For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్నాక్స్ తింటే పిల్లల ఏకాగ్రత అధికం!

By B N Sharma
|

Snacks May Improve Kids Concentration
పిల్లలకు ఏకాగ్రత కావాలా? ధ్యానం చేయమని అడగకండి. వారికిష్టమైన తియ్యని కూల్ డ్రింక్ లు ఇతర స్నాక్ లు ఇచ్చేయండి. స్టడీస్ లో వారికిక కావలసినంత ఏకాగ్రత. ఈ అంశం ఒక తాజా పరిశోధనలో తేలింది. ప్రైమరీ స్కూల్ విద్యార్ధులకు చక్కని కూల్ డ్రింక్ లు, వివిధ రకాల స్నాక్స్ ఇచ్చి చూశారు. వారిలో ఏకాగ్రత ఎంతో పెరిగిందట. అయితే ఈ అధ్యయనంలో తేలిన ఫలితాలకు ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారట. పిల్లలకు జంక్ ఫుడ్ అలవాటై షుగర్ అధికంగా వుండి వారిలో హైపర్ యాక్టివిటీ కలిగి మరింత అల్లరి చేసేస్తారని టీచర్లు వాపోతున్నారట.

అయితే సైంటిస్టులు మాత్రం కొద్దిపాటిగా వీటిని ఇచ్చినప్పటికి ఫలితం బాగానే వుంటుందని చెపుతున్నారు. షుగర్ హైపర్ యాక్టివిటీనిస్తుందని ఎక్కడా రుజువు కాలేదని. ఇది పిల్లలలో మెమొరీని, ఏకాగ్రతలను పెంచుతుందని ప్రొఫెసర్ డెవిడ్ బెంటన్ చెప్పినట్లు టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది. అయిదు నుండి పదేళ్ళ లోపు పిల్లలకు పెద్దవారితోపోలిస్తే రెండింతల గ్లూకోజ్ కావాలని, అయితే, శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగా కాక బ్రెయిన్ తనకవసరమైన గ్లూకోజ్ ను నిల్వ వుంచుకోలేదని, అది ఎప్పటికపుడు రక్తంలోనుండే తీసుకుంటుందని అధ్యయన కర్తలు చెపుతున్నారు.

పిల్లలకు కొద్ది మొత్తంలో ఎక్కువసార్లు తినిపించాలని, కాని నేడు వారికి అధికంగా ఒకే సారి తినిపిస్తూ వుండటం వలన అధిక బరువు సమస్యలు వస్తున్నాయని కూడా ఈ ప్రొఫెసర్ చెపుతున్నారు.
స్టడీలో, బెంటన్ 16 మంది 9 - 10 సంవత్సరాల పిల్లలకు గ్లూకోజ్ వున్న పండ్లరసాలను ఆర్టిఫిషియల్ డ్రింకులను ఇచ్చారు. వీరందరకు మెమొరీ పరీక్షలు పెడితే 10 శాతం మెమొరీ పెరిగినట్లు తేలింది.
తరగతిలో ఇచ్చే పనికి 11 నుండి 20 నిమిషాలు అధికంగా కూడా వీరు చేయగలిగినట్లు తేలింది.
అయితే, పిల్లలకు ఆర్టిఫిషియల్ డ్రింక్ లు కు బదులుగా తాజా పండ్ల రసాలవంటివి ఇవ్వాలని బెంటన్ ప్రతిపాదిస్తున్నారు.

English summary

Snacks May Improve Kids Concentration | స్నాక్స్ తింటే పిల్లల ఏకాగ్రత అధికం!

In the research, Benton gave 16 nine and ten-year-olds fruit squash containing either artificial sweetener or glucose, a basic form of sugar. When the children consumed glucose, he found their memory test scores improved by over ten per cent.
Story first published:Friday, September 16, 2011, 10:47 [IST]
Desktop Bottom Promotion