For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కూళ్ళల్లో సెల్ ఫోన్ సంచలనం........

By B N Sharma
|

Cellphones To Revolutionize Classroom Studies
ప్రపంచమంతా సెల్ ఫోన్ తాకిడికి బెంబేలెత్తుతూ బ్యాన్ చేసేస్తామంటూంటే.......ఒకే ఒక్క దేశం మాత్రం సెల్ ఫోన్లను స్కూళ్ళలో ప్రవేశపెట్టటం ఏమంత నష్టం కాదని, ఒక టీచింగ్ పరికరంగా వుంటుందని భావిస్తోంది. న్యూజిలాండ్ లోని స్కూళ్లు త్వరలోనే తమ తరగతి గదులలో సెల్ ఫోన్ లను ప్రవేశ పెట్టనున్నాయి. కారణం. దీనిని ఒక హైటెక్ విద్యాబోధనగా భావిస్తోంది. సెల్ ఫోన్లలో విద్యార్ధులు తమ ఆన్సర్లను టీచర్లకు వినిపిస్తారట.

యాక్టివ్ ఎక్స్ ప్రెషన్ అనేది ఒక కొత్త పరికరం. దీనిలో టీచర్లు ఒక కంప్యూటర్ ద్వారా బోర్డుపై కొన్ని ప్రశ్నలు చూపుతారు. ఇక విద్యార్ధులు వారి ఆన్సర్లను వారి యాక్టివ్ ఎక్స్ ప్రెషన్ సెల్ ఫోన్ ద్వారా ఇచ్చేస్తారు. ఆ పరికరం వెంటనే విద్యార్ధుల సమాధానాలను బోర్డుపై వుంచేస్తుంది. టీచర్లు తరగతి గదిని ఇక ఒక చూపులో పసికట్టేయగలరు.

సౌత్ లాండ్ లోని ఒక బాలికల పాఠశాలలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు. సాధారణ పద్ధతులకంటే ఈ పద్ధతి చాలా బాగుందని ఆనందిస్తున్నామని ఏడవ తరగతి చదివే విద్యార్ధి కెయిట్లన్ వుడ్ తెలిపాడు. కేంటర్బరీ యూనివర్శిటీ ఇ-లెర్నింగ్ ప్రొఫెసర్ నికి డేవిస్ మేరకు ఈ పద్ధతి విద్యార్ధులకు ఎంతోప్రోత్సాహాన్నిస్తోందని, ఆధునిక విద్యార్ధులకు బాగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. టీచర్లు కూడా విద్యార్ధులతోపాటు అదే పేజీలో రాయటమనేది మరింత సౌకర్యంగా వుందని తెలిపారని డేవిస్ చెపుతున్నారు. తరగతిలోని పిల్లలు వారు చెప్పే టాపిక్ అర్ధం చేసుకున్నారా లేదా అనేది వెంటనే తెలుసుకోవడం టీచర్లకు ఆనందంగా వుందని టీచర్లు చెపుతున్నారు.

ఈ పద్ధతే మరింత అభివృద్ధి చెందితే ప్రపంచమంతా అంగీకరిస్తుంది కూడాను.

English summary

Cellphones To Revolutionize Classroom Studies | స్కూళ్ళల్లో సెల్ ఫోన్ సంచలనం.......

"Teachers find it exciting that they can go on to the same page as the students," Davis added. She said that the system enables teachers to immediately grasp the class's understanding of a topic.
Story first published:Thursday, September 29, 2011, 11:49 [IST]
Desktop Bottom Promotion