For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: మీ పిల్లలు వేధింపులకు గురవుతున్నారని తెలిపే లక్షణాలు !

By Swathi
|

ప్రస్తుత రోజుల్లో పిల్లలు చాలా ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారు. ప్రతి ఏడాది.. ఈ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే.. చాలా కేసులను.. ముందుగానే గుర్తించలేకపోతున్నారు. చాలా వరకు పిల్లలు వేధింపులకు గురవడానికి పెద్దవాళ్లు, ఇతర పిల్లలు ఎక్కువగా కారణమవుతున్నారు. ఇతరుల వల్ల హర్ట్ అయినప్పుడు పిల్లలు చాలా నిరుత్సాహానికి గురవుతారు. శారీరకంగా, ఎమోషనల్ గా చాలా బాధపడతారు.

చాలా సందర్భాల్లో పిల్లలకు బాగా తెలిసిన వాళ్లే వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. బంధువులు, చుట్టు పక్కల వాళ్లే ఎక్కువగా పిల్లలను తిడుతూ ఉంటారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు గానీ, కుటుంబ సభ్యలకు కానీ చెప్పడానికి చాలా భయపడుతూ ఉంటారు. కాబట్టి మీ పిల్లలు వేధింపులకు గురవుతున్నారని తెలిపే లక్షణాలను గుర్తించడం చాలా అవసరం. అవేంటో చూద్దాం..

ఇతరులను కలవడానికి మొండి చేయడం

ఇతరులను కలవడానికి మొండి చేయడం

ఒక వ్యక్తిని కలవడానికి ఇష్టపడకపోవడం, వాళ్లకు దూరంగా ఉండటం వంటి లక్షణాలు గుర్తిస్తే.. వాళ్ల నుంచి వేధింపులకు గురవుతున్నారని గుర్తించాలి.

కారణం లేకుండా ఏడ్వడం

కారణం లేకుండా ఏడ్వడం

ఏ కారణం లేకుండా ఏడవడం, ఎక్కడికైనా తీసుకెళ్లాలి అనుకుంటే రానని మొండికేయడం, స్నేహితుల ఇంటికి, స్కూల్, డే కేర్ వంటి ప్రాంతాలకు రావడానికి ఇష్టపడటం లేదంటే.. వేధింపులకు గురవుతున్నాడేమో ఆరా తీయాలి. కారణాలు అన్వేషించాలి.

గాయాలు

గాయాలు

తరచుగా మీ బిడ్డ గాయాలు, మచ్చలు, గిచ్చినట్టు ఉండే మార్క్స్ గుర్తిస్తే.. ఎవరో వార్నింగ్ ఇస్తున్నారని గుర్తించాలి. ఇలాంటి పరిస్థితిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలి.

ప్రవర్తనలో మార్పులు

ప్రవర్తనలో మార్పులు

మీ పిల్లల ప్రవర్తనలో ఉన్నట్టుండి మార్పులు. అంటే చిరాకు, విభిన్నమైన అఫెక్షన్, కోపం వంటి లక్షణాలు కనిపిస్తే.. ఎవరో తనను టార్చర్ చేస్తున్నారని గుర్తించాలి.

భయంకరమైన లక్షణాలు

భయంకరమైన లక్షణాలు

చాలా భయపడటం, నిద్రపోయేటప్పుడు ఉలిక్కిపడటం, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలు మీ పిల్లలను వేధిస్తున్నారని తెలుపుతాయి.

ఒంటరిగా ఉండటం

ఒంటరిగా ఉండటం

సడెన్ గా ఒంటరిగా ఉండటానికి మీ పిల్లలు ఇష్టపడటం, ఎక్కువ సమయం ఒంటరిగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అలర్ట్ అవ్వాలి.

ఫిజికల్ పెయిన్

ఫిజికల్ పెయిన్

బ్లీడింగ్, దురద, ఇతర గాయాల కారణంగా.. శరీరంలో నొప్పులు కనిపిస్తున్నాయంటే.. ఎవరో చిత్రహింసలకు గురిచేస్తున్నారని గమనించాలి. కూర్చునప్పుడు, నడిచేటప్పుడు ఏదైనా నొప్పికి లోనవుతున్నాడంటే.. కారణం కనుక్కోవాలి.

సెక్సువల్ ఇన్ఫర్మేషన్

సెక్సువల్ ఇన్ఫర్మేషన్

లైంగిక వేధింపులకు గురయ్యేటప్పుడు సెక్సువల్ కి సంబంధించిన సమాచారం చూపించడం, ఆ విషయంపై ఆసక్తి కనబరచడం, తన వయసుతో సంబంధం లేని విషయాలు ఆలోచించడం వంటి లక్షణాలు వేధింపులకు కారణమని భావించాలి.

English summary

9 Signs Your Child Is Being Abused

9 Signs Your Child Is Being Abused. It is difficult for us to even think of someone deliberately hurting a kid and yet every year cases of child abuse have been on the rise.
Story first published:Wednesday, May 4, 2016, 14:33 [IST]
Desktop Bottom Promotion