పిల్ల‌ల ఆట‌బొమ్మ‌లు శుభ్రం చేస్తున్నారా?

By: sujeeth kumar
Subscribe to Boldsky

పిల్ల‌ల ఆరోగ్యం గురించి ఎన్నో ర‌కాలుగా శ్ర‌ద్ధ తీసుకుంటాం. వారి ఆహారం, వేయించే దుస్తుల ద‌గ్గ‌ర నుంచి శుభ్ర‌త విష‌యంలో ప్ర‌తిదీ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తాం. కాలుష్యం, వాతావ‌ర‌ణ ప‌రిస్థితులలో మార్పుల నుంచి వారిని కాపాడాల‌ని అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటాం.

ఇవి కాకుండా వారి నోటి శుభ్ర‌త‌, పోష‌క ఆహార జాగ్ర‌త్త‌లు త‌దిత‌రాల గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటారు త‌ల్లిదండ్రులు. మ‌రి పిల్ల‌ల ఆట‌బొమ్మ‌ల సంగ‌తో?

పిల్ల‌ల ఆట వ‌స్తువుల శుభ్ర‌త‌పైనా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లోహంతో లేదా చెక్క‌తో చేసిన బొమ్మ‌లుంటాయి. అవి విరిగి చిన్న చిన్న ముక్క‌లైతే ప్ర‌మాద‌మే క‌దా! ఇవికాకుండా ఇంకా ఎలాంటి బొమ్మ‌ల‌తో ఎలా వ్య‌వ‌హ‌రించాలో తెలుసుకుందాం.

ఎందుకు శుభ్రం చేయాలంటే?

పిల్ల‌ల ఆట‌బొమ్మ‌లు చూసేందుకు అమాయ‌కంగా క‌నిపించొచ్చు. కొన్ని బొమ్మ‌లు ఫ‌న్నీగా ముద్దుగా క‌నిపించినా ఎన్నో ర‌కాల సూక్ష్మ‌క్రిముల‌కు ఆవాసంలా మార‌వ‌చ్చు. మన చేతులు వెళ్ల‌లేని మూల‌ల్లో ఎన్నో క్రిములు దాగి ఉండొచ్చు. అందుకే ఆట‌బొమ్మ‌ల‌ను పిల్ల‌ల‌కు ఇచ్చే ముందు వాటిని బాగా శుభ్ర‌ప‌ర్చి ఇవ్వ‌డం మంచిది.

Why Wash Your Kids Toys | Reasons To Wash Kids Toys | Why Washing Toys Is Important

1. నూలుతో చేసిన బొమ్మ‌లు

నూలు లేదా ఫ‌ర్‌తో చేసిన బొమ్మ‌లు తొంద‌ర‌గా మురికి ప‌ట్టిపోతాయి. ఇవి ఎల‌ర్జీని క‌లిగించ‌గ‌ల‌వు. ఇలాంటి ఆట బొమ్మ‌ల‌ను శుభ్ర‌పర్చ‌డం క‌ష్ట‌మ‌నుకుంటే వాడ‌న‌ప్పుడు ప్లాస్టిక్‌తో చుట్టేయ‌డం మంచిది. కాస్తంత శ్ర‌ద్ధ తీసుకుంటే ఎంతో కాలంపాటు మ‌న్నిక‌గా ఉంటాయి. గ‌ట్టిగా ఉండే బొమ్మ‌ల‌ను శుభ్ర‌పర్చ‌డం తేలిక‌.

Why Wash Your Kids Toys | Reasons To Wash Kids Toys | Why Washing Toys Is Important

2. ఎల‌క్ట్రానిక్ బొమ్మ‌లు

ఎల‌క్ట్రానిక్ ఆట బొమ్మ‌ల‌ను నీటితో శుభ్రం చేయ‌లేం. ఇలాంటి వాటితో వ్య‌వ‌హ‌రించేట‌ప్పుడు త‌యారీదారుల సూచ‌న‌లు త‌ప్ప‌కుండా చూడాలి. వీటిని శుభ్రం చేసేందుకు మొద‌ట బ్యాట‌రీలు తీసేయాలి. ఆ త‌ర్వాత తుడిచే సొల్యూష‌న్‌లో కాగితం లేదా బ‌ట్ట ముంచి పైన తుడ‌వాలి. కాస్త నీళ్లు ప‌డినా బొమ్మ చెడిపోయే ప్ర‌మాద‌ముంది. ఏదైనా స్ప్రే తో ఆట‌బొమ్మ‌ల‌ను తుడ‌వ‌చ్చు.

Why Wash Your Kids Toys | Reasons To Wash Kids Toys | Why Washing Toys Is Important

3. ప్లాస్టిక్ బొమ్మ‌లు

ప్లాస్టిక్ బొమ్మ‌ల‌ను నీటితో శుభ్రం చేయ‌వ‌చ్చు. అయితే వాహ‌న బొమ్మ అయితే లోప‌లి భాగాలు తుప్పు ప‌ట్ట‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి. కారు, బైక్ ప్లాస్టిక్ బొమ్మ‌లుంటే జాగ్ర‌త్త‌గా తుడ‌వాలి. పై భాగంలో శుభ్ర‌ప‌రిస్తే మేలు. చెక్క‌తో చేసిన బొమ్మ‌ల‌కు ఇదే విధానం వ‌ర్తిస్తుంది. కావాల‌నుకుంటే స‌బ్బుతోనూ ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను క‌డిగేసేయొచ్చు.

Why Wash Your Kids Toys | Reasons To Wash Kids Toys | Why Washing Toys Is Important

4. బ‌ట్ట‌తో చేసిన‌వి...

బ‌ట్ట‌తో చేసిన బొమ్మ‌లైతే 3 లేదా 4 రోజుల‌కోసారి వాషింగ్ మెషీన్‌లో వేయ‌వ‌చ్చు. ఏదైనా బొమ్మ చాలాకాలంపాటు వాడ‌క‌పోతే దాన్ని పిల్ల‌ల కిచ్చే ముందు శుభ్రంగా క‌డిగి ఇవ్వ‌డం మ‌ర్చిపోకండి.

Why Wash Your Kids Toys | Reasons To Wash Kids Toys | Why Washing Toys Is Important

5. బ‌య‌ట బొమ్మ‌లు

ఫుట్‌బాల్‌, బాస్కెట్ బాల్, క్రికెట్ బాల్, సైకిళ్లు లాంటి బ‌య‌ట ఉప‌యోగించే ఆట వ‌స్తువుల‌ను రోజు శుభ్ర‌ప‌ర్చ‌డం చాలా మేలు. వీటిని బ‌య‌టే ఉప‌యోగిస్తాం కాబ‌ట్టి సులువుగా క్రిములు చేరే అవ‌కాశం ఉంది. పిల్ల‌లు ఇంటికి రాగానే ఈ ఆట‌వ‌స్తువుల‌ను న‌ల్లా నీటి కింద పెట్టి శుభ్రం చేసుకోవాలి.

ఆట వ‌స్తువులు క‌డిగే విధానాలు

1. చేతితో క‌డ‌గాలి.

2. స‌బ్బు, నీరు ఉప‌యోగించి క‌డ‌గ‌డం.

3. స్పాంజితో శుభ్రంగా తుడ‌వ‌డం

4. బ్లీచింగ్ ద్రావ‌ణంలో ఆట‌వ‌స్తువుల‌ను ముంచ‌డం ద్వారా...

ఇలా ఆట‌వ‌స్తువుల‌ను శుభ్రంగా చేసుకుంటే పిల్ల‌ల‌ను అనారోగ్య బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌గ‌లం.

English summary

Why Wash Your Kids Toys | Reasons To Wash Kids Toys | Why Washing Toys Is Important

There is no limit to taking full care of your children"s health. Besides food and clothing, you would also have to take care of their hygiene and ensure that they are also protected from things like pollution. Amid all this, do you care enough for your children"s toys? Yes, this is also an important part
Story first published: Monday, February 5, 2018, 10:36 [IST]
Subscribe Newsletter