For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల్లో పొట్టనొప్పి నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

By Lekhaka
|

మీ పిల్లలు ఏదైనా తినడానికి లేదా తాగడానికి చాలా మారాం చేస్తున్నారా ? సరే, దానికి కారణాలు చాలా ఉంటాయి. అయితే, మీ పాప/బాబుకు ప్రతి దానికి అప్పటికప్పుడు విసుగు రావడం కుడా కడుపునొప్పి రావడానికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి.

కడుపు నొప్పి అనేది పిల్లల్లో సాధారణ విషయం. ప్రత్యేకంగా 4 నుంచి 8 సంవత్సరాల లోపు పిల్లలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఈ కడుపునొప్పికి కలుషిత ఆహరం, మలబద్ధకం, కడుపులో ఇన్ఫెక్షన్ వంటి అనేక కారణాలు కావచ్చు. పిల్లల్లో ఏ కారణం చేత కడుపునొప్పి వచ్చినా, మీరు ముందు ఇంట్లో అందుబాటులో ఉండే సహజమైన వస్తువులతో వాటిని పరిష్కరించ౦డి.

సహజ పరిష్కారాలు మీకు ఇంట్లో అందుబాటులో ఉంటాయి, మీ పిల్లలు ఎటువంటి సందేహం లేకుండా వాటిని తీసుకునేందుకు మీరు ప్రయత్నం చేయండి. మీరు మీ ఇంట్లోని వస్తువులతో మీ పిల్లల కడుపు నొప్పిని వెంటనే ఎలా తగ్గించవచ్చో తెలుసుకోండి.

అల్లం

అల్లం

అల్లం లో “జింజేరోల్” అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్ పెరుగుదలను తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం అసౌకర్యాన్ని, వికారాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా, అల్లంలోని యాంటీ ఇంన్ల్ఫమేటరీ లక్షణాలు జీర్ణ రసాన్ని మెరుగుపరిచి, కడుపు ఆమ్లాలను ఎదుర్కొంటాయి. మీ బాబు/పాప కడుపు నొప్పితో బాధపడుతుంటే మీరు ఇంట్లో అల్లం టీ తయారుచేసి ఇవ్వండి, మీ పాప/బాబు ఎంత ఉపశమనం పొందుతారో చూడండి.

వేడిని అప్లై చేయండి

వేడిని అప్లై చేయండి

మీ బాబు/పాపను మంచం మీద పడుకున్నపుడు లేదా కూర్చున్నపుడు పొట్టమీద వేడి ప్యాడ్ లేదా వేడి నీటి సంచిని పెట్టండి, ఇది కొంతమేరకు నొప్పిని తగ్గిస్తుంది. మీరు వేడిని అప్లై చేసినపుడు, చర్మం ఉపరితలంలో రక్తప్రవాహం పెరుగుతుంది, ఇది పొట్టలో మొదలైన బాధను తగ్గిస్తుంది.

తేలికైన ఆహరం పెట్టండి

తేలికైన ఆహరం పెట్టండి

కడుపులో నొప్పి ఉన్నప్పుడు కూడా మీ బాబు/పాప ఆకలిగా ఉంది అంటే, పెరుగు, టోస్ట్, అన్నం ఓట్మీల్ వంటి తేలికైన పదార్ధాలను కొద్ది మోతాదులో తినిపించండి. నూనె, స్పైసీ పదార్ధాలు పెట్టొద్దు ఇవి జీర్ణశక్తికి మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. తేలికైన ఆహరం వల్ల వాంతులు రావు; అవి మీ పొట్టలో ఉన్న ఇబ్బందిని తగ్గించి, తేలికగా అరిగేట్టు చేస్తాయి. అంతేకాకుండా, ఇది మీ పిల్లవాడి జీర్నవాహిక ప్రేగు మార్గాన్ని తేలిక పరిచి త్వరగా సాధారణ స్థితి వచ్చేట్టు చేస్తుంది.

శారీరక కార్యకలాపాలు తప్పక ఉండాలి

శారీరక కార్యకలాపాలు తప్పక ఉండాలి

మీ బాబు/పాప మంచం మీద పడుకుని ఉంటే బైటికి వెళ్లి ఆడుకోమని ప్రోత్సహించండి. ఇది బాబు/పాప కడుపు నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. శారీరక కార్యకలాపాలు జీర్ణకోశ ప్రేగు కదలికలలో బాగా సహాయపడుతుంది. ఎప్పుడూ మంచంపై పడుకుని ఉంటే అది మలబద్దకానికి దారితీస్తుంది. బైట ఆడుకోవడం, పరిగెట్టడం, నడవడం మొదలైనవి సహాయపడతాయి. మీరు మీ పిల్లలను కార్ట్ వీల్స్, మంకీ బార్లు, ట్విర్లింగ్ వంటి కడుపును కదిలించే కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రోత్సహించాలి.

చమోమిల్ టీ

చమోమిల్ టీ

చేమోమిల్ టీ బాధను, శోధ నిరోధక లక్షణాలను కలిగి ఉండడం వల్ల, ఉదరంలోని అసౌకర్యానికి ఉపశమనాన్ని కలిగించడానికి సహాయపడుతుంది. ఒక కప్పు చేమోమిల్ టీ తయారుచేసి ఉంచి, మీ బాబు/పాప కొద్ది కొద్దిగా ఈ టీ ని తీసుకుంటే కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. చమోమిల్ టీ జీర్ణ వ్యవస్థలోని కండరాలను తెలికపరచి, మీ పోత్తలోకి ఆహారాన్ని నెట్టే మార్గంలో కుడుపులను కూడా తగ్గిస్తుంది, అలాగే చిన్న ప్రేగును కూడా తేలిక పరుస్తుంది. ఈ విధంగా కుదుపులను, కండరాలు పట్టి ఉండడాన్ని తగ్గిస్తుంది.

పెరుగు

పెరుగు

పెరుగు అరుగుదలకు మంచి ఉపశమనాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రతిరోజూ మీ పిల్లలకు ఒక కప్పు పెరుగు తినడం అలవాటు చేయండి. పెరుగులో మంచి బాక్టీరియా ఉండడం వల్ల మీ జీర్ణాశయానికి మంచి అరుగుదలను ఇస్తుంది. ప్రతిరోజూ మీ బాబు/పాప ఒక కప్పు పెరుగు తినడం అలవాటు చేసుకుంటే మీ పిల్లలు సాధారణ స్థితిలో ఉంటారు.

పుదీనా టీ

పుదీనా టీ

పుదీనా ఆకులతో చేసిన తాజా టీ మీ పిల్లల కడుపు నొప్పిని తగ్గిస్తుంది. పుదీనాలో మీ కడుపు లోని కండరాలను మృదువుగా చేసే లక్షణాలు ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. పుదీనా మీ శరీరంలో ఆహరం జీర్ణం కావడానికి ఉపయోగపడే పిత్త ప్రభావాన్ని విస్తరింప చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

English summary

Remedies For Stomach Pain In Kids

Remedies For Stomach Pain In Kids. Stomach pain is quite common among the kids and especially kids who fall in the age range of 4 to 8 years are mostly affected by this condition.
Story first published: Thursday, November 24, 2016, 11:00 [IST]