాల వల్ల అని తెలుస్తోంది. కానీ ఇందుకోసం వారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి.సరైన సమయంలో చర్యలు తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది.

సహజమైన పద్ధతులు..

సహజమైన పద్ధతులు..

సంభోగం తర్వాత గర్భం రాకుండా ఉండాలంటే గర్భనిరోధక పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. ఈ మధ్యన చాలా మంది మహిళలు కొన్ని రకాల పిల్స్ ను వేసుకుని గర్భధారణను నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రతిసారీ ఇలా చేస్తే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక, ఇలా కాకుండా మరింత సులభమైన, సహజమైన పద్ధతులను పాటించాలి. పురుషులు సంభోగం సమయంలో కండోమ్ వాడితే మహిళలకు గర్భం రాకుండా నిరోధించవచ్చు.

పురుషులకు కూడా మాత్రలు..

పురుషులకు కూడా మాత్రలు..

సంభోగం తర్వాత స్త్రీలకు గర్భం రాకుండా ఉండేందుకు ఇదివరకు మహిళలకు మాత్రలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం పురుషులకు సైతం మాత్రలు మార్కెట్లో లభిస్తున్నాయని సమాచారం. ఇవి వేసుకుంటే కండోమ్ వేసుకోకుండా సంభోగంలో పాల్గొనవచ్చంట. కానీ ఇవి అంత ప్రామాణికమైనవి కావు అని అంతా సురక్షితం అని కూడా ఇంకా శాస్త్రవేత్తల ద్వారా నిరూపించబడలేదు.

భవిష్యత్తులో సమస్యలు..

భవిష్యత్తులో సమస్యలు..

గర్భం రాకుండా ఉండటానికి దుష్ప్రభావాలు కలిగించే మందులను కచ్చితంగా మానేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు గర్భం దాల్చే అవకాశాలను అవి నాశనం చేసే అవకాశం ఉంది. అందుకే నిపుణుల సలహాలు, సూచనలు మేరకు మహిళలు మెడిసిన్స్ తీసుకోవాలి. లేదంటే మీకు చిక్కులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అత్యవసర గర్భనిరోధక మాత్రలు.

అత్యవసర గర్భనిరోధక మాత్రలు.

చాలా మంది మహిళలు అసురక్షిత సంభోగం తర్వాత అత్యవసర గర్భనిరోధక మాత్రలను వాడుతుంటారు. కానీ వీటిలో రక్తస్రావం, కడుపునొప్పి, గొంతు, రొమ్ములలో సమస్యలు వంటి దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ మహిళలు గర్భం రాకుండా ఉండేందుకు వీటిని వాడుతున్నారు. ఇలాంటివి కూడా వాడకూడదు.

సంభోగం తర్వాత..

సంభోగం తర్వాత..

పురుషులు, స్త్రీలు సంభోగం తర్వాత మహిళలకు గర్భం రాకుండా ఉండేందుకు 48 గంటలలోపు ఓ పిల్ ను తీసుకోవాలి. ఈ పిల్ ఫలదీకరణ గుడ్డు యొక్క అమరికను అడ్డుకుంటుంది. దీని వల్ల స్త్రీలకు గర్భం రాకుండా వాయిదా వేసుకోవచ్చు.

IUD లేదా ఇంట్రాటూరైన్ అనే పరికరం..

IUD లేదా ఇంట్రాటూరైన్ అనే పరికరం..

IUD లేదా ఇంట్రాటూరైన్ అనే పరికరం గర్భనిరోధక పద్ధతులలో సురక్షితమైనది. ఇది T- ఆకారంలో ఉండే ప్లాస్టిక్ ముక్కలా ఉంటుంది. ఇది మహిళ గర్భాశయంలోకి చొప్పించబడుతుంది. వీటిని వైద్యుల సంరక్షణలోనే చేయించుకోవాలి. వీటితో పాటు ఇంకా వివిధ రకాలైన గర్భాశయ పరికరాలు ఉన్నాయి. వీటిలో ఒక మహిళ ప్రొజెస్టిన్ యొక్క రాగిని ఎంచుకోవచ్చు. IUD చొప్పించిన తర్వాత, గర్భవతి అయ్యే అవకాశాలు మిలియన్లలో ఒకటి. దీనిని గర్భదారణ నివారించుకోవాలనుకునే ఈ పరికరాన్ని 72 గంటల్లోపు స్త్రీ గర్భాశయంలో చేర్చాలి. అంతే కాదు సంభోగం తర్వాత ప్రభావవంతమైన గర్భనిరోధక పద్ధతులను పరిగణనలోకి తీసుకునే ముందు స్త్రీ జననేంద్రియ నిపుణుడిని సంప్రదించడం కూడా చాలా ముఖ్యమనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.

English summary

World Contraception Day 2019: Effective Contraception Methods After Unprotected Sex

IUD - The IUD or the intrauterine device is one of the safest and effective contraception methods for women. This is a T-shaped piece of plastic which is inserted into the uterus of the woman. The minor surgery is performed only by a certified doctor. There are different types of intrauterine devices out of which a woman can choose a copper of a progestin one. After the insertion of the IUD, the chances of getting pregnant are one in a million. However, this device needs to be inserted in the uterus of the woman within 72 hours in order to prevent an unplanned pregnancy.
Story first published: Thursday, September 26, 2019, 16:22 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more