Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
టీనేజ్ తంటాలు - పెద్దల పాట్లు!

కనుక తల్లితండ్రులు టీనేజ్ పిల్లలతో చాలా సున్నితంగా వ్యవహరించాలి. ఎదిగే వయసు మీ బిడ్డను శాశ్వతంగా పాడు చేయవచ్చు. కనుక సంయమనం పాటించండి. మీ పిల్లాడికి స్నేహితులవండి సన్నిహితత్వం పెంచుకోండి. దానిని పెంచుకోండి. పిల్లాడు తన సమస్యలు మీకు చెప్పుకునేలా చేయండి. అతనికిగల స్నేహితులు కూడా ప్రవర్తన మారటానికి కారణం కావచ్చు. కనుక అతని స్నేహితులను సైతం పరిశీలించండి. ఫ్రెండ్స్ సర్కిల్ సరి లేదనుకుంటే, పిల్లవాడి ఆసక్తి తెలుసుకొని ఆటలకు ప్రోత్సహించండి. చెడు విషయాలనుండి తప్పించినట్లవుతుంది. పిల్లాడు మొండిగా వుంటే, నిదానంగా మార్చండి, సమస్యలను అర్ధం చేసుకునేలా చూడండి.
సాధారణంగా టీనేజ్ ప్రవర్తన మొండిగా, అహంకారంగా వుండేలా చేస్తుంది వారి సంగతులు వారే చూసుకోగలమని అనుకునే దశ వచ్చేసిందనుకుంటారు. అటువంటపుడు వారిని మంచి స్నేహితుల మధ్యలో కొన్నాళ్ళు వదిలేసి తనంత తాను నిర్వహించుకునే దశకు తీసుకురండి.
వీలైనంత వరకు తల్లి తండ్రులు వారి భావాలను ఉద్దేశాలను పిల్లలపై రుద్దరాదు.
పిల్లలను క్రమేణా ఇంటి విషయాలలో పెట్టాలి. నిర్ణయాలు చేయించాలి. దీనితో వారు భాధ్యతగలవారిగా ప్రవర్తిస్తారు.
టేనేజ్ సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించాలి. ఏ మాత్రం వ్యతిరేకం చెప్పినా వారి ప్రవర్తన మరింత వ్యతిరేకమై వారు మీ నుండి విభజన పొందే అవకాశం వుంది. తరచుగా చివాట్లు వేయటం కూడా వారు తమ తల్లితండ్రులకు చెందటం లేదని భావిస్తారు. ఎదిగిన పిల్లపై చేయిచేసుకోవటం లేదా తిట్టటం వ్యతిరేక ఫలితాలనిస్తుంది. వారు తల్లితండ్రులను అసహ్యించుకుంటారు. అలాగని అధికంగా కూడా వారిని ప్రేమించవద్దు. ఎదిగిన పిల్లలు మిమ్మల్ని ఒక మంచి స్నేహితుడాగా భావిస్తూ వారి తప్పులనుసరిదిద్దగల సహకారం ఇచ్చేవారిగా పరిగణిస్తే చాలు. అయితే, పిల్లలు చేసే తప్పులు గనుక తీవ్రమైనవైతే, వారి టీనేజ్ ప్రవర్తనను నియంత్రించటానికి దండన కూడా తప్పదన్నది గుర్తుంచుకోవాలి.



Click it and Unblock the Notifications
