For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొదటి సారి ప్రెగ్నెన్సీ లక్షణాలు ఎలా తెలుస్తాయి...!

|

స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్నితమైన వాటినుండి తీవ్రమైనవిగా ఉండి నివృత్తి కోసం వైద్యుని సలహా తీసుకోవడం జరుగుతుంది. వైద్యుని నిర్ధారణలో గర్బం వల్ల వచ్చిన మార్పులో లేక శారీరకంగా కొన్ని వ్యాధుల వల్ల కలిగే మార్పులో తెలుస్తుంది. కొన్ని సార్లు ఇటువంటి శారీరక మార్పులు ఫ్లూ, అపెండిసైటిస్ లేక మోనోపాజ్ వల్ల సంభవించవచ్చు.గర్బధారణ సమయంలో శరీరంలో సహజంగా కలిగే మార్పుల్ని పరిశీలిద్దాం.

నెల తప్పడం: రుతుస్రావం రాకపోవడం అనేది చాలా ముఖ్యమైన సూచన. దీనినే నెల తప్పడంగా కూడా వ్యవహరిస్తారు. సహజంగా స్త్రీ యొక్క ఋతుచక్రం 28 రోజులు ఉంటుంది. ఎండోమెట్రియమ్ పొర గర్భాశయం గోడ నుంచి ఊడిపోయి సన్నటి ముక్కలుగా రక్తంలో కలిసి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అదే రుతుస్రావం.
స్త్రీలో రుతుస్రావం అనేది వారం రోజుల కంటే ఎక్కువ రోజులు ఆలస్యం అయితే ఇది గర్బదారణకి మంచి సూచన. అయితే, ఈ అలస్యమనేది ప్రతి ఒక్కరికి గర్బధారణ వల్లే కాకపోవచ్చు. కొంతమందిలో, ఆకస్మిక ఆహార మార్పులు అలాగే బరువులో మార్పులు ఇంకా ఆత్రుత స్థాయిలని బట్టి కూడా రుతుస్రావం ఆలస్యంగా వచ్చే అవకాశాలున్నాయి.

How To Know if you are pregnant

వేవిళ్ళు: గర్భదారణ సమయంలో మరొక ముఖ్యమైన సూచన వికారం. సహజంగా చాలా మందిలో ఉదయం పూట ఈ వికారం కనపడడం వల్ల దీనిని మార్నింగ్ సిక్ నెస్ అని కుడా అంటారు. గర్భం ధరించిన తర్వాత రెండు వారాలకి మొదలై పద్నాలుగు వారాల వరకూ వేవిళ్ళు కొనసాగవచ్చు. గర్భధారణ సమయంలో గర్భిణీలకు సిగరెట్ పొగ, వండిన ఆహార పదార్ధాల వాసనలు అలాగే అత్తరు సువాసనలలో వికారం కలిగించే గుణాలు మెండుగా ఉంటాయి. దీనికి కారణం, వాసన గ్రహించే శక్తి అధికమవ్వడమని వైద్యులు అంటారు. ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి తేడాల వల్ల కొంతమందికి జీర్ణ వ్యవస్థలో వచ్చే మార్పుల వల్ల వాంతులు కనబడతాయి. అంతే కాకుండా, చాలా మందిలో తమకిష్టమైన ఆహార పదార్ధాల పట్ల అనాసక్తత ఏర్పడుతుంది. చిత్రంగా కొంత మందిలో ఇంతకు ముందు ఇష్టపడని ఆహార పదార్ధాల మీద అమితమైన ఇష్టం ఏర్పడుతుంది. ఇలాంటి మార్పులు మొదటి త్రైమాసికంలో గమనించవచ్చు.

రొమ్ములలో సున్నితత్వం: గర్భిణీ స్త్రీలలో సహజంగా కనపడే మరొక మార్పు రొమ్ములు సున్నితంగా మారడం. గర్భం ధరించినప్పుడు కలిగే హార్మోన్ల మార్పుల వల్ల స్తనాలలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. శిశువు ఎలా అయితే ఎదుగుతూ ఉంటుందో అదే వేగంలో స్తనాలలో మార్పులు కూడా సంభవిస్తాయి. నెలతప్పడం, వికారాలతో పాటు, స్తనాలలో కలిగే మార్పులు గర్భధారణకి మంచి సూచన. ఈ సమయంలో చిన్నపాటి స్పర్సకి కూడా రొమ్ములు నొప్పికి గురవుడంతో పాటు బరువుగా అనిపించడం, జలదరింపు వంటివి గర్భిణులకు అనుభవంలోకి వస్తాయి. చనుమొనలు కూడా సున్నితంగా మారడం వల్ల దుస్తులు మార్చుకునేటప్పుడు ఇబ్బందికి గురవడం చనుమొనలు నల్లగా పెద్దగా అవడం కూడా గమనించవచ్చు.

English summary

How To Know if you are pregnant | మీరు గర్భం దాల్చారని ఎలా తెలుసుకుంటారు?

As the body transforms to accommodate its new tenant, a woman may experience some notable changes whether she realizes she's pregnant or not. These symptoms can range from very mild to severe, normally leading to a doctor's appointment to either confirm the pregnancy or to dispel notions that she's suffering from a variety of other conditions, ranging from appendicitis to the flu, to even menopause.
Desktop Bottom Promotion