దండించకుండానే వారిని క్రమశిక్షణలో పెట్టడం ఎలా?

Posted By:
Subscribe to Boldsky

చిన్నారులు చంటిబిడ్డలుగా ఉన్నప్పటి నుంచీ పెద్దవారయ్యేదాకా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్య సంబంధమైన విషయాలకు పెద్దలుగా ఎలాగూ ప్రాధాన్యం ఇస్తాం కాబట్టి... మానసికపరమైన అంశాలను కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.

చాలామంది తల్లిదండ్రులు... పిల్లలను క్రమశిక్షణలో ఉంచటానికి వారిని కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తే.. తప్పేమీ లేదని చెప్పుకుంటూ ఉంటారు. కానీ, అది చాలా తప్పుడు అభిప్రాయం. కొన్నిదేశాలలో చిన్నారులను దండించటం చట్టరీత్యా నేరం కూడా..!

10 Positive Discipline Techniques Every Parent Should Know

అయితే కొట్టడం, తిట్టడం లాంటివేమీ చేయకుండానే.. పిల్లల్లో పాజిటివ్ డిసిప్లిన్‌ను ఏర్పరచవచ్చు. పాజిటివ్ డిసిప్లిన్ అంటే, "సానుకూల క్రమశిక్షణ" అని అర్థం. అంటే, శిక్షించటానికి దూరంగా.. వివిధ రకాల చర్యల ద్వారా వారిలో క్రమశిక్షణను ఏర్పరచటమే పాజిటివ్ డిసిప్లిన్. వారికి అర్థమయ్యే విధంగా పేరంట్స్ ఏవిధంగా క్రమశిక్షణ ఇవ్వాలో తెలుసుకుందాం..

మీ ఇష్టానికి వ్యతిరేకంగా

మీ ఇష్టానికి వ్యతిరేకంగా

మీ ఇష్టానికి వ్యతిరేకంగా (తప్పులు) చేస్తుంటే వారిని దండించకుండా, అలా చేయటం వల్ల కలిగే లాభనష్టాలను వివరించాలి. ఉదాహరణకు మట్టిలో ఆడితే కలిగే నష్టాలు గురించి వారికి అర్థమయ్యేలా వివరించాలి.

నువ్వు ఫలానా పని చేయొచ్చు

నువ్వు ఫలానా పని చేయొచ్చు

‘నువ్వు ఫలానా పని చేయొచ్చు' అంటూ దాని వల్ల ఏం జరుగుతుందో చెప్పొచ్చు. ఇలా చేస్తే పిల్లలకు మీపై విశ్వాసం కలుగుతుంది.

అలాగే... పిల్లలు ఏదయినా చెబుతుంటే

అలాగే... పిల్లలు ఏదయినా చెబుతుంటే

అలాగే... పిల్లలు ఏదయినా చెబుతుంటే, ఎవరిపనుల్లో వారు (తల్లిదండ్రులు) హడావుడిగా ఉండకుండా.. వారు చెప్పేది ఆసాంతం శ్రద్ధగా వినాలి. మీరు ఓపికగా విన్నట్లయితే, ఏదేని విషయం గురించి మీరు వివరించి చెప్పేటప్పుడు పిల్లలు కూడా ఓపికగా వినే అలవాటును ఏర్పరచుకుంటారు.

‘ఏదేని ఒక పని చేయవద్దని డైరెక్ట్‌గా చెప్పటం కాకుండా.

‘ఏదేని ఒక పని చేయవద్దని డైరెక్ట్‌గా చెప్పటం కాకుండా.

‘ఏదేని ఒక పని చేయవద్దని డైరెక్ట్‌గా చెప్పటం కాకుండా... "నువ్వు ఫలానా పని చేయవచ్చుగానీ..." అని మొదలెట్టి ఆ పనివల్ల కలిగే లాభనష్టాలను గురించి చిన్నారులకు తెలియజెప్పాలి. ఇలా చేసినట్లయితే మీ పిల్లలకు మీపై మంచి విశ్వాసం, గురి ఏర్పడతాయి.

 పిల్లలు పొరపాట్లు చేస్తే,

పిల్లలు పొరపాట్లు చేస్తే,

మీరు పెద్దవారవుతున్నారు, మీ అభిప్రాయలను గౌరవిస్తాం' అని పిల్లలతో చెప్పటం వల్ల వారు పొరపాట్లు చేసే అవకాశం తగ్గిపోతుందని మీ అభిప్రాయం. పిల్లలు పొరపాట్లు చేస్తే, వారు చేసిన తప్పులు ప్రత్యక్షంగా వారికి తెలిసేలా చేయాలి.

 ఇతరుల వస్తువులు తీసుకొని అవే కావాలని అల్లరి చేస్తుంటే

ఇతరుల వస్తువులు తీసుకొని అవే కావాలని అల్లరి చేస్తుంటే

ఇతరుల వస్తువులు తీసుకొని అవే కావాలని అల్లరి చేస్తుంటే అలాంటి వస్తువే మరొకటి ఇవ్వటానికి ప్రయత్నిస్తారు. ‘ఇది నీది, అది అక్క /అన్న/ తమ్ముడు / చెల్లిది'... ఇలా ఆ వస్తువు ఎవరిదో కచ్చితంగా పిల్లలకు తెలిసేలా చేస్తారు.

ముఖ్యంగా పిల్లలను నిందించవద్దు.

ముఖ్యంగా పిల్లలను నిందించవద్దు.

ముఖ్యంగా పిల్లలను నిందించవద్దు. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు, తల్లిదండ్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. చిన్నారులు కోరినది సమంజసంగా లేనప్పుడు రెండు ఆఫ్షన్స్ ఇచ్చి ఏదో ఒకదాన్ని ఎన్నుకోమని చెప్పాలి. ఇలా చేయడంవల్ల పిల్లలు హద్దులు దాటకుండా ఉండే లక్షణాన్ని పెంపొందించినవారవుతారు.

పిల్లలు కోరింది సమంజసంగా లేకపోతే

పిల్లలు కోరింది సమంజసంగా లేకపోతే

పిల్లలు కోరింది సమంజసంగా లేకపోతే రెండు ఆప్షన్స్‌ ఇచ్చి ఒకదాన్ని ఎన్నుకోమంటారు (బుక్స్, చిరుతిళ్లు, బట్టలు మొదలైనవి). ఇలా చేసి పిల్లల్లో నిర్ణయాన్ని తీసుకోవటం, హద్దులు దాటకుండా ఉండటం లాంటి లక్షణాలను పెంపొందిస్తారు.

పిల్లలకు భావోద్వేగాలు

పిల్లలకు భావోద్వేగాలు

పిల్లలకు భావోద్వేగాలను (కోపం ప్రదర్శించటం, ప్రేమ, భావ వ్యక్తీకరణ) వ్యక్తం చేసే స్వేచ్ఛను తల్లిదండ్రులు ఇవ్వాలి. సాధ్యమైనంతగా పిల్లలతో స్నేహంగా మెలగాలి. వారికి వచ్చే అనేక రకాల సందేహాలను తీర్చాలి. ప్రశాంతంగా మాట్లాడాలి.

పై విధంగా చేసినట్లయితే...

పై విధంగా చేసినట్లయితే...

దండించకుండానే పిల్లలను క్రమశిక్షణలో పెట్టే నేర్పును మీరు సాధించినట్లవుతుంది. పిల్లలకు స్వేచ్ఛతోపాటు హద్దులను కూడా నేర్పుతారు. పిల్లలు ఎన్నోరకాల సుగుణాలను ఏర్పరచుకోవటమే గాకుండా, న్యూనతకు గురవకుండా సెల్ఫ్ ఎస్టీమ్‌ను పెంపొందించుకుంటారు.

English summary

10 Positive Discipline Techniques Every Parent Should Know

Here’s my suggestion. Let’s make a list of all the positive discipline techniques that we know of, and spend a few minutes looking at some example scenarios where they work well.
Story first published: Friday, June 2, 2017, 15:09 [IST]
Subscribe Newsletter