For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గృహిణిలు అందంగా.. ఉత్తమంగా ఉండడం ఎలా?

|

తల్లి అయిన తరువాత అందాన్ని కాపాడుకోవడం కొంచం కష్టమైనా పనే. అందాన్ని కాపాడుకోవడానికి తగిన సమయాన్ని మరియు డబ్బుని చాలా మంది తల్లులు కేటాయించలేరు. ఇంట్లోనే ఉండే తల్లులకి వారి రూపురేఖల్ని తీర్చి దిద్దుకోవడానికి సరిపడా సమయం ఉండదు. బయటికి ఎక్కువగా వెళ్ళే అవసరం ఉండదు కాబట్టి వారు కూడా అందం పైన ఎక్కువగా శ్రద్ధ కనబరచరు. అటువంటి గృహిణిలు సులభమైన పద్దతులలో అందంగా కనిపించేందుకు కొన్ని సూచనలు.

1. పరిశుభ్రతకి తగిన ప్రాధాన్యతనివ్వండి. క్లాసీ మామ్ గా ఉండడానికి ఇది ముఖ్యమైన ప్రాధమిక నియమం. కొత్తగా తల్లి అయిన వారికి ఎన్నో పనులుండడం వల్ల రోజుకొకసారి స్నానం చేయడానికి కూడా సమయం చిక్కదు. కానీ స్నానానికి ప్రాధాన్యత నివ్వండి. స్నానం చేసిన తరువాత మీరు ఎంతో ఉత్తేజం పొందుతారు. తల్లిగా మీరు చేయవలసిన పనులని ఎన్నైనా చాకచక్యంగా త్వరత్వరగా పూర్తి చేయగలుగుతారు.

మీ ముఖాన్ని చక్కటి క్లేన్సేర్ తో కడగండి. షాంపూ చేసి కండీషనర్ చేసుకోండి. మీ చంకలో షేవ్ చేసుకోండి. మీ కాళ్ళని, ఇంకా బికినీలోని ప్రాంతాన్ని షేవ్ చేసుకోండి. పూర్తిగా వదిలేయడం కంటే, ఇలా వారానికి ఒకసారి చేసినా పరవాలేదు.

2. మీకు నప్పే సొగసైన హెయిర్ స్టైల్ ని ఎంచుకోండి. గర్భిణి గా ఉన్నప్పటినుండి హెయిర్ స్టైల్ గురించి పట్టించుకునే తీరిక ఉండదు. సెలూన్ కట్ మరియు రంగులు ఖరీదైనవి. అంతే కాక ఆ రంగులు మంచివి కావు కూడా. తొమ్మిది నెలల తరువాత మారిపోయిన జుట్టు తీరుని తీర్చిదిద్దుకునేందుకు సమయం మరియు డబ్బు అందుబాటులో ఉండవు. కాబట్టి, మీ హెయిర్ స్టైల్ ని పొందికగా అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఇది అనువైన సమయం.

How to Be a Classy Mom...

మీకు ఒక వేల పొట్టి జుట్టు నచ్చితే బాబ్ స్టైల్ ని ప్రయత్నించండి. పొడవైన జుట్టు నచ్చితే లాంగ్ లేయర్స్ ని ప్రయత్నించండి. సులభంగా మీకు నచ్చిన హెయిర్ స్టైల్ కోసం ట్రిం చేయించుకోండి.

మీ జుట్టు పొడవుగా ఉన్నట్టయితే, ఒక వైపు జుట్టుని పోనీ టైల్ గా కట్టుకుని ఎలాస్టిక్ ని పెట్టుకోండి. ఈ హెయిర్ స్టైల్ జిమ్ హెయిర్ స్టైలే కంటే బెటర్ గా ఉంటుంది. ఈ హెయిర్ స్టైల్ సులభంగా చేసుకోవచ్చు. ఇంట్లో వేసుకోగలిగే సహజమైన రంగులని మీ జుట్టుకి అప్లై చెయ్యండి.

మీ ఐబ్రోస్ ని వాక్సింగ్ చేయించుకోలేకపోతే కనీసం అనవసరపు జుట్టుని తీసివేయడానికి ప్రయత్నించండి.

3. మీ మేకప్ ని సింపుల్ గా ఉండేటట్లు చూసుకోండి తప్ప ఎప్పుడూ మేకప్ ని స్కిప్ చేయవద్దు. సన్ స్క్రీన్ కలిగిన మోయిస్చరైజర్ ని తప్పకుండా వాడండి. మీకు సమయం తక్కువగా ఉన్నప్పుడు ఐ లాషెస్ ని వంపు తిప్పి మస్కారా అప్లయ్ చేయండి. మాములు రోజుల్లో ఐ లైనర్ మరియు ఐ షాడో అప్లయ్ చేసుకోండి. పింక్ లేదా బ్రౌన్ రంగులకి ప్రాధాన్యత నివ్వండి.

4. సాధారణమైన మరియు సులభంగా మైంటైన్ చేయగలిగిన బట్టలని ఎంచుకోండి. సులభంగా ఇంట్లోనే ఉతుక్కోగలిగిన స్వేట్టర్స్ మరియు కార్డిగన్స్ ని ఎంచుకోండి. చదునైన నిట్ టాప్స్ మరియు కాప్రిస్ లని ఎండాకాలం లో ఉపయోగించేందుకు కొనండి. జీన్స్, స్లాక్స్ మరియు బాలెట్ ఫ్లాట్స్ కి జతగా వేసుకోవడానికి తక్కువ హీల్ కలిగిన బూట్లని ఎంచుకోండి. వర్కౌట్ కి వాకింగ్ కి వెళ్ళినప్పుడు తప్ప మిగతా సమయాలలో టెన్నిస్ షూస్ ని వాడడం తగ్గించండి.

5. రోజువారి వాడకానికి సాధారణమైన నగలని ఏర్పాటు చేసుకోండి. చిన్న పిల్లలు మెడలో ఉన్న నగలతో, చెవి రింగులతో ఆడడం సర్వ సాధారణం. అలా అని నగలు వాడటాన్ని పూర్తిగా నిర్మూలించవద్దు.

6. క్రమం తప్పకుండా మానిక్యుర్ మరియు పెడిక్యుర్ చేయించుకోండి. రెండు వారాలకొకసారి మీ చేతులు మరియు పాదాలు అందంగా కనిపించడానికి సెలూన్ కి వెళ్లకపోయినా వీలైనప్పుడల్లా వెళ్ళండి.

7.తగినంత వ్యాయామం చేయండి. మీ పిల్లలని సరదాగా నడకకి తీసుకు వెళ్లడమో లేదా మీ కుటుంబంతో కలిసి డిన్నర్ తరువాత సరదాగా నడవడమో చేయండి. ఇంటి దగ్గర చేయగలిగే వ్యాయామాలను తెలుసుకోండి. టీవీ లో ఇంట్లో చేయగలిగే సాధారణ వ్యాయామాల గురించి వచ్చిన ప్రోగ్రామ్స్ చూసి అవి ప్రయత్నించండి. మీరు మధ్యాహ్నం పూట కునుకు తీసే సమయంలో నే సరిపోయే ఈ వ్యాయామాల వల్ల ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. మీ బేబీ బరువుని కూడా తగ్గించాలనుకుంటే ఆన్ లైన్ కాలరీ కౌంటర్ లో చేరవచ్చు.

8. మీ చిరునవ్వు అందంగా, తెల్లగా ఉండేలా జాగ్రత్త పడండి. క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించండి. ఇంట్లోనే వైట్నింగ్ సిస్టం ని పాటించండి.

9. ప్రశాంతంగా, వినయంగా ఉండండి. అలసిపోవడం, ఒత్తిడికి గురవడం వల్ల ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాలు కనబడతాయి. వారానికి ఒక సారైనా బయటికి వెళ్ళండి. సహాయం కోసం మీ లాంటి తల్లుల గ్రూప్ లో చేరండి. పనిలో తీవ్రంగా మునిగిపోవడం వల్ల మీ ప్రియమైన వారిమీద లేదా ఇతరుల మీద చిటపట లాడే అవకాశం కలదు. కాబట్టి, ప్రశాంతంగా ఉండండి.

జాగ్రత్తలు

వ్యాయామం మొదలు పెట్టే ముందు మీ డాక్టర్ ని సంప్రదించండి. ప్రసవం తరువాత మీరు వ్యాయామం మొదలు పెట్టాలనుకుంటే తప్పనిసరిగా వైద్యుని సలహా తీసుకొనవలెను.

English summary

How to Be a Classy Mom... | మమ్మీలు క్లాస్ గా కనిపించడం ఎలా...?

Staying classy through motherhood can be a challenge. Mothers often don't have the time and money they used to have to put towards keeping up appearances. Stay at home moms especially may have a hard time staying motivated to look good when they don't get out as often. Here are some tips for staying classy after becoming a mom.
Story first published: Monday, December 24, 2012, 11:46 [IST]
Desktop Bottom Promotion