For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు చదువుపై ఏకాగ్రత, శ్రద్ద పెట్టాలంటే: కొన్ని సులభ చిట్కాలు

|

ప్రతి రోజూ కిలోలకు కిలోల బరువుండే బ్యాగులు భుజాలకు వేసుకుని పిల్లలు స్కూలుకు వెళ్తుండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే రోజంతా వాళ్ళు స్కూల్లో.. టీచర్లు చెప్పిన పాఠాలు వినడం, నోట్స్ రాసుకోవడం, పరీక్షలు, ఆటలు, ఇలా బిజీబిజీగా గడుపుతుంటారు. తీరా ఇంటికొచ్చేసరికి అలసిపోతారు. ఇంకేముంది తినేసి పడుకోవడమే... చదువుపై కూడా శ్రద్ద పెట్టలేకపోతారు. మరి ఇలా అయితే ఎప్పుడు చదువుకుంటారనేగా మీ డౌటు? డోంట్ వర్రీ...పిల్లలు స్కూలు నుంచి అలసిపోయి వచ్చినా వాళ్లు శ్రద్దగా చదువుకునే మార్గాలూ లేకపోలేదు...మరి అందులో కొన్ని మీకోసమే....

ప్లాన్ ప్రకారం:

ప్లాన్ ప్రకారం:

స్కూల్ నుండి వచ్చిన తర్వాత పిల్లులు ఏమేం చేయాలనే దానిపై ఓ ప్లాన్ తయారు చేసి పెట్టాలి. వచ్చిన తర్వాత ఫ్రెషప్ అవ్వడం, స్నాక్స్ తినడం, హోం వర్క్ చేసుకోవడం, చదువుకోవడం, వేళక తినడం, నిద్రపోవడం..ఇలా టైమ్ టు టైమ్ ప్రణాళిక తయారుచేసి పెట్టే బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉంది.

న్యూట్రీషియన్ ఫుడ్:

న్యూట్రీషియన్ ఫుడ్:

పిల్లలు శ్రద్దగా చదువుకోవాలంటే, వాళ్లు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే పిల్లలకు పండ్లు, కూరగాయలు, త్రుణధాన్యాలు వంటివి పోషకాహారంను మీ రెగ్యులర్ డైట్ లో ఒక భాగంగా అందించాలి. కానీ కొంతమంది పిల్లలు బటయ దొరికే జంక్ ఫుడ్ తినడానికే ఎక్కువ ఇష్టపడుతుంటారు. అది వాళ్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు..కాబట్టి, పిల్లలకు అందించే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.

అనుకూలమైన పరిసరాలు:

అనుకూలమైన పరిసరాలు:

పిల్లలు చక్కగా చదువుకోవాలంటే మరో ముఖ్యమైన అంశం..ప్రశాంతమైన పరిసరాలు, పిల్లలు చదువుకునే గది చుట్టూ పక్కలా ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే వాళ్ళు చదువుకోవడానికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చే బాధ్యత కూడా తల్లిదండ్రులదే.

రివార్డుల రూపంలో:

రివార్డుల రూపంలో:

‘చిన్నూ..నువ్వు ఈ పరీక్షలో ఫస్టొస్తే ఫలానా గిఫ్ట్ ఇన్తాను' అని మీ చిన్నారులను శ్రద్దగా చదువుకొమ్మని ప్రోత్సహించొచ్చు. దీంతో వాళ్లు చక్కగా చదువుకొనే అవకాశం కూడా ఉంది. కానీసం నెలకోసారైనా వాళ్లకిష్టమైన ప్రదేశానికి గానీ, మంచి మెసేజ్ ఉన్న సినిమాకి గానీ, లంచ్ కి ఏదైనా రెస్టారెంట్ కి గానీ,..ఇలా ఎక్కడికైనా తీసుకెళ్లండి..చదువుపై వాళ్ల శ్రద్ద మరింత ఎక్కువ అవుతుంది.

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు దూరంగా:

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు దూరంగా:

ఈ జనరేషన్ పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ ఓ పక్కన పడేసి టీవీకి అతుక్కుపోతున్నారు. అందులో పోగో, కార్టూన్, నెట్ వర్క్ లాంటి ఛానల్స్ ను ఒక్క క్షణం కూడా వదలకుండా చూస్తున్నారు. ఏదో కాసేపు చూస్తే సరే..కానీ పడుకుకే వరకూ కూడా అవే చూస్తే ఇంకెప్పుడు చదువుకుంటారు. కాబట్టి ఓ అరగంట సేపు చూడనిచ్చి తర్వాత టీవీ ఆఫ్ చేసేయాలి . అలాగే మొబైల్స్ విషయంలోనూ అంతే. పిల్లలైతే మొబైల్లో గేమ్స్ ఆడటానికి ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీని వల్ల సమయం వ్రుదా కావడం తప్ప ఎలాంటి ఉపయోగమూ ఉండదు. అందుకే సాధ్యమైనంత వరకూ పిల్లల్ని ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జైట్లకు దూరంగా ఉంచాలి.

మక్కువ పెరగాలంటే:

మక్కువ పెరగాలంటే:

చదువు పై పిల్లలకు శ్రద్ద పెరగాలంటే లేదా చదివింది బాగా గుర్తుండాలంటే చదివిన విషయాన్ని ప్రాక్టికల్ గా అప్లై చేసేలా ఉండాలి. ఉదాహరణకి: ఫిజిక్స్ లో ఏదైనా ప్రయోగం గురించి చదివినప్పుడు అది అంతగా గుర్తుండకపోవచ్చు. కానీ దాన్ని ప్రాక్టికల్ గా చేస్తే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు కాదా..!కాబట్టి పిల్లల్ని బట్టీ పద్దతిలో కాకుండా ప్రాక్టికల్ పద్దతిలో చదివిస్తే బాగా గుర్తుండటంతో పాటు మరింత మక్కువతో చదివే అవకాశం ఉంటుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం:

క్రమం తప్పకుండా వ్యాయామం:

పిల్లలు చదువుపై శ్రద్ద పెట్టాలంటే వాళ్ళు మొదట మానసికంగా శారీరకంగా ధ్రుడంగా తయారవ్వాలి. దీనికోసం క్రమం తప్పకుండా వాళ్లతో వ్యాయామం చేయించాలి. ప్రతి రోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేయడం వల్ల పిల్లలు స్కూల్లో చురుగ్గా ఉండటంతో పాటు పాజిటివ్ గా కూడా ఆలోచించగలరని శాస్త్రీయంగా నిరూపితమైంది. అదే మానసికంగా ద్రుడం కావాలంటే బుర్రకు పదును పెట్టే ఆటలు పజిల్స్ లాంటివి చేయించాలి.

English summary

Improve Concentration In Children – Tips & Suggestions

If you take a top list of common doubts and queries among the parents of school going children, the one question that will come in the first three will be’ how to help kids to study better?’ Everybody wants to make their children come out in colours when it comes to the academics.
Story first published: Thursday, July 17, 2014, 15:27 [IST]
Desktop Bottom Promotion