For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Child Growth: మా బాబు అస్సలే ఎదగడం లేదు అని టెన్షన్ పడే తల్లులు ఇది తెలుసుకోండి

పిల్లలు సరిగ్గా తినడం లేదని, ఎదుగుదల సరిగ్గా లేదని ఇలాంటి వాటి గురించి చాలా మందిలో ఆందోళన మొదలవుతుంది.

|

Child Growth: అమ్మతనం అనేది దేవుడు ప్రసాదించే వరం. ప్రతి స్త్రీ జీవితంలోనూ ఇదో గొప్ప సందర్భం. నవమాసాలు మోసి, జన్మను ఇచ్చిన బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటుంది తల్లి. వారికి ఏ చిన్న దెబ్బ తగిలిన తను విలవిల్లాడిపోతుంటుంది. ప్రతి ఒక్క తల్లికి తన పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది.

Concerned about child growth? Here are the facts every mother should know in Telugu

పిల్లలు ఎదుగుతున్న క్రమంలో చాలా మంది తల్లుల్లో ఒక టెన్షన్ మొదలవుతుంది. సరిగ్గా తినడం లేదని, ఎదుగుదల సరిగ్గా లేదని ఇలాంటి వాటి గురించి చాలా మందిలో ఆందోళన మొదలవుతుంది. అయితే పిల్లల అభివృద్ధి గురించి తల్లులు కాక ఇంకెవరు ఆలోచిస్తారు చెప్పండి.. మీరు కూడా మీ పిల్లల ఎదుగుదలపై ఆందోళన చెందుతున్నారా.. అయితే ఇక్కడ కొన్ని గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి.

ప్రతి పిల్లాడు భిన్నంగా ఉంటాడు

ప్రతి పిల్లాడు భిన్నంగా ఉంటాడు

తల్లులు గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి అంశం ప్రతి పిల్లాడు భిన్నంగా ఉంటాడని గమనించడం. ప్రతి బిడ్డ ప్రత్యేకమైనది. విభిన్న నేపథ్యం, విభిన్న కుటుంబాలు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పిల్లలందరూ ఒకేలా ఎదగడం ఎలా సాధ్యమవుతుంది. ఒకే కుటుంబంలో పెరిగిన పిల్లలు కూడా ఒకే రకమైన ఎదుగుదలను కనబర్చలేరు.

నార్మల్ రేంజ్

నార్మల్ రేంజ్

కొంత మంది పిల్లలు సంవత్సరం లోపు నడవడం మొదలు పెడతారు. కొంత మంది ఇంకా ముందుగానే నడక ప్రారంభిస్తారు. మరికొందరైతే 15 నెలలు దాటినా నడవడం నేర్చుకోలేరు. కాబట్టి వేరే వారి పిల్లలు త్వరగా నడవడం మొదలు పెట్టారని, చిన్న పిల్లలు కూడా నడుస్తున్నారని, మాట్లాడుతున్నారని ఆందోళన చెందడం మానేయాలి.

ఎదుగుదల ఒకే రకంగా ఉండదు

ఎదుగుదల ఒకే రకంగా ఉండదు

బోర్లా పడటం, పాకడం, నడవడం, మాట్లాడటం ఇలాంటివి కొందరు పిల్లలు చాలా త్వరగా చేస్తుంటారు. మరికొందరు చాలా ఆలస్యంగా చేస్తుంటారు. కాబట్టి పిల్లలు నడవడం, మాట్లాడటం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొందరు పిల్లలు అయితే 2 ఏళ్లు కాగానే చిన్న చిన్న పదాలు అనడం మొదలు పెడతారు. మరికొందరు 4 ఏళ్ల వరకు మాట్లాడలేరు.

పిల్లలు అందరూ ఒకేలా ఉండరు. ఒకే సమయంలో నడవలేరు.. మాట్లాడలేరు.

ఆందోళనను పరిష్కరించుకోలేకపోతే..

ఆందోళనను పరిష్కరించుకోలేకపోతే..

పిల్లల ఎదుగుదలపై మీలో ఆందోళన మీకు మీరుగా పరిష్కరించుకోలేక పోతే వైద్యుల సాయం తీసుకోవడం ఉత్తమం. పిల్లలను పూర్తి స్థాయిలో పరీక్షించి వారి ఎదుగుదలను వైద్యులు అంచనా వేస్తారు. ఒకవేల పిల్లల అభివృద్ధిలో సమస్య ఉన్నట్లు గుర్తించినట్లైతే అందుకు పరిష్కార మార్గాన్ని కూడా చెబుతారు.

పిల్లల్లో ఆరోగ్యకరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి చిట్కాలు:

పిల్లల్లో ఆరోగ్యకరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి చిట్కాలు:

* తల్లిదండ్రులు పిల్లలతో ఆడుకోవాలి. ఇతర వ్యక్తులతో, ఇతర పిల్లలతో ఆడుకునేందుకు వీలు కల్పించాలి. అప్పుడే వాళ్లు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు.

* పిల్లలు అందుకునే ఎత్తులో కొన్ని వస్తువులు ఉంచండి. వాటి కోసం పాకినప్పుడు, నడిచినప్పుడు అవి అందుకుంటే వారిలో ఉత్సాహం వస్తుంది.

* పిల్లలు కొత్త విషయాలు నేర్చుకునే వీలు కల్పించాలి. అందుకు అనుగుణమైన ఆట బొమ్మలు అందుబాటులో ఉంచాలి. బ్యాటరీలు అవసరం లేని బొమ్మలకు ప్రాధాన్యత ఇవ్వండి.

English summary

Concerned about child growth? Here are the facts every mother should know in Telugu

read on to know Concerned about child growth? Here are the facts every mother should know in Telugu
Story first published:Thursday, December 8, 2022, 17:40 [IST]
Desktop Bottom Promotion