For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ- బేబీ- యొక్క- ఉష్ణోగ్రతను- కనుగొనే- విధానాలు

|

చంటిపిల్లలన్నాక ఏవో ఒక అనారోగ్యం వస్తూనే ఉంటుంది. గణాంకాల ప్రకారం మొదటి సంవత్సరం వయస్సులో నాలుగుసార్ల కన్నా ఎక్కువ అనారోగ్యం పాలవుతారట. వారికి ఒంట్లో బాలేనప్పుడు బేబీల ఉష్ణోగ్రతలను సమయప్రకారం నోట్ చేసుకోవటం వారి సంరక్షణలో ముఖ్యభాగం. అయితే వారి టెంపరేచర్ ఎలా కనుగొంటారు?

థర్మోమీటర్ ద్వారా ఎవరి శరీర ఉష్ణోగ్రతనైనా కనుగొంటారు. పెద్దవారు గ్లాసుతో తయారైన పాదరస థర్మామీటర్ ను నాలుక కింద లేదా చంకలోనో పెట్టుకుని ఉష్ణోగ్రత తెలుసుకుంటారు. అయితే సమస్య ఏంటంటే – అనుక్షణం కదులుతూ, మెదులుతూ ఉండే చంటిపిల్లల ఉష్ణోగ్రతను ఎలా తెలుసుకోవాలి అని?

ఈ కాలంలో చంటిపిల్లల ఉష్ణోగ్రత కూడా తెలుసుకునే అనేక రకాల కొత్త థర్మామీటర్లు వచ్చాయి. చెవి లేదా మలద్వార థర్మామీటర్లు, బేబీల ఉష్ణోగ్రతను చెక్ చేసే ప్రాచుర్యం పొందిన విధానాలు. కానీ అవి కూడా మీ బిడ్డ మరీ కదిలిపోతుంటే పనిచేయవు. మీ బేబీకి ఏ పద్ధతి సూట్ అవుతుందో అదే ఎంచుకోండి.

Methods of checking your Baby’s Temperature

కింద మేము కొన్ని ఉష్ణోగ్రతలను కొలిచే విధానాలను అందించాం. మీ బేబీ 6నెలల కన్నా చిన్నదైతే, జ్వరం చాలా తీవ్ర అనారోగ్య స్థితిని సూచిస్తుంది. అందుకని అలాంటి కేసుల్లో వెంటనే పిల్లల వైద్యుడిని సంప్రదించండి.

మలద్వార థర్మామీటర్లు

మీ బేబీ 3 నెలలకన్నా తక్కువ వయస్సు ఉన్నదైతే, ఈ మలద్వార( రెక్టల్) థర్మామీటర్లు బాగా పనిచేస్తాయి. అంతకన్నా ఎక్కువ వయస్సు వుంటే అంత బాగా పనిచేయవు. ఈ రెక్టల్ థర్మామీటర్ సాధారణంగా డిజిటల్ ది అయి, సరైన రీడింగ్స్ అందిస్తుంది.

ఈ థర్మామీటర్ ను బేబీ మలద్వారంలో పెట్టేముందు దానికి పెట్రోలియం జెల్లీ లేదా వాసిలైన్ ను పూసి పెట్టాలి. 1 అంగుళానికి మించి లోపలికి పెట్టరాదు. రీడింగ్ నిలబడేదాకా కదలకుండా పట్టుకోండి. సాధారణంగా ఉష్ణోగ్రతను కొలవడం అయిపోయాక ఈ థర్మామీటర్లు బీప్ సౌండ్ చేస్తాయి.

Methods of checking your Baby’s Temperature

చంక కింద వాడే డిజిటల్ థర్మామీటర్

కొంచెం పెద్ద వయస్సున్న చంటిపిల్లలకి డిజిటల్ థర్మామీటర్ తో ఉష్ణోగ్రతను చెక్ చేయవచ్చు. ఇది సరైన ఉష్ణోగ్రతను సూచిస్తుంది.

ఈ పరికరాన్ని బిడ్డ చంక కింద మొత్తంగా పెట్టాలి. చర్మానికి తగులుతుండాలని గుర్తుంచుకోండి.బేబీకి అలాగే అసౌకర్యంగా కూడా ఉండకూడదు.ఉష్ణోగ్రత విలువ సరిగా నిలబడి చూపేవరకు థర్మామీటర్ కదలకుండా పట్టుకోండి.


నోటి థర్మామీటర్
సాంప్రదాయక నోటి థర్మామీటర్ గ్లాసు తో తయారయింది మరియు పాదరసంతో పనిచేస్తుంది. ఈ కాలంలో, డిజిటల్ థర్మామీటర్లు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. 4ఏళ్ల కన్నా పెద్దపిల్లలకి ఇవి వాడవచ్చు. చిన్నపిల్లలు అవసరమైనంత సమయం పాటు నోట్లో థర్మామీటర్ ను ఉంచుకోలేరు. ఈ సంప్రదాయ థర్మామీటర్లు వాడటం వలన పిల్లలు ఆ గ్లాసును చప్పరించేస్తారు, అది ఒక్కోసారి హానికారకమవుతుంది.

థర్మామీటర్ ను పిల్లల నాలుక కింద పెట్టి, రీడింగ్ నిలకడగా వచ్చేవరకూ ఆగండి. సంప్రదాయ గ్లాసు థర్మామీటర్ వాడితే, ఒక నిమిషం పాటు ఉంచాలి.

చెవి థర్మామీటర్

బేబీల ఉష్ణోగ్రతను చెక్ చేయటానికి ఇది మరో ప్రాచుర్యం పొందిన పద్ధతి. 3 నెలల కన్నా తక్కువ వయస్సు వున్న బిడ్డలకి ఇది ఉపయోగం కాదు ,ఎందుకంటే వారి చెవి మార్గాలు ఇంకా థర్మామీటర్ పట్టేంత ఎదిగి ఉండవు.

థర్మామీటర్ ను చెవి మార్గంలో పెట్టి రీడింగ్ నిలకడ అయ్యేవరకూ ఆగండి. థర్మామీటర్ పై అంచుపై తీసి పారేయగలిగే కవర్ పెట్టడం మర్చిపోకండి, అలా అయితే ఇన్ఫెక్షన్లు రావు.

Methods of checking your Baby’s Temperature

నుదురుపై థర్మామీటర్

నుదురుపై థర్మామీటర్ ఉష్ణోగ్రతను కనుగొనే పట్టీలాగా ఉంటుంది. ఇది సాధారణంగా సరైన ఉష్ణోగ్రత చూపించదు పైగా మరో పరికరంతో మళ్ళీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం చర్మ ఉష్ణోగ్రత చెప్తుంది కానీ బేబీ శరీర ఉష్ణోగ్రత కాదు. కానీ మీకు పైపైన ఉష్ణోగ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది, దానివలన మీరు వైద్యుడి దగ్గరకు బేబీని ఎప్పుడు తీసుకెళ్ళాలో నిర్ణయించుకోవచ్చు.


ఆ స్ట్రిప్ ను బేబీ నుదురుపై ఉంచి అది ఉష్ణోగ్రత సూచించేవరకూ ఆగండి.

పాసిఫయిర్ థర్మామీటర్

ఈ థర్మామీటర్లు నిపుల్ ఆకారంలో ఉండి మీ బిడ్డ నోటికి అందించాల్సి ఉంటుంది. దాని ద్వారా తెలిసిన రీడింగ్స్ సరైనవి ఎక్కువశాతం ఉండవు. చాలామంది వైద్యులు వీటిని వాడవద్దనే సూచిస్తారు. కాకపోతే మీ బిడ్డ జ్వరం గూర్చి ప్రాథమిక అవగాహన అయితే వస్తుంది.

మీ బిడ్డను పాసిఫయిర్ థర్మామీటర్ ను ఒక 3 నిమిషాలు పీల్చేలా, రీడింగ్ వచ్చేవరకూ చేయండి. ఆ సమయంలో బేబీ నోరు మూసి వుండేట్లా చేయండి.

English summary

Methods of checking your Baby’s Temperature

There are many ways with which you can check your baby’s temperature. Read to know the different ways by which your baby’s temperature can be measured
Desktop Bottom Promotion