బేబీ విరేచనాల గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి!

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

కొత్తగా తల్లి లేదా తండ్రి అయినప్పుడు మీరు అనేక విషయాలు నేర్చుకుంటారు- మీ బేబీ గురించి మరియు మీ గురించి కూడా.మీరిప్పుడు పూర్తిగా మారిపోయి ఉంటారు, మీ పాత మీరు గుర్తుపట్టలేనంతగా.

కానీ మీరు అస్సలు ఊహించనిది, చింతించాల్సి వస్తుందని అనుకోనిది విరేచనాల గురించి. దీని గురించి పెద్దవాళ్ళు కూడా హాస్యంగా మాట్లాడుతుంటారు కానీ మీరు తల్లి లేదా తండ్రి అయినప్పుడు ఇది ఒక సీరియస్ విషయంగా మారుతుంది.

ఎందుకంటే మీ బిడ్డ విరేచనం వారి ఆరోగ్యం గురంచి చాలా చెప్తుంది. మామూలు విరేచనం కాకపోతే మీరు చింతించడం సహజమైన విషయమే.

తల్లి లేదా తండ్రిగా మీరు మామూలు విరేచనానికి ఏదన్నా సమస్యకి తేడా ఎలా తెలుసుకోవాలో నేర్చుకోవడం అవసరం. సహజమైన విరేచనాలు ఒక్కో బిడ్డకి వేరుగా ఉంటాయి మరియు అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. అందులో కొన్ని కారణాలు ఇక్కడ మీ కోసం....

మీ బిడ్డ తల్లిపాలు తాగుతారా లేదా పాలపొడి ఫార్ములానా?

మీ బిడ్డ తల్లిపాలు తాగుతారా లేదా పాలపొడి ఫార్ములానా?

మీ బిడ్డ వయస్సు ఏంటి?

మీ బేబీ ఘనపదార్థాలు తినడం మొదలుపెట్టారా?

దీని ఆధారంగా, మీ బేబీకి అనారోగ్యం లేదా సమస్య ఉందో కనిపెట్టవచ్చు. ఈ లక్షణాలను గమనించటం వలన మీ బేబీకి తొందరగా చికిత్స అందించవచ్చు. మీ బిడ్డ విరేచన సమస్యలకి కొన్ని జవాబులు కింద చదవండి.

మీ బేబీకి రోజుకి ఎన్నిసార్లు విరేచనాలు అవుతున్నాయి?

మీ బేబీకి రోజుకి ఎన్నిసార్లు విరేచనాలు అవుతున్నాయి?

సహజంగా ఎన్నిసార్లు అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది బిడ్డ ఆహారంపై ఆధారపడి ఉంటుంది. తను తల్లిపాలు తాగుతుంటే, రోజుకి నాలుగుసార్ల నుంచి నాలుగురోజులకి ఒకసారి మధ్య సహజం అవుతుంది. అదే తను పోత పాలు తాగుతుంటే, మలబద్ధకం నివారించడానికి ప్రతిరోజూ విరేచనం కావచ్చు. బేబీ ఘనపదార్థాలు తింటున్నప్పుడు, రోజుకి ఒకసారి లేదా రెండు రోజులకి ఒకసారి కావచ్చు.

అప్పుడే పుట్టిన పాపాయి విరేచనం చూడటానికి ఎలా ఉంటుంది?

అప్పుడే పుట్టిన పాపాయి విరేచనం చూడటానికి ఎలా ఉంటుంది?

కొత్తగా పుట్టిన పాపాయి విరేచనంలో యామ్నియాటిక్ ద్రవం, జుట్టు, మ్యూకస్ మరియు గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ మింగేసినవన్నీ ఉంటాయి. మొదటి విరేచనాలు ముదురు పచ్చ లేదా నీలి రంగులో ఉంటాయి. విరేచనాల రంగు బిడ్డ జీర్ణవ్యవస్థ గురించి మొత్తం చెప్తుంది.

తల్లిపాలు తాగే బేబీ విరేచనం ఎలా కన్పిస్తుంది?

తల్లిపాలు తాగే బేబీ విరేచనం ఎలా కన్పిస్తుంది?

తల్లిపాలు తాగే బిడ్డ విరేచనం ఆవరంగులో ఉంటుంది. పూర్తి మెత్తగా నుంచి గింజల మధ్యలో ఎలా అయినా ఉండచ్చు. మధ్యలో గడ్డలు కట్టి కన్పించవచ్చు. ఇదంతా సహజమే. ఇవి లూజుగా లేదా మధ్యమంగా ఘనస్థితిలో ఉండి, తీయని వాసనతో ఉండవచ్చు.

ఫార్ములా పాలు తాగే బిడ్డ విరేచనం ఎలా కన్పిస్తుంది?

ఫార్ములా పాలు తాగే బిడ్డ విరేచనం ఎలా కన్పిస్తుంది?

ఫార్ములా పాలు తాగే బిడ్డ విరేచనం తల్లిపాలు తాగే బిడ్డకన్నా చాలా వేరుగా ఉంటుంది. ఫార్ములా తాగే పిల్లల్లో విరేచనం మిగతావారికన్నా గట్టిగా ఉంటుంది. మీరు దాన్ని టూత్ పేస్టుతో పోల్చవచ్చు. ముదురు పసుపుపచ్చ రంగులో, చెత్తకంపు కొడుతూ పెద్దవారిలాగానే ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఫార్ములా తాగిన బిడ్డ ఎక్కువ మలబద్ధకానికి గురవచ్చు. అందుకని రెండురోజుల కన్నా ఎక్కువ విరేచనం కాకపోతే, వైద్యున్ని సంప్రదించండి.

ఘనపదార్థాలు తినే బిడ్డ విరేచనం ఎలా కన్పిస్తుంది?

ఘనపదార్థాలు తినేటప్పుడు, బిడ్డ విరేచనం కూడా వారు తినేపదార్థాలకి తగ్గట్టు మారిపోతూ ఉంటుంది. బేబీ పాలకూర తింటే, విరేచనం ఆకుపచ్చగానూ, క్యారట్లు తింటే ఆరెంజ్ రంగులోనూ ఉంటుంది. అందుకని కంగారుపడకండి. అలాగే ఫైబర్ ఎక్కువున్న పదార్థాలు పెడితే అవి అరగకుండానే విరేచనంలో బయటకి వచ్చేయవచ్చు. ఎందుకంటే బేబీ జీర్ణవ్యవస్థ ఇంకా ఇలాంటివి అరిగించుకునే విధంగా ఎదగలేదు. బిడ్డ పెరుగుతున్నప్పుడు, అన్ని రకాల ఆహారం అరిగించుకోగలడు. అప్పుడు విరేచనాలు కూడా పెద్దవారి వలె వాసన రావచ్చు.

English summary

What Can You Learn from Your Baby’s Stools

There are a lot of things that you learn as a new parent - both about your baby and yourself.There is one thing you wouldn't have even imagined yourself worrying about and that is poopAs a parent, you need to educate yourself to learn how to distinguish the normal stools from those that indicate a problem.
Story first published: Tuesday, December 12, 2017, 17:30 [IST]