For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలకి ప్రమాదకరంగా మారే ఫుడ్ కాంబినేషన్స్

|

ఆహారాన్ని రుచికరంగా వండటం ఒక కళ. అందుకోసం ఎన్నో ప్రయోగాలు చేస్తారు. వివిధ ఫుడ్ కాంబినేషన్స్ ను ప్రయత్నిస్తారు. రెసిపీలను సృష్టిస్తారు. ఈ మధ్యకాలంలో వంటలకి సంబంధించిన కొత్త ప్రయోగాలను తెలుసుకునేందుకు యూట్యూబ్, టీవీ వంటి వివిధ మాధ్యమాలు తోడ్పడుతున్నాయి.

వంటను రుచికరంగా వండటం ఒక కళ అయితే ఆ వంటను చక్కగా ప్రెజెంట్ చేయడం కూడా ఒక కళే. వంటలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ద్వారా పిల్లలూ అలాగే పెద్దలూ ఆహారాన్ని ఇష్టంగా భుజిస్తారు. అనేక ఫుడ్ కాంబినేషన్స్ ని ప్రయత్నించడం ద్వారా వంటకాల రుచిని మరొక లెవెల్ కి తీసుకు వెళ్ళవచ్చు.

Food combinations that are dangerous for kids

అయితే, ఇక్కడే మానమొక విషయం గుర్తించాలి. వంట చేసేటప్పుడు కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ పై అవగాహన ఉండాలి. ఏయే ఫుడ్ కాంబినేషన్స్ ఆరోగ్యానికి ప్రయోజనకారిగా ఉంటాయో వీటివలన ఆరోగ్యంపై దుష్ప్రయోజనం పడుతుందో తెలిసుకోవాలి. లేదంటే, ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.

మనం తినే ప్రతి ఆహారం ప్రతి ఇతర ఆహారపదార్థాలతో కలిసి ఆరోగ్యానికి మంచి చేస్తాయని భావించడం సరికాదు. కొన్ని ఆహారపదార్థాలతో కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలను కలపకూడదు. వీటి వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా, పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వారి జీర్ణవ్యవస్థ ఇంకా ఎదుగుదల దశలోనే ఉండటం వలన వారికిచ్చే ఆహారం విషయంలో మరింత శ్రద్ధ అవసరం. ఈ ఆర్టికల్ లో పిల్లలకిచ్చే ఏయే ఫుడ్ కాంబినేషన్స్ వలన వారి ఆరోగ్యం దెబ్బతింటుందో తెలియచేశాము.

ఇక్కడ డేంజరస్ ఫుడ్ కాంబినేషన్స్ లిస్ట్ ను పొందుబరిచాము. వీటిని పరిగణలోకి తీసుకోండి.

1. సెరల్ మరియు జ్యూస్:

1. సెరల్ మరియు జ్యూస్:

తల్లితండ్రులుగా పిల్లలు రోజంతా ఉత్సాహంగా అలాగే శక్తివంతంగా ఉండాలని కోరుకోవడం సహజం. వారి డైట్ ను రోజంతా మానిటర్ చేయడం కుదరదు కాబట్టి, మనం వారికి దగ్గరుండి తినిపించే సమయంలో వారికి సాధ్యమైనన్ని పోషకాలు అందాలని ప్రయత్నిస్తాము. మొదటి మీల్ లోనే వారికి ఎక్కువగా ఆహారాన్ని అందించేందుకు మొగ్గు చూపుతాము.

అయితే, ఈ ఫుడ్ కాంబినేషన్ అనేది వారికి పోషకాలను అందించకపోగా వారి జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుంది. వీటిలోనున్న పోషకాలు విచ్చిన్నమవుతాయి. వారికి తగినన్ని పోషకాలు అందవు. రాను రాను వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి, ఈ ఫుడ్ కాంబినేషన్ ను అవాయిడ్ చేయడం మంచిది.

2. బర్గర్ మరియు ఫ్రైస్:

2. బర్గర్ మరియు ఫ్రైస్:

ఇది చాలా మంది పిల్లలకు ఇష్టమైన ఫుడ్ కాంబినేషన్. అందువలనే, చాలా ఫుడ్ చైన్స్ లో ఈ ఫుడ్ కాంబినేషన్ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ, బర్గర్ మరియి ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఒకసారి పరిశీలిస్తే ఈ రెండు బాగా డీప్ ఫ్రై చేయబడిన పదార్థాలు. ఇవి బ్లడ్ షుగర్ ని తగ్గిస్తాయి.

ఈ పరిస్థితిని పెద్దవాళ్ళు మేనేజ్ చేయగలరు. పిల్లలకి మాత్రం అసౌకర్యం తలెత్తుతుంది. అందువలన, పిల్లలకు ఈ ఫుడ్ కాంబినేషన్ ను ఇవ్వడం సిఫార్సు చేయదగినది కాదు. వీలైనంత వరకు ఈ ఫుడ్ కాంబినేషన్ నుంచి పిల్లల్ని దూరంగా ఉంచండి.

3. పిజ్జా మరియు సోడా:

3. పిజ్జా మరియు సోడా:

ఇది ఇంకొక టేస్టీ ఫుడ్ కాంబినేషన్. పిల్లలు ఈ ఫుడ్ కాంబినేషన్ పై మనసు పారేసుకుంటారు. అయితే, ఈ ఫుడ్ కాంబినేషన్ వారికి ప్రమాదకరం. పిజ్జాలో కార్బోహైడ్రేట్స్ లోడ్ అయి ఉంటాయి. కాబట్టి, వీటిని డైజెస్ట్ చేసే సమయంలో శరీరంలో స్టోర్ అయి ఉన్న శక్తి వినియోగించబడడం జరుగుతుంది.

ఫిజ్జీ డ్రింక్ ను తీసుకోవడం ఈ స్థితిని మరింత దిగజారుస్తుంది. మీ పాపాయి బ్లోటింగ్ సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. అందువలన,ఈ కాంబినేషన్ పిల్లలకు అత్యంత డేంజరస్ ఫుడ్ కాంబినేషన్ గా మారుతుంది.

4. అరటిపండు మరియు పాలు:

4. అరటిపండు మరియు పాలు:

అరటిపండు మరియు పాలలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. విడి విడిగా వేరు వేరు సమయాలలో తింటే వీటి ద్వారా ప్రయోజనాలు అందుతాయి. వీటిని కలిపి ఇవ్వడం వలన సమస్యలు తలెత్తుతాయి. ఇది ఎంతో హెవీ కాంబినేషన్. ఇది పిల్లలకు మగతను కలిగిస్తాయి. వారికి నిద్రపోవాలని అనిపిస్తుంది.

అత్యంత విపరీతమైన సందర్భాలలో, ఇది పిల్లల యొక్క మెంటల్ ఎబిలిటీస్ ను బలహీనపరిచే ప్రమాదం కూడా ఉంది. అందువలన, పిల్లల యొక్క ఎదుగుదల యాక్టివ్ గా ఉండాలంటే ఈ కాంబినేషన్ ను అవాయిడ్ చేయడం మంచిది.

5. పళ్ళు మరియు పెరుగు:

5. పళ్ళు మరియు పెరుగు:

ఇవి కూడా హెల్తీ ఫుడ్స్ కేటగిరీలోకే వస్తాయి. అయితే, ఆహారాన్ని తీసుకునే సమయం అలాగే వీటితో కలిపి తీసుకుంటున్నాం అనేది కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ ఫుడ్ కాంబినేషన్ ను తీసుకోవడం వలన ఉత్పత్తయ్యే టాక్సిన్స్ పదేళ్ల పిల్లల ఉదరంలో ఉండే సహాయకారి బాక్టీరియా వృద్ధిని అరికడతాయి.

దాని వలన సైనస్ కంజెషన్, దగ్గు మరియు జలుబు సమస్యలు వేధిస్తాయి. కొన్ని సార్లు ఈ కాంబినేషన్ అలర్జీకు కూడా దారితీస్తాయి. ఒకవేళ, ఈ రెండు పదార్థాలను పిల్లలకు తినిపించాల్సి వస్తే రెండిటికీ మధ్య కనీసం ఒక గంట నిడివి ఉండేలా జాగ్రత్త పడండి.

6. మీట్ మరియు పొటాటోస్:

6. మీట్ మరియు పొటాటోస్:

మీట్ ప్రిపరేషన్స్ లో పొటాటోస్ పాత్ర ప్రముఖమన్నది తెలిసిన విషయమే. పొటాటోస్ లేకుండా మీట్ ని వండటం చాలా అరుదు. అయితే, ఈ ఫుడ్ కాంబినేషన్ లో ఫైబర్ మిస్ అవుతుంది. ఈ విషయాన్ని గ్రహించాలి.

ఫుడ్ లో ఉండే ఫైబర్ అనేది డైజెషన్ ను మెరుగుపరుస్తుంది. అందువలన, ఈ ఫుడ్ కాంబినేషన్ ని పిల్లలకు ఇస్తే వారి డైజెషన్ పై దుష్ప్రభావం పడుతుంది. వారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

English summary

Food combinations that are dangerous for kids

A constant worry of every mother is to make her child eat the right food and provide them with all the nutrients possible. For the same reasons, we tend to give them a variety of food. But there are certain food combinations that are very dangerous. It is advised not to give cereal and juice together, burger and fries or even banana and milk together to your kids.
Story first published: Saturday, July 21, 2018, 11:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more