For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కృష్ణాష్టమి 2019 : అందరిని అలరించే అష్టమి... శ్రీకృష్ణ జన్మాష్టమి!

శ్రీకృష్ణుడి దుస్తులు ఏ రకంగా వుండాలో పిల్లవాడిని ఏరకంగా ఆ వేషానికి తీర్చిదిద్దాలో చూద్దాం!

By B N Sharma
|
Dressing Kids like Krishna for Janmashtami

ముద్దువచ్చే చిన్ని క్రిష్ణుడంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు శ్రీకృష్ణుడి జన్మదినమైన క్రిష్ణాష్టమి రోజున చిన్ని క్రిష్ణుడి డ్రస్ వేసి మురిసిపోవటం జరుగుతుంటుంది. ఇక ఆరోజు పిల్లలకు తమ స్కూలులో ఫ్యాన్సీ డ్రస్ పోటీలు, వారిలో ఉత్తమ వేషధారికి బహుమతులు, మొదలగునవి ఎన్నో ఉంటాయి. పిల్లలు మగ, ఆడ బేధం లేకుండా ఈ కాంపిటీషన్ లలో పాల్గొంటారు. వీరు వేసే ఈ దుస్తులకు పెద్దగా వ్యయం లేకపోవడం కూడా దీనిని ప్రోత్సహిస్తోంది. శ్రీకృష్ణుడి దుస్తులు ఏ రకంగా వుండాలో పిల్లవాడిని ఏరకంగా ఆ వేషానికి తీర్చిదిద్దాలో చూద్దాం!

మొదటగా మీ చిన్నారిని శ్రీకృష్ణుడిగా అలంకరించేటపుడు, అసలు అతనికి ఆ డ్రస్ ఇష్టమో కాదో తెలుసుకోవాలి. ఎందుకంటే డ్రస్ వేసిన తరువాత అతను ఆ ఇష్టాన్ని తన ముఖంలో కూడా ప్రతిబింబించాలి. డ్రస్ వేయటమే కాదు తల్లులు కృష్ణుడి జీవిత గాధను కూడా వివరించాలి. దీనితో బాలుడు తాను స్టేజిపై అదేరకమైన అనుకరణను చేస్తాడు. ఆశించిన రీతిలో పోటీలో గెలుపొందుతాడు. గెలవటం లేదా ఓడటం ఆటలో ఒక భాగమని కూడా పిల్లాడికి ముందుగానే చెప్పాలి.

వేషం సరిగ్గా వుండాలంటే, సరి అయిన దుస్తులు ధరించి హావభావాలను ప్రదర్శించాలి. దుస్తులతో పాటు అందుకవసరమైన నగలు, చేతబట్టే మురళి లేదా వెన్న నిండిన కుండ మొదలైనవి కూడా వుంటే వేషం సహజంగా వుంటుంది. సమయానికి తగినట్లు ఒక విగ్ కూడా ధరిస్తే మరింత బాగుంటుంది.

కృష్ణుడి వేషం వేయాలంటే కావలసిన సరంజామా .....

1. పీతాంబరం (పసుపురంగు సిల్కు ధోవతి) పై బట్టతో వుండాలి.
2. నీలిరంగు (కెమికల్ కానిది)
3. నగలు
4. నెమలి పింఛంతో ఒక కిరీటం
5. ఫ్లూట్
6. పూలదండ
7. మేకప్ కిట్
8. ఒక విగ్గు

అలంకరణ ఎలా చేయాలి?

ధోవతి నడుముకు కట్టండి. కిరీటం కిందే విగ్ పెట్టి కిరీటానికి నెమలి పింఛం పెట్టండి. చెవులకు చక్కటి రింగులు, ఎంపిక చేసిన నీలి రంగును శరీరమంతా రాయండి. నగలు, పూలదండ అలంకరించండి. బుగ్గలు కొద్దిగా ఎరుపు, కనుబొమ్మలుకు నల్లటి రంగు వేయండి. మీ వద్దగల రెడ్ లిప్ స్టిక్ తో నుదుటిపై తిలకాన్ని దిద్దండి. ఇక అంతే...మీ చిన్ని క్రిష్ణుడు రెడీ!

English summary

Dressing Kids like Krishna for Janmashtami

Since the janmashtami of lord krishna is here we have a fancy dress idea for kids. Both boys/girls look cute with the krishna dress on the hindu religious festival. The attire is not expensive and can be dressed easily in a few hours. Take a look at how to dress your kid like Krishna.
Desktop Bottom Promotion