స్పెల్లింగ్ ఎలా చెప్పాలో మీ పిల్లలకి నేర్పించడానికి: చిట్కాలు

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

స్పెల్లింగ్ ఎలా చెప్పాలో పిల్లలకు నేర్పించడం చాలా కష్టం, కానీ ఇది చాలా ముఖ్యమైన పని. మీరు మీ పిల్లలలకు స్పెల్లింగ్స్ నేర్పేటపుడు వివిధరకాల పద్ధతులను పరిగణలోకి తీసుకోవడం అవసరం. ఒక్కొక్క మాటను 4-5 సార్లు రాయమనడం లేదా ఒక పదాన్ని వాక్యంలో అనేక సార్లు ఉపయోగించమనడం అనేవి పూర్వకాల పద్ధతులు.

మీరు కొత్త, సృజనాత్మక పద్ధతిలో మీ మెదడు పనిచేసేట్టు చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలు స్పెల్లింగ్ నేర్చుకోవడానికి ఆశక్తి చూపిస్తారు.

teaching kid how to spellteaching kid how to spell

బడిలో మీ పిల్లలకు ఎక్కువ వర్క్ ఇచ్చినప్పటికీ, వీటితో మీరు టీచర్ కి, మీ పిల్లలకి కూడా సహాయం చేయండి. మీ పిల్లలు మీతో ఎంతో సౌకర్యంగా ఉంటారు అనేవిషయంలో ఎటువంటి అనుమానం లేదు. వారికి సమస్య ఎక్కడ ఉందొ మీకు తెలిస్తే, వారితో కలిసి వర్క్ చేయించండి.

స్పెల్లింగ్ లను మీ పిల్లలకు నేర్పిస్తుంటే, మీరు మనసులో గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఫోనోగ్రామ్ లు, ఉపయోగకరమైన స్పెల్లింగ్ నియమాలు, లాజికల్ సీక్వెన్స్ ని అనుసరించడం, చివరికి నిరంతర సమీక్ష అవసరం. స్పెల్లింగ్స్ బాగా తెలుసుకోవడానికి ఏమి అవసరమో మీ పిల్లలకు చెప్పడంలో శ్రద్ధ పెట్టండి.

స్పెల్లింగ్స్ ఎలా చెప్పాలో మీపిల్లలకు నేర్పించేటపుడు మీరు ఈకింది కొన్ని పద్ధతులను అనుసరించాలి. వీటిని మీరు బేస్ గా ఉపయోగించవచ్చు, అవసరమైతే మార్పులు చేయోచ్చు. వీటిలో ఏవి మీ పిల్లలకు సరిపోతాయో గమనించండి.

teaching kid how to spell

చూడడం, రాయడం

మీ పిల్లలు స్పెల్లింగ్స్ ను గుర్తుంచుకోవడానికి ఇదో మంచి మార్గం. మీరు వారితో కొన్ని ఆటలు ఆడడం ద్వారా వాటిని తేలిక చేయండి. మీరు ఒక కార్డ్ పై ఒక పదాన్ని వ్రాయండి, దానిని తిరగేసి, వాటిని పరికించి, తిరిగి మరలా ఆ పదాలు రాయండి. మీరు అనేక ఇతర ఆటలను ఉపయోగించవచ్చు. స్పెల్లింగ్ ఎలా చెప్పాలో పిల్లలకు చెప్పేటప్పుడు ఉపయోగి౦చే మార్గాలలో ఇదొకటి.

దాగుడు మూతలు

మీ పిల్లలు ఆడడానికి ఇష్టపడే ఆటల్లో ఇదొకటి. మీరు ఇంటిచుట్టూ కొన్ని కార్డ్స్ ఉంచండి, తరువాత ఆ కార్డ్ లను పొందడానికి సూచనలు ఇవ్వండి. ఒకసారి మీ పిల్లాడు అన్ని కార్డ్స్ తీసుకొస్తే, దాన్ని రాయడానికి వారికి వివరించ౦డి. స్పెల్లింగ్ ఎలా చెప్పాలో పిల్లలకు నేర్పించడానికి ఇది మరో మార్గం.

teaching kid how to spell

గడియారం పరుగు

మీ పిల్లలు చాలెంజ్ లు ఇష్టపదేవరైతే, మీరు ఆగిపోయిన గడియారాన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు 10 పదాలు అతనికి వివరించండి. తన స్వంత౦గా సాధించిన పనితనాన్ని బీట్ చేయమని కూడా చెప్పండి. ఈ పని చేసేటపుడు పిల్లలు నిశ్సబ్దంగా, ప్రశాంతంగా ఉండేట్టు చేసే ఎటువంటి ఆలోచనలనైనా మీరు ఉపయోగించ వచ్చని గుర్తుంచుకోండి.

ఎప్పటికప్పుడు సమీక్ష

పిల్లలు ఎప్పుడూ వారిని ఉత్సాహపరచాలని కోరుకుంటారు, మీరు వారిని పొగుడుతున్నారని వారు తెలుసుకోవాలి అనుకుంటారు. దీనికోసం, మీరు ఒక కనిపించే చార్ట్ ని ఉంచండి, తన ప్రోగ్రెస్ ని సమీక్షించడానికి దీన్ని ఉపయోగించండి. మీరు ఒక ఫై చార్ట్, లైన్ గ్రాఫ్ ఏర్పాటుచేయండి. మీరు మీ కంప్యూటర్ ని ఉపయోగించుకోవచ్చు లేదా ఒక కాగితం మీద తన ప్రోగ్రెస్ ని సమీక్షిస్తున్నట్టు మీ అబ్బాయికి చెప్పండి.

teaching kid how to spell

ప్రతిదీ ఏర్పాటుచేయడం

ఎప్పుడూ పేపర్, పెన్ మీదే ప్రయత్నించకండి; మీ ఇంటి చుట్టూ ఉన్న వివిధ మాధ్యమాలను ఉపయోగించండి. మీరు పెయింట్, వాక్స్, క్రేయాన్స్, మడ్, పెస్త్రీ మిక్స్ లేదా చివరికి షేవింగ్ ఫోమ్ ని కూడా ఉపయోగించండి. సృజనాత్మక మాధ్యమాలను ఉపయోగించి మీ పిల్లలతో అక్షరాలు రాయించండి. స్పెల్లింగ్ ఎలా చెప్పాలో పిల్లలకు నేర్పే మార్గాలలో ఇది కూడా ఒకటి.

English summary

Teaching Kid To Spell | Spellings | Teaching Spellings

When you are teaching kid to spell, there are a few things that you need to keep in mind. You need to deal with the phonograms, useful spelling rules, following a logical sequence and eventually a continuous review. Take an effort to tell your kid what exactly he needs to know to spell well.The following are a few methods to use while teaching kids how to spell. You can use these as a base and modulate if necessary. Find which among these suits your child the best.