For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల్లో ఇమ్యునిటీ మెరుగుపరిచే బెస్ట్ ఫుడ్స్..!!

By Swathi
|

మీ పిల్లలు స్కూల్ కి వెళ్లడం మొదలు పెట్టారంటే.. వాళ్లకు ఖచ్చితంగా సరైన పోషకాహారం ఇవ్వాలి. అది కూడా ఇమ్యునిటీని మెరుగుపరిచేదై ఉండాలి. ఇమ్యున్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటే.. శరీరం రకరకాల ఇన్ఫెక్షన్స్, ఎలర్జీలు రాకుండా అడ్డుకోగలుగుతుంది.

హెల్తీ బాడీ పొందడానికి బ్యాలెన్డ్స్ డైట్ చాలా ముఖ్యమైనది. మీ పిల్లల డైట్ లో ఎలాంటి పోషకాహారం చేర్చాలి, వాళ్ల ఇమ్యునిటీని ఎలా పెంచాలి అనేది చాలా ముఖ్యం. రెగ్యులర్ డైట్ లో ఎలాంటి ఫుడ్స్ చేర్చడం వల్ల వాళ్ల రోగనిరోధక శక్తిని పెంచవచ్చో ఇప్పుడు చూద్దాం..

పెరుగు

పెరుగు

పెరుగులో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి పిల్లలకు చాలామంచిది. అలాగే పెరుగు.. పిల్లలో ఇమ్యునిటీని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి రెగ్యులర్ గా పిల్లలకు పెరుగు ఇవ్వాలి.

వెజిటబుల్స్

వెజిటబుల్స్

వెజిటబుల్స్ లో కెరోటనాయిడ్స్ ఉంటాయి. అలాగే కూరగాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యునిటీని పెంచుతాయి. దీనివల్ల రకరకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లి ఇమ్యునిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే.. వైట్ బ్లడ్ సెల్స్ ని పెంచుతుంది. అలాగే పిల్లల్లో అనారోగ్య సమస్యలు అరికట్టడంలో వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుంది.

క్యాలిఫ్లవర్

క్యాలిఫ్లవర్

క్యాలిఫ్లవర్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైటో కెమికల్స్, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక వ్యవస్థకు చాలా మంచిది. కాబట్టి పిల్లలకు క్యాలిఫ్లవర్ తరచుగా ఇస్తూ ఉండాలి.

వాల్ నట్స్

వాల్ నట్స్

వాల్ నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి పిల్లల్లో శ్వాససంబంధిత సమస్యలను అరికడతాయి. మీ పిల్లలకు నట్ ఎలర్జీ లేకపోతే.. రెగ్యులర్ గా వాల్ నట్స్ ని స్నాక్స్ గా ఇవ్వవచ్చు.

బెర్రీస్

బెర్రీస్

అన్ని రకాల బెర్రీస్ పిల్లలకు చాలా మంచిది. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల ఆరోగ్యానికి చాలామంచిది.

గింజలు

గింజలు

గింజలు పిల్లల ఆరోగ్యానికి, ఇమ్యున్ సిస్టమ్ కి చాలామంచిది. కాబట్టి పిల్లలకు బీన్స్, కాయధాన్యాలను రెగ్యులర్ గా అందివ్వాలి.

ఎగ్స్

ఎగ్స్

పిల్లల బ్రేక్ ఫాస్ట్ కి ఎగ్స్ చాలా ఆరోగ్యకరమైనవి. వీటిల్లో ప్రొటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండటం వల్ల.. వాళ్లలో ఇమ్యునిటీ మెరుగుపడుతుంది.

చికెన్ సూప్

చికెన్ సూప్

చికెన్ సూప్ జలుబుని నివారిస్తుంది. ఇతర చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ని అరికడుతుంది. అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కాబట్టి.. అప్పుడప్పుడు మీ పిల్లలు చికెన్ సూప్ తాగేలా జాగ్రత్త పడండి.

English summary

Foods That Boost Immunity In Kids

Foods That Boost Immunity In Kids. Once your kids start going to the school, they must be given proper food that boosts the immune system.
Story first published:Wednesday, August 31, 2016, 16:42 [IST]
Desktop Bottom Promotion