For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీనేజి పిల్లల సమస్యలకు పరిష్కారాలు!

By Staff
|

How To Deal With Teenage Behavior Problems?
టీనేజ్ పిల్లల సమస్యలు పరిష్కరించటం తల్లి తండ్రులకు కష్టమే. యౌవనంలో హార్మోన్ల మార్పులు జరిగి భావాలు త్వరగా మారిపోతూంటాయి. శారీరక మార్పు, మానసిక మార్పు, పిల్లలలో కలిగే అభివృద్ధి, పరిపక్వత అన్ని కలసి ఒకే సారి సమస్యలు తెచ్చిపెడుతూంటాయి. పిల్లలు మొండిగా ప్రవర్తిస్తూంటారు. దేనినైనా ఒప్పుకోవాలంటే వారికి ఇష్టం వుండదు. దానికితోడు తల్లితండ్రులు ఇరవై నాల్గు గంటలూ వారిని వెన్నంటి వుండటం వారికి కోపం తెప్పిస్తుంది.

ఈ పరిస్ధితుల్లో తల్లితండ్రులు తెలివిగా, సహనంగా వ్యవహరించి వారి సమస్యలు తీర్చాలి. ఎదిగే వయసు మీ బిడ్డ జీవితాన్ని శాశ్వతం పాడు చేయవచ్చు. కనుక సహనం వహించండి. మీ పిల్లలకు స్నేహితులవ్వడానికి ప్రయత్నించండి. బిడ్డ తన సమస్యలు మీతో చెప్పుకునేలా చేయండి. మీ పిల్లలకుగల స్నేహితులు కూడా వారి ప్రవర్తనను మార్చేయవచ్చు. కనుక మీ పిల్లల స్నేహితులు ఎవరనేది తెలుసుకొని సరి అయినది కాకుంటే, వారిని దూరం పెట్టేలా చేయండి. పిల్లలను వీలైనంత వరకు ఔట్ డోర్ ఆటలకు ప్రోత్సహించండి. దీనితో వారు చెడు స్నేహాలనుండి దూరంగా కూడా వున్నట్లవుతుంది.

పిల్లాడు మొండికేస్తే, నచ్చ చెప్పి సమస్యపై అవగాహన ఏర్పడేలా చేయండి. టీనేజ్ లో తలపొగరుగాను, మొండితనంగాను వుండే అవకాశాలుంటాయి. తమను తాము మెయిన్టెయిన్ చేయగలమనుకుంటారు పిల్లలు. అందుకని పిల్లాడిని కొంత సేపు తన ఫ్రెండ్స్ తో వదిలేసి స్వతంత్రంగా ఆనందించనివ్వండి. ఇది వారిలో విశ్వాసాన్ని నింపుతుంది.

తల్లితండ్రులు వారి పిల్లలను ఒత్తిడి చేయరాదు. పిల్లల ఆలోచనలను విని వాటిలోని లోపాలను సరిదిద్ది తమ ఇంటి వాతావరణానికి అనుకూలంగా పిల్లలు ప్రవర్తించేలా చేయాలి. మీ బిడ్డను ఇంటి విషయాలు, నిర్ణయాలలో కూడా భాగం వహించేలా చేయండి. దీనితో అతను మరింత భాధ్యతగా వుంటాడు. టీనేజ్ ప్రవర్తన ఎంతో సహనంతో భరించాల్సివుంటుంది. తల్లితండ్రులు కోపిస్తే పిల్లలు మరింత వ్యతిరేకించే అవకాశం వుంది. తరచుగా కోప్పడితే వారు తల్లితండ్రులను ప్రేమించరు కూడాను.

ఎట్టి పరిస్ధితులలోను ఎదిగిన పిల్లలపై చేయి చేసుకోవడం లేదా తిట్టడం వంటివి చేయరాదు. ఇలా చేస్తే వారు మరింత మొండిగా తయారై నియంత్రణ తప్పి తల్లితండ్రులను ద్వేషించే స్ధాయికి వస్తారు. పిల్లలు ఎదిగారని వారికి తమ అవసరం అధికంగా వుండదని కూడా తల్లితండ్రులు తెలుసుకోవాలి. కనుక, తిట్టడం, కోపించడం పిల్లల సమస్యలకు పరిష్కారం కాదు. పిల్లాడు మిమ్మల్ని ఒక బెస్ట్ ఫ్రెండ్ గా భావించి ప్రవర్తించాలి. వారు తప్పు చేసినప్పటికి పేరెంట్స్ కొన్ని విషయాలలో తేలికగా భావించాలి. తప్పులు అధికమైతే నియంత్రణకుగాను దండన కూడా తప్పదని గ్రహించాలి.

English summary

How To Deal With Teenage Behavior Problems? | టీనేజి పిల్లల సమస్యలకు పరిష్కారాలు!

Teenage behavior problems are difficult for parents to handle. Teens are prone to hormonal changes due to which they have mood swings and changed teenage behavior. Physical change, mental change, maturity and development in the child and makes them difficult to tackle with such changes within them.
Desktop Bottom Promotion