For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలవాట్లుగా మారుతున్న ఆన్ లైన్ తిండి చేష్టలు!

By B N Sharma
|

Online Games Can Promote Nutritious Food!
నేటికాలం పిల్లలు ఏదైనా పది నిమిషాలపాటు చూస్తే చాలు దానిని ఆచరించేస్తారు. అయితే, అది ఇంట్లోని పెద్దలను చూసి కాదు సుమా? టీవీలు లేదా వీడియో గేములో చూసి..ఆచరిస్తారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం వారిపై బాగా వుంది. వారు ఆడే వీడియో గేమ్ లోని హీరో కనుక సోడాలు, బిస్కట్లు పక్కకు విసిరేసి వాటి స్ధానంలో అరటిపండు, పండ్ల రసం వంటివి తీసుకుంటే పిల్లలు కూడా అదే విధంగా అరటిపండు, పండ్లరసం వంటి పోషకాహారాలు తీసుకునే అవకాశాలు మెండుగా వున్నాయని ఒక తాజా పరిశోధన వెల్లడించింది.

తినే పదార్ధాలు ఆరోగ్యకరమైనవైనా లేక అనారోగ్యకరమైనవైనా పిల్లలపై టీవీ లేదా వీడియోల ప్రభావం అధికంగా వుందని వాషింగ్టన్ డిసి లోని జార్జ్ టవున్ యూనివర్శిటీ రీసెర్చర్లు వెల్లడించారు. వీరు 9 నుండి 10 సంవత్సరాలలోపు పిల్లలపై పరిశోధన చేశారు. వీరికి వీడియో గేములు ఆడే సమయంలో అందులోని కేరెక్టర్లు వివిధ రకాల ఆహార పదార్ధాలను తీసుకోవడం విడి విడిగా చూపారు. వీడియో ఆటల ముగింపు తర్వాత అన్ని పదార్ధాలను తినడానికి వారి ముందు వుంచగా, సోడాలు, బిస్కట్లు వీడియోలో చూసిన పిల్లలు వాటిని, పండ్లు, పండ్ల రసాలు వీడియోలో చూసిన పిల్లలు పండ్లు, పండ్ల రసాలు మాత్రమే తిన్నట్లు తెలిపారు.

కనుక, ఇకపై ఇండ్లలో పిల్లలకు ఆరోగ్యకర ఆహారపుటలవాట్లు ఏర్పడాలంటే తల్లితండ్రులు తాము ఎంపిక చేసే వీడియో గేములు, లేదా టివి ప్రోగ్రాములు పిల్లలపై మంచి ప్రభావం చూపేవిగా వుండాలన్న వాస్తవాన్ని గ్రహిస్తే మంచిది.

English summary

Online Games Can Promote Nutritious Food! | పిల్లలు పోషకాహారం తినాలంటే... !

You do what you see. No, not from elders but from characters you see on TV, and now its Video Games. In the game, Pac Man, if a child makes it eat bananas in lieu of soda, than the gamer, i.e. the child him self has every possibility to do the same.
Story first published:Tuesday, November 1, 2011, 11:41 [IST]
Desktop Bottom Promotion