చిన్న పిల్లలు తలనొప్పి అని ఏడుస్తుంటే నిర్లక్ష్యం చేయకండి

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మనలో చాలామందికి పెద్దవాళ్ళలో వచ్చే తలనొప్పుల గురించి మాత్రమే తెలుసు. కానీ పిల్లల్లో కూడా తలలో నొప్పి కొన్నిసార్లు కలగవచ్చు. 5-14 ఏళ్ళ మధ్య పిల్లల్లో 15-20% వరకు తలనొప్పుల బారిన పడతారు. వీటిని పిల్లల ప్రత్యేక తలనొప్పులుగా గుర్తించారు.

కానీ ఇలా ఎందుకొస్తాయి?నిజానికి తలనొప్పుల్లో చాలా రకాలు, మరియు ఒక్కోదాని వెనక ఒక్కో కారణం ఉంటుంది.

కొన్ని తీవ్ర నొప్పితో తల బాదుతున్నట్లు అన్పిస్తే, కొన్నేమో చాలారోజులుగా ఉండిపోయేవి. పిల్లల్లో తలనొప్పుల గురించి మరిన్ని వాస్తవాలు ఇవిగో.

నిజం #1

నిజం #1

పిల్లల్లో తలనొప్పులు అతిగా ఏడవడం, నీటి శాతం తగ్గిపోవడం, భోజనం మానేయడం, మానసిక లేదా శారీరక వత్తిడి వల్ల రావచ్చు.

నిజం #2

నిజం #2

తలనొప్పులు ప్రాథమికం లేదా ద్వితీయ రకంగా చూడవచ్చు. ద్వితీయ రకపు తలనొప్పులు మరో వ్యాధికి లక్షణం మాత్రమే అయితే ప్రాథమిక తలనొప్పులు ఏ వైద్య స్థితి లేకుండానే రావచ్చు.

నిజం #3

నిజం #3

మైగ్రేన్ ప్రాథమిక రకపు తలనొప్పి. టెన్షన్ తో వచ్చే తలనొప్పులన్నీ ప్రాథమిక రకానికే చెందుతాయి. ఇలా ఆందోళనతో వచ్చే తలనొప్పులు తలలో,కణతల వద్ద నెప్పి కలగచేస్తాయి.

నిజం#4

నిజం#4

కనీసం 10% పిల్లల్లో ఈ మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది. ఈ తలనొప్పి తలలో తీవ్రంగా గుచ్చుతున్న నొప్పిగా ఉంటుంది. చాలా ఎక్కువగా ఉండి గంటలపాటు మీ బిడ్డకి ఇబ్బందికరం కావచ్చు. వాంతులు కూడా అవ్వవచ్చు.

నిజం#5

నిజం#5

ద్వితీయ రకపు తలనొప్పులు ఇన్ఫెక్షన్లు, ఆందోళన, డిప్రెషన్, సైనస్ సమస్యలు లేదా మెడ లేదా తల వద్ద కొంచెం ఒత్తిడి వల్ల రావచ్చు.

నిజం #6

నిజం #6

పదేళ్ళు దాటిన పిల్లల్లో కూడా క్లస్టర్ తలనెప్పులు రావచ్చు. ఈ రకం తలనొప్పి 7 కన్నా ఎక్కువ రోజులే ఉండవచ్చు. నెప్పి కంటి వెనక కలుగుతుంది. దాంతో కన్ను ఎర్రగా మారి, నీరు కారుతుంది. కళ్ళు, నుదురు వాస్తాయి.

నిజం#7

నిజం#7

తరచుగా వచ్చే తలనొప్పులు కణితుల వల్ల కూడా కావచ్చు. అందుకని మీ బిడ్డ తలనొప్పి అస్సలు తగ్గట్లేదని చెప్తూ ఉంటే,వైద్యసాయం వెంటనే తీసుకోండి.

English summary

Headaches In Children

Most of us see only adults suffering from headaches but even children do suffer pain in the head sometimes.Around 15-20% of the kids between 5-14 years tend to experience headaches. They are categorsied as pediatric headaches. Read this!
Story first published: Thursday, December 14, 2017, 15:30 [IST]