For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 8 గమ్మత్తైన వింత ప్రశ్నలు పిల్లలు గనుక అడిగితే వాటికి ఎలా సమాధానం చెప్పాలంటే ?

పిల్లలు ఇలాంటి ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం ఎలా చెప్పాలి?

By R Vishnu Vardhan Reddy
|

" మీరు లేని సమయంలో మా తల్లిదండ్రులు నిన్ను ఇలా పిలుస్తారు ." " మా తరగతిలో ఉన్న కొంత మంది నాలాగా మూత్ర విసర్జన చేయరు. వాళ్ళకు క్రింద ఎదో విభిన్నంగా ఉంది ." " నువ్వు నాన్న ఎందుకు పోట్లాడుకుంటారు ? మీ ఇద్దరి మధ్య ప్రేమ లేదా ? ." ఇలాంటి ఎన్నో ప్రశ్నలు పెరుగుతున్న వయస్సులో ఉన్న పిల్లలు తరచూ తమను సంరక్షించే తల్లిదండ్రులను లేదా పెంచే వారిని ఇలాంటి సాధారణమైన ప్రశ్నలు అడుగుతుంటారు.

ముఖ్యంగా నలుగురితో కూర్చున్నప్పుడు పిల్లలు గనుక అందరి ముందు అడిగితే ఊహించని ఆ పరిణామానికి చాలా మంది హతాసులవుతారు మరియు ఈ సందర్భం కొద్దిగా ఇబ్బందికి గురిచేస్తుంది. ఇలాంటి సమయంలో మరి మీరు ఏమి చేయాలి ?

<strong>స్మార్ట్ ఫోన్ పిచ్చితో పిల్లలను నిర్లక్ష్యం!</strong>స్మార్ట్ ఫోన్ పిచ్చితో పిల్లలను నిర్లక్ష్యం!

పిల్లల నోరు అయినా మూపించాలి లేదా వాటికి సమాధానం అయినా చెప్పాలి. వాటికి సమాధానం ఎలా చెప్పాలి ? ఇలాంటి సందర్భాల్లో సులభంగా ఎలా సమాధానం చెప్పి పిల్లలను, ఎలా సముదాయించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఎందుకు నాన్నతో ఎప్పుడూ కొట్లాడతావు ? మీ ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకోరా ?

1. ఎందుకు నాన్నతో ఎప్పుడూ కొట్లాడతావు ? మీ ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకోరా ?

తలిదండ్రులు ఇద్దరూ పోట్లాడుకుంటున్నప్పుడు అది చూసిన పిల్లలు ఒకరకమైన బావోద్వేగ దుఃఖానికి లోనవుతారు. కొన్ని సార్లు వారిలో పశ్చాత్తాప భావం కూడా పెరిగిపోతుంది. అందువల్ల తల్లిదండ్రులు పోట్లాడుకునేటప్పుడు వాళ్ళ పోట్లాటకు కారణం పిల్లలు కాదు, ఇందులో పిల్లల తప్పు ఏమి లేదని పిల్లలకి అర్ధం అయ్యేలా చెప్పాలి. మనుష్యుల్లో ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి నచ్చనప్పుడు వాదోపవాదనలు జరుగుతాయి అని పిల్లలకు చెప్పాలి. కానీ అంతమాత్రం చేత ఇద్దరి మధ్య ప్రేమ లేదని కాదు. " నిన్ను ఎలా అయితే క్రమశిక్షణలో పెట్టాలని భావించి అందుకు అనుగుణంగా వ్యవహరించామన్నప్పుడు కొన్ని సార్లు నీకు మా పై కోపం వస్తుంది. కానీ, అంతమాత్రం చేత నువ్వు మమ్మల్ని ప్రేమించడంలేదు అని అర్ధం కాదు కదా " అని చెప్పండి. ఈ విషయాలను పిల్లలతో వారికి అర్ధం అయ్యేలా చెప్పాలి.

2. మనుష్యులు ఎందుకు మరణిస్తారు ?

2. మనుష్యులు ఎందుకు మరణిస్తారు ?

మరణం గురించి అడిగినప్పుడు అబద్దం అస్సలు చెప్పకండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే అని చెప్పండి. కుక్కలు మనుష్యుల కంటే ముందు మరణిస్తాయి. పూలు కుక్కలు కంటే ముందే నేల రాలిపోతాయి. కానీ, ప్రతి ఒక్క జీవి ఎంత సమయం జీవించాలి అనే విషయమై కొన్ని నియమాలున్నాయి. కాబట్టి ఆయా జీవులకు సమయం అయిపోయిన తర్వాత వాటంతట అవే మరణించక తప్పదు. " మనుష్యులు వారి యొక్క జీవితాన్ని అందంగా గడిపిన తర్వాత మరణిస్తారు. ఎన్నో అందమైన క్షణాలను ఆస్వాదిస్తారు, సృష్టిస్తారు మరియు ఎంతో సాహసోపేతమైన సమయాన్ని గడుపుతారు. ముసలితనానికి చేరుకున్న తర్వాత మరణిస్తారు" అని చెప్పండి.

3. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఎందుకు మీరు నన్ను వదిలి వెళ్ళిపోతారు ?

3. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఎందుకు మీరు నన్ను వదిలి వెళ్ళిపోతారు ?

మీ పిల్లలకు ఉద్యోగం ఎంత ముఖ్యం అనే విషయాన్ని వాళ్ళకి అర్ధమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నించండి. " నాకు నిన్ను వదిలి వెళ్లాలంటే అస్సలు ఇష్టం లేదు కాని నిన్ను వదిలివెళ్లక తప్పదు. నేను చేసే పని చాలా ముఖ్యమైనది మరియు సాయంత్రం కల్లా తిరిగి వచ్చేస్తాను. వచ్చిన తర్వాత నీకు నచ్చినట్లు సమయాన్ని గడుపుదాం" అని చెప్పండి.

4. నాకు దయ్యాలంటే చాలా భయంగా ఉంది :

4. నాకు దయ్యాలంటే చాలా భయంగా ఉంది :

పిల్లల భయాలను అశ్రద్ధ చేయకండి. వాళ్ళు ఎందుచేత భయపడుతున్నారు అనే విషయాన్ని కనుకున్నే ప్రయత్నం చేయండి. చీకట్లో కనపడే నీడ వల్లనా లేక ఏదైనా తెలియని శబ్దం వల్లనా ? అసలు కారణం ఏమిటి అనే విషయాన్ని ప్రశ్నలు వేసి రాబట్టండి. అసలు కారణం గుర్తించి వారిలో భయం పోగొట్టడానికి ప్రయత్నించండి. లేదా ఏదైనా ఒక బొమ్మను తీసుకోండి. ఈ బొమ్మకు ఎన్నో మంత్రాలు వచ్చని, పెద్ద పెద్ద దెయ్యాలను కూడా బయపెట్టగలదు అని చెప్పండి. ఇలా చెప్పడం ద్వారా ఆ బొమ్మని ఉపయోగించి దెయ్యాలను బెదరగొట్టి పారిపోయేలా చేయవచ్చని పిల్లలు అనుకుంటారు.

5. నాకు డాక్టర్ దగ్గరకు వెళ్లాలని లేదు :

5. నాకు డాక్టర్ దగ్గరకు వెళ్లాలని లేదు :

మీ పిల్లలకు మందులు వేసుకోవడం వల్ల జరిగే లాభాలను వివరించండి. అందుకు కోసం వైద్యుడి దగ్గరకు ఎంతైనా వెళ్ళవలసిన అవసరం ఉంది అని వాళ్లకు అర్ధం అయ్యేలా చెప్పండి. " వైద్యుడు నీ శరీరానికి హాని చేసే సూక్ష్మ జీవులను బయటకు పంపించేస్తారు. ఈ ప్రక్రియ కొద్దిగా అసౌకర్యంగా అయినా ఉంటుంది లేదా కొన్ని సార్లు నొప్పిని కలిగిస్తుంది. కానీ నిన్ను మరింత శక్తివంతుడిగా తయారు చేస్తుంది. అందుకు నువ్వు చాలా ఆనందపడతావు. వైద్యులను చూసి నువ్వు అస్సలు భయపడకూడదు " అని చెప్పండి.

<strong>టీనేజి పిల్లల సమస్యలకు పరిష్కారాలు! </strong>టీనేజి పిల్లల సమస్యలకు పరిష్కారాలు!

6. ఆ పిల్లలకు ఎందుకు అక్కడ విభిన్నంగా ఉంది :

6. ఆ పిల్లలకు ఎందుకు అక్కడ విభిన్నంగా ఉంది :

పెరుగుతున్న పిల్లల్లో జననేంద్రియాల గురించి తెలుసుకోవాలనే ఆతురత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలు పట్టించుకోకపోవడం వల్ల వారిలో ఆతురత మరింత పెరిగిపోతుంది. వారి మదిలో మెదిలే ప్రశ్నలకు సమాధానం కనుక్కోడానికి వేరే దారులను వెత్తుకుంటారు. కాబట్టి అటువంటి ప్రశ్నలు మీ పిల్లలు అడిగినప్పుడు, ఎప్పుడు గాని మీరు నిర్లక్ష్యం చేయకండి. అబ్బాయిలు, అమ్మాయిలు వేరు వేరుగా నిర్మించబడ్డారని అందుచేతనే అలా ఉంటారని చెప్పండి. అందులో భాగంగా ఆ జననాంగాల పేర్లు కూడా చెప్పండి. ఇలా చెప్పడంలో ఎటువంటి తప్పులేదని చిన్న పిల్లల మానసిక నిపుణులు చెబుతున్నారు.

7. ఆ వ్యక్తి ఎందుకు లావుగా ఉన్నాడు ?

7. ఆ వ్యక్తి ఎందుకు లావుగా ఉన్నాడు ?

బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మీ పిల్లలు అనూహ్యంగా ఎవరినైనా విభిన్నంగా ఉన్న వ్యక్తులను చూపించి ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు అనే వింత ప్రశ్నలు అడుగుతుంటారు. ఇది ఎక్కువగా మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారని, ఎవరికి వారు విభిన్నమని మీ పిల్లలకు చెప్పండి. వ్యక్తుల యొక్క పరిమాణం, ఆకారం, చర్మపు రంగు ఇలా అన్ని విషయాలు విభిన్నంగా ఉండటం సాధారణమే అని అందరికీ ఒకే రకంగా ఉండవు అని తెలియజెప్పండి. " వేరే వాళ్ళని వేలెత్తి చూపిస్తే వాళ్ళు బాధపడతారు, వాళ్ల భావాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇతరులను ఎప్పుడూ వేలెత్తి చూపించకు, వారు లేని సమయంలో వాళ్ల గురించి నన్ను అడుగు చెబుతాను. అందువల్ల వాళ్ళు కూడా నొచ్చుకోరు " అని చెప్పండి.

8. నాకంటే నా తోబోట్టువుని ఎక్కువగా ప్రేమిస్తావా ? ఇష్టపడతావా

8. నాకంటే నా తోబోట్టువుని ఎక్కువగా ప్రేమిస్తావా ? ఇష్టపడతావా

మాములుగా ఇంట్లో ఉన్న తోబుట్టువులు తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడానికి గొడవపడుతుంటారు. కాబట్టి, ఇద్దరిమధ్య ఎప్పుడూ పోలికలు తీసుకురాకండి. ఎందుకంటే అలా చేస్తే పరిస్థితి మరింత దిగజారిపోతోంది. ఒకరు ఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదు, ఇద్దరూ సమానమే అని వాళ్లకు తెలియజెప్పండి మరియు అలానే వ్యవహరించండి. " కొన్ని సార్లు ప్రేమని వ్యక్తపరిచే విధానం విభిన్న రకాలుగా ఉండొచ్చు. అంతమాత్రం చేత ప్రేమ తగ్గిపోయిందని అర్ధం కాదు. ఇద్దరినీ ఒకేలా ప్రేమిస్తాను, చూసుకుంటాను మరియు ఇష్టపడతాను " అని చెప్పండి.

English summary

8 tricky questions that your kids ask and how to answer them

Tricky questions that your kids ask and how to answer them, Read to know more about..
Desktop Bottom Promotion