Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
పిల్లలలో ఆత్మ విశ్వాసం పెంచాలంటే చిట్కాలు!

పిల్లలలో ఆత్మ విశ్వాసం నెలకొల్పటం ఎలా?
ఆత్మ విశ్వాసం - బిడ్డ ఆత్మ విశ్వాసం కలిగి వుంటే ముందు తనపట్ల జాగ్రత్త వహిస్తాడు. తల్లితండ్రులు అతనిలోని మంచి గుణాలను అభినందించి చెడు గుణాలను సరిచేయాలి. అతనికి ఒక వ్యక్తిత్వం రావాలంటే ఈ రకమైన పరిశీలన, సర్దుబాటు అవసరం. అతనికి అతను తక్కువగా అంచనా వేసుకోకుండా చూడాలి. తనను తానను కించపరచుకునే పిల్లవాడు జీవితంలో పైకి రాలేడు.
ప్రోత్సహించండి - మీ ఆలోచనలు, ఉద్దేశ్యాలు అతనిపై రుద్దకండి. అతని ఆలోచనలకు ప్రాధాన్యతనివ్వండి. అతడు విఫలమైనా సరే మీరు అతను సరిగా ప్రవర్తించటానికి దోహద పడండి. తప్పులు పెద్దలు కూడా చేస్తారు. కనుక అతని తప్పులను కూడా మీరు సహనంతో సరిదిద్దండి. పిల్లవాడు తప్పులనుండే పాఠాలు నేర్చుకుంటాడు. క్రమేణా అతని ప్రవర్తన మెరుగుపడుతుంది. కనుక అతనిని గమనిస్తూ కొత్త అంశాలు నేర్పండి.
అవకాశం - పిల్లవాడికి ఒక అవకాశం ఇవ్వండి. నిర్ణయాలను చేయమనండి. ఫలితాలు ఎలా వున్నా మీరు సహనంతో వుండి, సరైన తీరు కలిగి వుండండి. మీ బిడ్డకు అవకాశం ఇవ్వటం ద్వారా అతని విశ్వాసాన్ని ఏకాగ్రతలను మెరుగుపరుస్తారు. అతనిని కుటుంబ వ్యవహారాలలో కూడా ఆరోగ్యకరంగా భాగస్వామని చేయండి. మీ బిడ్డ అతని సమస్యలను స్వంతంగా పరిష్కరించుకోటానికి ప్రయత్నం చేయమనండి. ఆత్మ విశ్వాసం పెరగాలంటే ఇది ఒక సమర్ధవంతమైన చర్య.
రోల్ మోడల్ - అతని లక్షం మేరకు ఒక రోల్ మోడల్ చూపండి. మీరే అతనికి ఆ రోల్ మోడల్ లేదా మార్గదర్శి కావచ్చు. పిల్లవాడు చిన్న వాడవటంచేత కుటుంబ సభ్యులనుండే నేర్చుకుంటాడు. చెడు ప్రవర్తన, చర్యలు కూడా అతి తేలికగా నేర్చుకుంటాడు. కనుక మీరు ఎల్లపుడూ పిల్లవాడి ముందర పాజిటివ్ ప్రవర్తన కలిగి వుండండి. మీ పిల్లవాడు మీ నుండి ఎలా నేర్చుకుంటున్నాడో గ్రహించండి.
మీ పిల్లవాడిలో ఆత్మ విశ్వాసం మెరుగుపడాలంటే ఈ చిట్కాలు ఆచరించండి. అతిగా చేస్తే అది అధిక విశ్వాసానికి కూడా దోవతీస్తుందని గ్రహించండి. పిల్లవాడి తప్పులను కప్పి పెట్టకండి. అతనితో చర్చించి వాటిని సరి చేయండి. నిరుత్సాహ పరచకండి. మీ బిడ్డపై అధిక ఒత్తిడి పెట్టకండి. ఇలా చేస్తే అతని ఏకాగ్రత, విశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications