భారతదేశంలో బాలల దినోత్సవానికి సృజనాత్మకమైన ఫ్యాన్సీ డ్రస్ ల ఐడియాలు

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

పిల్లలు దేవుడు ఇచ్చిన విలువైన బహుమతులు.వాళ్ళు అందంగా, ఆకర్షణీయంగానే గాక ఎవరి మొహం మీద అయిన చిరునవ్వు తెప్పించగలరు.అదంతా ఒక వైపే అనుకోండి, కానీ మనం వాళ్ళ కొంటెతనం, అర్థంలేనితనం, వింత చేష్టలు సీరియస్ గా పట్టించుకోము .

చిన్న పాదాల అడుగులు ,కేరింతలు, అటూ ఇటూ పరిగెట్టడం లేకుండా ఏ ఇల్లు పరిపూర్ణం అవ్వదు.మన రోజూ, వాళ్ళు బడికి వెళ్ళం అనే ఏడుపుతో మొదలయి, పాలు అన్నీ మిగలకుండా ఇల్లంతా పోసి,ఇంకా మంచమెక్కి నిద్రపోయే ముందైనా తిండి పెట్టాలనే మీ ఆఖరి ప్రయత్నాన్ని పాడుచేయడంతో ముగుస్తుంది. ఏదైనప్పటికి,ఆ పిల్ల రాక్షసులు లేకుండా మన జీవితం ఊహించుకోలేము.

బాలల దినోత్సవం మన దేశంలో పండగలా జరుగుతుంది.ఆ రోజు ప్రాముఖ్యాన్ని చిన్నిమనస్సులకి పూర్తిగా తెలియచెప్పడానికి అన్ని పాఠశాలలు మరియు విద్యా సంస్థలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాయి. వాటిల్లో విచిత్ర వేషధారణ కూడా బాలల దినోత్సవంలో ఒక భాగమే.

మీ పిల్లల బడిలో కూడా విచిత్ర వేషధారణ పోటీలు పెడుతుంటే ,మీరు కూడా చాలా ఆలోచనలు చేసి వేషాలు ఎంపిక చేసే అవకాశం ఉంది.

ఈ బాలల దినోత్సవం నాడు రాబోయే విచిత్ర వేషధారణ పోటీకి మీ పిల్లల కోసం కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు ఇక్కడ చూడండి.

1) దేవుడి ప్రతిరూపాలు

1) దేవుడి ప్రతిరూపాలు

ఇది విచిత్ర వేషధారణలో చాలా ప్రముఖ అంశం.భారత దేశం ఎంతో మంది దేవుళ్ళకు నెలవు మరియు పిల్లల్ని దేవుళ్ళతో సమానం అంటారు.అందుకే ఈ అంశం ఏ విచిత్ర వేషధారణ కి అయిన సరిగ్గా సరిపోతుంది.

చిత్రం : రిద్ధి ఆర్

2)అందమైన ఏంజెల్

2)అందమైన ఏంజెల్

ఇది చాల అందమైన రూపం, మీ పాపకి సరిగ్గా సరిపోయేది.ఒక దేవతలా తను తయారవడం ఊహించుకోండి.మొత్తం కిండర్ గార్డెన్ తరగతిలో మీ యువరాణే అందరికంటే అందంగా ఉంటుంది. కొన్ని ఊహించని పొగడ్తలకి కూడా సిద్ధంగా ఉండండి.

సియాం

3)బాలకృష్ణుడు

3)బాలకృష్ణుడు

ఇంకొక మంచి పౌరాణిక అంశం, మీ పాపని/బాబుని కృష్ణుడులా తయారుచేస్తే ఖచ్చితంగా పోటీని గెలుస్తారు.అతను/ఆమె కానీ నిజంగా కూడా కొంటెగా ఉంటే ఆ పాత్రకి సరిగ్గా సరిపోతారు.

విభా

4) ఓనం శైలి

4) ఓనం శైలి

భారతదేశం ఎన్నో ఆచారాలకి, మతాలకి పుట్టినిల్లు. ఇక్కడ మనం దక్షిణదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ చిన్న అమ్మాయిని చూడచ్చు.ఇది చూడటానికి చాలా సాధారణ మరియు ఆకర్షణీయమైన విషయం.దీపాలని పట్టుకోవడం మరియు ఇతర వస్తువులేవైనా పట్టుకునేలా చేస్తే ఆ దుస్తులకి ఒక అందం వస్తుంది.

ఋషి/పూజారి

ఋషి/పూజారి

ఋషి/పూజారి

ఇక్కడ,బాగా తెలివైన మరియు చదువుకున్న పిల్లలు ఋషి/పూజారి లా వేషం వేసుకుంటారు.ఈ ప్రత్యేకమైన దుస్తులు మహాభారత సమయంలో తెలివైన మరియు గొప్ప ఋషిగా చెప్పుకోబడిన ద్రోణాచార్యుడిని గుర్తు చేస్తుంది.ఈ అభినందనీయమైన దుస్తులు ఖచ్చితంగా చాలా మంది మనస్సులు గెల్చుకుంటుంది.

అథర్వ్

జైన్ దంపతులు

జైన్ దంపతులు

ఇక్కడ, ఒక అబ్బాయి అమ్మాయి అందమైన జైన్ దంపతులు కింద కనిపిస్తారు.ఈ విచిత్ర వేషధారణ, సంఘంలో ఉన్న వివిధ జాతులవారు ఎలా సామరస్యం తో కలిసి ఉంటున్నారో చూపిస్తుంది.పిల్లలికి వేరే కులాలు , మతాల మనుషల పట్ల సహనం తో ఉండాలని నేర్పించడం ఎంతో ముఖ్యం.

నిఖిల్ మరియు నిఖిత

మోడ్రన్ మహిళ

మోడ్రన్ మహిళ

ఈ విచిత్ర వేషధారణ సంఘంలో ఆధునిక మహిళని చూపిస్తుంది.ఒక సంప్రదాయ చీర, చేతులు లేని బ్లౌజ్ మరియు ముక్కు పుడకతో ఈ వేషం అధ్బుతంగా ఉంటుంది.ఇది, మన ఆధునిక వనిత సమయంతో మారుతున్నపటికీ ఇంకా మన సంస్కృతిని మర్చిపోలేదని చూపిస్తుంది.

అజుస్వి శర్మ

8) అందమైన పెళ్ళి కూతురు

8) అందమైన పెళ్ళి కూతురు

ఇది చిన్న దేవతలా దుస్తులేసుకున్న పెళ్ళి కూతురి చిత్రం.ఎర్ర లెహంగా,నగలు మరియు ఆల్రా దేశం లో అందరికంటే అందమైన పెళ్ళి కూతురులా ముస్తాబయింది, ఒప్పుకుంటారా? ఈ విచిత్ర వేషధారణ అంశం కూడా సాధరణమైనదే కాని ప్రత్యేకమైనది.

ఆల్ర అజీన్

9) ఫిక్షన్ కథలో పాత్రలు

9) ఫిక్షన్ కథలో పాత్రలు

అధ్బుతమైన కథల పాత్రలు ఈ రోజుల్లో పిల్లలకి చాలా ఇష్టం.ఇక్కడ, పెద్ద పూలజడతో టింకర్ బెల్ లా తయారైన అమ్మాయిని చూడచ్చు.ఆమెకి దుస్తులు సరిగ్గా సరిపోయాయి.పిల్లలు వాళ్ళ ఇష్టమైన కథా పాత్రలుగా తయారైనప్పుడు ముద్దుగా ఉంటారు.

 10) ప్రత్యేకమైన ఆలోచనలు

10) ప్రత్యేకమైన ఆలోచనలు

ఇవి విచిత్ర వేషధారణలో చురుకైన, వింత అంశాలు.ఇందులో పిల్లలు గ్యాస్ సిలిండర్ , విండ్ మిల్ మరియు వివిధ రకాల పాత్రల్లో తయారవడం చూడచ్చు.టీన్ వయసుకి ముందు పిల్లలకి ఇది పునరుత్పత్తి శక్తి యొక్క భావన గురించి మరియు పరిసరాల పరిరక్షణ గురించి అవగాహన పెరగడానికి సరిగ్గా సరిపోతుంది.ఇలాంటి అంశాలు పిల్లలో ప్రకృతి గురించి సున్నితమైన దృక్పథంతో ఉండాలనే ఆలోచనలు ఏర్పరుస్తాయి.

అవ్యక్త్

అందమైన పెళ్ళి కొడుకు

అందమైన పెళ్ళి కొడుకు

మీ పిల్లల్ని అందంగా తయారు చేయడానికి ఇంకో వేషం.ఖరీదైన కాంచీవరంలో తయారై ఆదర్శమైన దక్షిణ దేశ వరుడులాగ కనిపిస్తున్నాడు.ఆ దండ మరియు వేరే ఆభరణాలు ఆ వేషాన్ని మరింత నమ్మశక్యం చేయడమే కాకుండా పిల్లడ్ని మరింత అందంగా కనిపించేలా చేసాయి.ఇలా ఉంటే మీకు మాత్రం వాడిని ఎత్తుకోని తిప్పి, మొదటి బహుమతి ఇచ్చేయాలని అనిపించదూ?

ఆర్యన్ ఖామత్

English summary

Children’s Day Fancy Dress Ideas

This children’s day, decorate your child with creative fancy dress ideas for kids.
Story first published: Tuesday, November 14, 2017, 11:00 [IST]
Subscribe Newsletter