For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలకు జ్వరం వస్తే ఆహారం ఏం యివ్వాలి?

By B N Sharma
|

What To Feed Kids During Fever?
పిల్లలకు సాధారణంగా జ్వరాలు వస్తూనే వుంటాయి. ఈ సమయంలో వారికి ఏ ఆహారాలు యివ్వాలనేది సమస్యగా వుంటుంది. ఏది ఇచ్చినప్పటికి వారు దానికి వారు అయిష్టత చూపుతారు. కాని వారు త్వరగా కోలుకోవాలంటే కొంత ఆహారం ఇవ్వవలసిందే. అటువంటపుడు వారికి ఇవ్వవలసిన ఆహారాలు ఎలా వుండాలంటే....

1. దాలియా లేదా గోధుమ రవ్వ - గోధుమ ఉడికించి అందులో కొన్ని కూరగాయలు వేసి అతి కొద్దిగా నెయ్యి లేదా వెన్న వేసి వేడి వేడిగా పిల్లలకిస్తే వారికి ఆ సమయంలో అవసరమైన పోషకాలు శరీరానికంది త్వరగా కోలుకుంటారు.
2. చికెన్ లేదా కూరల పులుసు - నమిలే ఆహారాలు తినటానికి పిల్లలు ఇష్టపడకపోతే, కొన్ని రకాల కూరలు వేసిన చక్కటి సూప్ తయారు చేయండి. తినే వారైతే ఇందులో చికెన్ కూడా వేయవచ్చు. చివరకు ముక్కలు అన్నీ వడగట్టి పలుచగా వున్న ద్రవానికి పెప్పర్ వంటివి కలిపి ఇస్తే మంచి రుచిగా వుండి వారికి తీసుకోవడం తేలికగాను ఆసక్తి కరంగాను వుంటుంది.
3. గోంగూర లేదా బచ్చలికూర పులుసు - గోంగూర, బచ్చలి ఆకులలో విటమిన్లు, ఐరన్ వుంటాయి. ఈ ఆకులను బాగా ఉడికించి కొద్దిపాటి ఉప్పు, పెప్పర్, కొంచెం నెయ్యి లేదా వెన్న వేస్తే చాలా రుచిగా వుంటుంది. తయారు చేయటం చాలా తేలిక. త్వరగా అయిపోతుంది.
4. పాల ఉత్పత్తులు - జ్వరంగా వున్నపుడు, పాలు లేదా ఇతర పాల సంబంధిత పదార్ధాలు ఇవ్వకండి. జీర్ణమవటం కష్టంగా వుంటుంది. సాధారణంగా తల్లులు బిడ్డలకు ఇటువంటి సమయంలో ఒక గ్లాసెడు పాలు ఇస్తారు. ఈ అలవాటు మానండి. బలహీనంగా వున్న జీర్ణ వ్యవస్ధకు పాలు లేదా పాల సంబంధిత ఇతర పదార్ధాలు బిడ్డకు ఇవ్వరాదు.

పిల్లలకు ఆరోగ్యం సరిగా లేనపుడు పైన పేర్కొన్న ఆహారాలు ఇస్తే వారికి సౌకర్యంగా వుండి తినటానికి, జీర్ణించుకోటానికి తేలికగా వుండి, శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

English summary

What To Feed Kids During Fever? | పిల్లలకు జ్వరం వస్తే ఆహారం ఏం యివ్వాలి?

Diary Products Bad For Fever: It is the natural tendency of a mother to force the child to have a glass of milk when he or she has fever but it is a very bad tactic. Reserve the goodness of milk for other occasions because milk and milk products are not the best fever food to have.
Story first published:Monday, October 31, 2011, 10:39 [IST]
Desktop Bottom Promotion