For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగే పిల్లల దగ్గర ప్రస్తావించని, చెప్పకూడని విషయాలు

By Swathi
|

మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా ? వాళ్ల చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నారని భావిస్తున్నారా ? పేరెంటింగ్ అనేది తేలికైన విషయం కాదు. వాళ్లు పెరిగి పెద్దవాళ్లు అయ్యే కొద్దీ.. వాళ్లను పెంచడం అనేది చాలెంజింగ్ గా మారుతుంది. ఎప్పుడైతే మీ పిల్లలకు 10 ఏళ్లు దాటుతాయో.. అప్పుడు వాళ్లు మరింత సెన్సిటివ్ గా మారతారు. వాళ్లు, వాళ్ల తల్లిదండ్రుల చుట్టూ జరుగుతున్న విషయాలను అవగాహన చేసుకుంటూ ఉంటారు.

7 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ల ఫీలింగ్స్ హర్ట్ అవకుండా జాగ్రత్త పడాలి. వాళ్ల ఫీలింగ్స్ పై ప్రభావం పడిందంటే.. నెగటివ్ ఇంపాక్ట్ పెరుగుతుంది. పేరెంటింగ్ అనేది.. చాలా పెద్ద బాధ్యత. ప్రతి చిన్న విషయంలో తప్పుని గ్రహించాలి. కానీ.. వాళ్లు ఎమోషన్ అవకుండా.. వివరించాలి. ఈ విషయంలో ఏమాత్రం ఆసహనానికి గురైనా, ఆవేశానికి గురైనా.. మానసిక సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించడం, కొన్ని విషయాలను పెరిగే పిల్లలకు చెప్పకపోవడం మంచిది..

లీవ్ మీ అలోన్

లీవ్ మీ అలోన్

పేరెంట్స్ కొన్ని సందర్భాల్లో పిల్లలు తమ మాట విననప్పుడు ఆగ్రహానికి లోనై.. లీవ్ మీ అలోన్ అంటుంటారు. ఇలా తరచుగా అనే ఈ పదం వాళ్లకు అర్థం అవుతుంది. తరచుగా వాళ్లను దూరం పెడుతూ ఉంటే.. వాళ్లు ఇన్ సెక్యూర్ గా ఫీలవుతారు.

హోప్ లెస్

హోప్ లెస్

పిల్లలను తిట్టేటప్పుడు.. వాళ్ల అప్ సెట్ అయి ఉంటారు. లేదా ఏడుస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్లు చాలా ఎమోషనల్ గా ఉంటారు. అలాంటప్పుడు వాళ్లను ఓదార్చాలి. కానీ.. కొంతమంది.. హోప్ లెస్ అంటూ.. మరింత పెద్దగా చేస్తుంటారు. ఇలాంటి పొరపాట్లు తల్లిదండ్రులు చేయకూడదు.

ఇతర పిల్లలతో పోల్చడం

ఇతర పిల్లలతో పోల్చడం

ఇతరుల పిల్లలతో మీ పిల్లలను పోల్చడం అనేది.. వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి పోల్చడం మానేసి.. వాళ్లలో కాన్ఫిడెన్స్ పెరిగేలా చేయాలి.

కొట్టేస్తా అనడం

కొట్టేస్తా అనడం

శారీరకంగా ఇబ్బందికి గురిచేయకూడదు. పిల్లలు చెప్పిన మాట విననప్పుడు కొట్టడం వంటి పనుల వల్ల.. వాళ్లలో భయం పెరిగి.. మరింత హార్డ్ గా మారే అవకాశం ఉంది.

జెండర్

జెండర్

కొంతమంది.. జెండర్ కంపారిజన్ ఎక్కువగా పెట్టుకుంటారు. ఇది పిల్లల విషయంలో మంచిది కాదు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా.. స్వతంత్రంగా ఉండాలని, ఇద్దరూ సమానమని వివరించాలి కానీ.. ఇద్దరి మధ్య పోల్చే అలవాటు మంచిది కాదు.

ఫ్యాట్

ఫ్యాట్

పిల్లల శరీరాన్ని విమర్శించకూడదు. దీనివల్ల వాళ్ల బాగోలేమన్న ఫీలింగ్ పెరిగి పెద్దవాళ్లు అవుతారు. అప్పుడు సైకలాజికల్ గా సమస్యలు ఎదురవుతాయి.

English summary

6 Things You Should Never Say To A Growing Child!

6 Things You Should Never Say To A Growing Child! Well, parenting is never an easy thing, and it can get especially challenging as your child is growing up.
Story first published:Saturday, July 16, 2016, 15:18 [IST]
Desktop Bottom Promotion