For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్నారులకు పీనట్ బటర్ ను తినిపించడం అరొగ్యకరమేనా?

By Super Admin
|

పీనట్ బటర్ లో పిల్లల్లో ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సంబంధించిన ప్రోటీన్స్ అలాగే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కు సంబంధించిన ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే, ఇందులో లభించే మినరల్స్, విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. కాని, పీనట్ బటర్ ని పిల్లలకు ఇవ్వడం శ్రేయస్కరమేనా?

మీ చిన్నారి వయసు ఒక సంవత్సరంలోపు ఉంటే పీనట్ బటర్ ను వారికి ఆహారంగా ఇవ్వకూడదు. సాధారణంగా, కొంతమంది పిల్లలు పీనట్ బటర్ అలెర్జీకి గురవుతారు.

మీ చిన్నారి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నప్పుడు, పీనట్ బటర్ ను పరిచయం చేయవచ్చు. ఎందుకంటే, అప్పటికే వారి జీర్ణక్రియ వ్యవస్థ పీనట్ బటర్ ని అరిగించుకునేంతగా అభివృద్ధి చెంది ఉంటుంది.

 Is Peanut Butter Healthy For Kids?

ఒక సంవత్సరంలోపు చిన్నారులలో పీనట్ బటర్ వల్ల కొన్ని తీవ్రమైన ప్రతికూల ఫలితాలు చూపించే అవకాశముంది. వికారం, శ్వాస సమస్యలు, ఊపిరి ఆడకపోవడం, మంట లేదా వాపు వంటి లక్షణాలు అటువంటి ప్రతికూల లక్షణాలలో ముఖ్యంగా గమనించవలసినవి.

మీరు మీ చిన్నారికి పీనట్ బటర్ ని తినిపించే ముందు డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ఇప్పుడు, పీనట్ బటర్ ని సరైన వయసులోని చిన్నారులకి తినిపించడం వల్ల వారికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

చిన్నారులకు పీనట్ బటర్ ను తినిపించడం ఆరోగ్యకరమేనా?

 Is Peanut Butter Healthy For Kids?

ప్రయోజనం#1

పీనట్ బటర్ లో రిస్వెరాట్రోల్ అనే ఒక రకమైన బయోకెమికల్ ఉంటుంది. ఇది పిల్లల్లో రోగనిరోధక శక్తిని శక్తివంతం చేయడానికి తోడ్పడుతుంది తంబ్ నెయిల్ ని చూపించు

 Is Peanut Butter Healthy For Kids?

ప్రయోజనం#2

పీనట్ బటర్ వల్ల చిన్నారులలో ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ ను అరికట్టవచ్చు. పీనట్ బటర్ లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

 Is Peanut Butter Healthy For Kids?

ప్రయోజనం#3

పీనట్ బటర్ లో జింక్, సోడియం, పొటాషియం, ఫోస్ఫరస్, మగ్నీషియం, ఐరన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫోలేట్, నియాసిన్, థియామిన్, విటమిన్ బి6 మరియు రిబోఫ్లావిన్ లు లభిస్తాయి. ఇవన్నీ పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి.

 Is Peanut Butter Healthy For Kids?

ప్రయోజనం#4

పీనట్ బటర్ లో లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పిల్లలలోని మెదడు అభివృద్ధికి తోడ్పడతాయి.

 Is Peanut Butter Healthy For Kids?

ప్రయోజనం#5

పీనట్ బటర్ లో లభించే ప్రోటీన్ పిల్లలలోని పెరుగుదల మరియు అభివృద్ధికి అలాగే శరీరంలోని కండర శక్తిని అలాగే శరీర పరిమాణాన్ని ఆరోగ్యంగా మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రోటీన్ అనేది పిల్లల ఎదుగుదలలో అత్యంత ముఖ్యపాత్ర పోషిస్తుంది.

English summary

Is Peanut Butter Healthy For Kids?

Peanut butter contains protein that helps in the growth and development of a child and also certain fats that contribute to the development of the brain in achild. There are also minerals, vitamins and antioxidants that support the immune system. But is it safe to give peanut butter to kids?
Story first published: Wednesday, June 22, 2016, 6:33 [IST]
Desktop Bottom Promotion