For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 9 రకాల మార్గాలు ద్వారా బాల్యంలో క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు

By R Vishnu Vardhan Reddy
|

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యాఖ్యానం ఏమిటంటే, " అన్ని ప్రాయాల కంటే కూడా బాల్యం అత్యంత అందమైనది, అద్భుతమైనది " అని చెప్పారు.

మనలో చాలా మందికి చిన్ననాటి జ్ఞాపకాలు పదిలింగా మన మనస్సులో అలానే ఉంది ఉంటాయి. అవి చాలా అద్భుతంగా కూడా ఉంటాయి. ఆ సమయంలో కొత్తవి నేర్చుకోవడంతో పాటు, అందంగా జీవితం గడపటం తప్ప వేరే ద్యాసేలేని ప్రాయం అది.

ఉద్యోగ ఒత్తిడి ఉండదు, సంబంద బాంధవ్యాల సమస్యలు ఉండవు, ఆర్ధికపరమైన లక్ష్యాలు లేదా ఆందోళనలు ఉండవు, భవిష్యత్తు కోసం బెంగ ఉండదు. ఇలా చీకు చింత లేని ఒక ఆనందకరమైన బాల్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది.

9-ways-on-how-to-prevent-childhood-cancer

బాల్యంలో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏమిచేయాలి ?

కొన్ని సందర్భాల్లో కొంత మంది పిల్లలు దురదృష్టవశాత్తు భయంకరమైన వ్యాధులతో బాధపడుతుంటారు. అలాంటి వాటిలో క్యాన్సర్ కూడా ఒకటి. ఈ ఒకటి గనుక సోకినట్లైతే బాల్యం మొత్తం నరకప్రాయం అవుతుంది.

ఏ పిల్లలు అయితే క్యాన్సర్ బాధితులుగా మారుతారో, అటువంటి పిల్లల్లో అందుకు సంబంధించిన లక్షణాలు చాలా దారుణంగా ఉంటాయి. సాధారణంగా పిల్లలు చేసే ఏ పనిని కూడా ఈ వ్యాధి సోకిన పిల్లలు చేయలేరు.

మిగతా పిల్లలతో కలిసి ఆటలు ఆడటానికి ఉండాల్సిన శక్తి వీరికి ఉండదు మరియు పాఠశాలకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది.

అంతేకాకుండా క్రమం తప్పకుండా ఆస్పత్రికి వెళ్ళవలసి ఉంటుంది ఎందుకంటే, ఈ అతిపెద్ద అనారోగ్య సమస్య వారిని, వారి తల్లిదండ్రులను నిరంతరం వేధిస్తూనే ఉంటుంది వెంటాడుతూనే ఉంటుంది.

కాబట్టి క్యాన్సర్ వంటి వ్యాధులు, చిన్న ప్రాయంలో నే గనుక సోకినట్లైతే అలాంటి వ్యక్తులకు బాల్యం అనేదే ఉండదు. వారి యొక్క జ్ఞాపకాలన్నీ నొప్పి, బాధ మరియు కష్టంతో నిండిపోయి ఉంటాయి.

బాల్యం లో క్యాన్సర్ భారిన పడకుండా ఉండాలంటే లేదా ఆ వ్యాధిని నివారించాలంటే, ఏమిచేయాలి అనే విషయానికి సంబంధించి ఇప్పుడు మనం ఈ వ్యాసంలో తెలుసుకోబోతున్నాం.

1.మంచి ఉదాహరణలుగా నిలవండి:

1.మంచి ఉదాహరణలుగా నిలవండి:

ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల విషయంలో చేయాల్సిన పని ఏమిటంటే, పిల్లలందరూ ఆరోగ్యవంతంగా ఉన్నారా, లేదా మరియు పిల్లలు భద్రంగా ఉన్నరా, లేదా అని ఖచ్చితంగా చూసుకోవాలి. వీరిని సమాజానికి ఒక ఉదాహరణలుగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దాలి. ఆరోగ్యవంతమైన అలవాట్లను తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. సాధారణంగా చాలామంది పిల్లలు, తల్లిదండ్రుల అలవాట్లని అనుకరిస్తూ ఉంటారు మరియు వాటినే ప్రేరణగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని దూరంగా పెట్టి ఇలాంటి అలవాట్లు అన్నింటిని చిన్న వయస్సు నుండే పిల్లలకు అలవాటు చేయడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల భారిన పడకుండా కాపాడుకోవచ్చు.

2. ధూమపానాన్ని పూర్తిగా వదిలివేయండి :

2. ధూమపానాన్ని పూర్తిగా వదిలివేయండి :

పొగ త్రాగటం అనేది చాలా భయంకరమైన అలవాటు అని మనకందరికీ తెలుసు. ఈ అలవాటుని ఎక్కువగా గనుక ఆచరిస్తే, పొగ త్రాగేవారే కాకుండా వారి చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా క్యాన్సర్ తో పాటు మరెన్నో భయంకరమైన వ్యాధుల భారినపడే అవకాశం ఉంది. పొగ త్రాగేవారికంటే కూడా వారి చుట్టూ ఉండి, ఆ పొగని ఎవరైతే పీలుస్తారో, అటువంటి వారికి క్యాన్సర్ సోకే అవకాశం ఎక్కువగా ఉందట. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు ఎవరైతే పొగ త్రాగుతున్నారో, అలాంటివారి పక్కన ఉండే వారి పిల్లలకు క్యాన్సర్ సోకే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కాబట్టి ఈ అలవాటుని మీ అంతట మీరు మానుకోగలితే మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతారు.

3. పాలు ఎక్కువగా పట్టడం :

3. పాలు ఎక్కువగా పట్టడం :

సాధారణంగా చాలామంది తల్లులు, తమకు పుట్టిన పిల్లల వయస్సు సంవత్సరం కాగానే, పిల్లలకు వక్షోజాల ద్వారా పాలు ఇవ్వడం మానేస్తారు. ఇది నిజమే కదా ? ఎన్నో పరిశోధన అధ్యయనాల ప్రకారం వారందరు చెబుతున్న నిజం ఏమిటంటే, పిల్లలకు రెండు, మూడు సంవత్సరాలు వచ్చే వరకు వక్షోజాల ద్వారా పాలు పట్టడం మంచిదట. ఇలా చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయట. వక్షోజాల ద్వారా పాలు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు దీని వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు మనకు రావు. క్యాన్సర్ వంటి మహమ్మారిని కూడా ఇది నిలువరించగలుగుతుంది. కాబట్టి వక్షోజాల ద్వారా పాలు పిల్లలకు, ఎక్కువ రోజుల పాటు ఇవ్వడం వల్ల వారు క్యాన్సర్ భారిన పడకుండా ఉంటారు.

4. తీసుకొనే ఆహారాన్ని పర్యావేక్షించండి :

4. తీసుకొనే ఆహారాన్ని పర్యావేక్షించండి :

మనకందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, చాలా మంది పిల్లలు మంచి ఆహారాన్ని తినడానికి విముఖతని ప్రదర్శిస్తారు మరియు ఆరోగ్యవంతమైనవి తినమంటే అందుకు నిరాకరిస్తారు. దానికి కారణం అవి అంతగా రుచిగా ఉండకపోవచ్చు. కానీ, ఆరోగ్యవంతమైన ఆహారాల్లో ఉండే లాభాలను వాళ్ళు అస్సలు గ్రహించారు. ఇటువంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లల యొక్క ఆహారపు అలవాట్లను పర్యావేక్షించడం మంచిది. వారు అవసరమైన మేర ఆకుకూరలు, కూరగాయలు,పండ్లు మరియు పాలను తీసుకునేలా చేయాలి. ఇలా చేయడం వల్ల వారియొక్క శరీరాలు ఆరోగ్యవంతంగా తయారయ్యి క్యాన్సర్ కణాల పై పోరాడతాయి.

5. కాలుష్యానికి దూరంగా ఉండండి :

5. కాలుష్యానికి దూరంగా ఉండండి :

సాధ్యమైనంత వరకు పిల్లలను కాలుష్యానికి దూరంగా ఉంచండి. ఎందుకంటే, కాలుష్యం లో ఉండే హానికరమైన పదార్ధాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు చర్మ క్యాన్సర్ వంటివి పిల్లల్లో అధికంగా వస్తున్నాయి. మీకు గనుక వీలయితే వారిని తక్కువ కాలుష్యం ఉండే ప్రాంతాల్లో ఉంచండి. అంతేకాకుండా చుట్టు ప్రక్కల చెట్లు ఉండి ఆకుపచ్చగా ఉండేలా చూసుకోండి మరియు ఒకేవేళ బయటకు గనుక వెళ్ళవలసి వస్తే అటువంటి సమయంలో వారికి మాస్క్ లు ధరించండి.

6. మీరు తీసుకొనే ఆహారంలో ఒమేగా 3 అధికంగా ఉండేలా చూసుకోండి :

6. మీరు తీసుకొనే ఆహారంలో ఒమేగా 3 అధికంగా ఉండేలా చూసుకోండి :

ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అనే కొవ్వు కు సంబంధించిన ఆమ్లాలు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా లాభాలను చేకూరుస్తాయి. ఈ లాభాలతో పాటు అది శరీర బరువుని తగ్గిస్తుంది మరియు జీవక్రియను పెంచుతుంది. అంతేకాకుండా ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ శరీరంలో క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెందకుండా మరియు రెట్టింపు అవ్వకుండా నిరోధిస్తుంది. కాబట్టి, మీ పిల్లలు తినే ఆహారంలో క్రమం తప్పకుండా వాల్ నట్స్,కొబ్బరి నూనె, నెయ్యి మొదలగునవి ఉండేలా చూసుకోండి.

7. గాడ్జెట్స్ కు దూరంగా ఉంచండి :

7. గాడ్జెట్స్ కు దూరంగా ఉంచండి :

ప్రస్తుతకాలంలో పెద్దలు గాడ్జెట్స్ కు దూరంగా ఉండాలి అంటే అంత సులభమైన పనికాదు. ఎందుకంటే, వాటితోనే పనిచేయవలసి ఉంటుంది మరియు రోజూచేసే మిగతా పనులు కోసం కూడా అవి అవసరం అవుతాయి. అయితే పిల్లలు సాధారణంగా వీటిని ఆడుకోవాలనే ఉద్దేశ్యంతోనే తీసుకుంటారు. ఎప్పుడైతే పిల్లలు సెల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు మరియు కంప్యూటర్లు ఎక్కువగా వాడటం మొదలు పెడతారో అటువంటి సమయంలో కూడా క్యాన్సర్ సోకే అవకాశం ఎక్కువగా ఉందట. కాబట్టి సాధ్యమైనంత వరకు మరీ అవసరమైతే తప్ప ఈ గాడ్జెట్స్ పిల్లలకు ఇవ్వకండి.

8. యాంటీ బయాటిక్స్ ని పూర్తిగా నిషేధించండి :

8. యాంటీ బయాటిక్స్ ని పూర్తిగా నిషేధించండి :

చాలా మంది పిల్లలు చిన్న వయస్సులో ఉన్నప్పుడు విపరీతమైన ఇన్ఫెక్షన్ల భారినపడుతుంటారు మరియు జలుబు, పళ్ళ ఇన్ఫెక్షన్లు మొదలగు వ్యాధుల భారిన తరచూ పడుతూ ఉంటారు. ఎందుకంటే, చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి ఇంకా వృద్ధి చెందే దశలోనే ఉంటుంది. ఎప్పుడైతే పిల్లలు ఈ వ్యాధుల భారిన పడతారో అటువంటి సమయాల్లో యాంటీ బయాటిక్స్ ని వాడమని సూచిస్తూ ఉంటారు. అయితే, యాంటీ బయాటిక్స్ ని ఎక్కువగా వాడటం వల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది మరియు శరీరంలో క్యాన్సర్ కారక కణాలు చాలా సులభంగా పెరిగిపోతాయి.

9. ఏదైనా ఒక వ్యాయామాన్ని క్రమం తప్పకుండా అలవరచు కునేలా చేయండి :

9. ఏదైనా ఒక వ్యాయామాన్ని క్రమం తప్పకుండా అలవరచు కునేలా చేయండి :

చిన్నపిల్లలు గనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేసినట్లయితే, క్యాన్సర్ తో పాటు మరెన్నో రకాల వ్యాధులను రాకుండా నిరోధించవచ్చు మరియు అరికట్టవచ్చు. కాబట్టి, పిల్లలను వాళ్లకు ఇష్టమైన ఆటల్లో చేర్పించండి లేదా వారు కోరుకునే వ్యాయామాన్ని నేర్పించండి. ఇలా చేయడం వల్ల బాల్యంలో క్యాన్సర్ రాకుండా సాధ్యమైన మేర అరికట్టవచ్చు.

ఈ వ్యాసాన్ని షేర్ చేయడం మాత్రం మరచిపోకండి.

English summary

9-ways-on-how-to-prevent-childhood-cancer

Cancer is a deadly disease which can affect people of any age and gender. Even kids are affected by cancer and it can be rather hard to treat certain types of cancers in children. Here are a few ways in which parents can help prevent cancer in children.
Desktop Bottom Promotion