పిల్ల‌లు బ‌రువు పెరిగేందుకు అవ‌స‌ర‌మైన ఆరోగ్య చిట్కాలు

By: KrishnaDivYa P
Subscribe to Boldsky

మీ గారాల ప‌ట్టి బ‌క్క‌ప‌ల్చ‌గా ఉందా? పోష‌కాహారం లోపంతో బాధ‌ప‌డుతుందా? బ‌రువు పెర‌గ‌డంలో ఇబ్బందులు ఎదుర్కోంటుందా? పై ప్ర‌శ్న‌ల‌కుమీ స‌మాధానం అవును! అయితే మేం చెప్పే ఈ స‌ల‌హాలు పాటించాల్సిందే! స‌రైన పోష‌కాహారం వారికి అందిస్తే పిల్ల‌లు సుల‌భంగా బ‌రువు పెరుగుతారు. ప్రోట్రీన్లు అధికంగా ఉన్న ఆహారం తినిపిస్తే చిన్నారులకు క‌చ్చితంగా కండ‌పుష్టి ల‌భిస్తుంది.

మీ పిల్ల‌ల ఆహారంలో ప్ర‌తి రోజు పాల ఉత్ప‌త్తులు ఉండేలా చూసుకోండి. వీటిల్లో మాంస‌కృత్తులు పుష్క‌లంగా ఉంటాయి. పోషక విలువలు ఉన్న అర‌టి, అవ‌కాడో, అనాస వంటి పండ్లు తినిపిస్తే చ‌క్క‌గా బ‌రువు పెరుతారు. పొప్ప‌డి, అర‌టి, మామిడి, అనాస పండ్ల‌లో స‌హ‌జ చ‌క్కెర‌లు అధికంగా ఉండి శ‌రీరానికి కావాల్సిన శ‌క్తిని అంద‌జేస్తాయి. వీటిని రోజు వారీ ఆహారంలో భాగం చేయండి.

పైన చెప్ప‌న మాదిరిగానే ఇంకా చాలా ఆహారాలు పిల్ల‌లు బ‌రువు పెరిగేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ క‌థ‌నంలో అలాంటి వాటిని మీకు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆల‌స్యం వెంట‌నే చ‌దివేసి మీ పిల్ల‌ల‌ను మ‌రింత శక్తిమంతుల‌ను చేయండి.

వెన్న‌

వెన్న‌

పాల ద్వారా ల‌భించే వెన్నలో ఆరోగ్యానికి సంబంధించిన అన్ని పోష‌కాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు కండ‌పుష్టికి సాయ‌ప‌డుతాయి. చిన్నారుల ఆహారంలో వెన్న‌ను భాగం చేస్తే వారు సుల‌భంగా బ‌రువు పెరుగుతారు. వెన్న‌లో ఉండే అధిక కెలోరీలు మంచి ఫ‌లితాల‌ను అందిస్తాయి.

పాలు, మీగ‌డ‌

పాలు, మీగ‌డ‌

పాలు, మీగ‌డ కూడా అధిక కెలోరీలు ఉన్న ఆహారామే. ఇవి కూడా పిల్ల‌లు దృఢంగా మార‌డానికి ఉప‌యోగ‌ప‌డుతాయి. మీ చిన్నారి ప్ర‌తి రోజు రెండు గ్లాసుల పాలు తాగేలా చూసుకోండి. తిన‌డానికి ఏవైనా ఇచ్చిన‌ప్పుడు అందులో తృణ‌ధాన్యాలు, మీగ‌డ‌, ఉండేలా చూడండి.

కోడిగుడ్లు

కోడిగుడ్లు

త‌క్క‌వు ధ‌రలో అధిక మాంస‌కృత్తులు అందించే ఒకేఒక్క ఆహారం కోడిగుడ్లు. చిన్నారుల రోజు వారీ ఆహారంలో గుడ్డును భాగం చేస్తే వారు బ‌రువు పెర‌గ‌డ‌మే కాకుండా తెలివైన‌వారుగా అవుతారు. పొడ‌వు కూడా పెరుగుతారు. కోడి గుడ్ల‌లో ఖ‌నిజాల‌తో పాటు విట‌మిన్ ఏ, విట‌మి బీ12 పుష్క‌లంగా ఉంటాయి.

అర‌టి

అర‌టి

అధిక కెలోరీలు ఉండి త‌క్ష‌ణ‌మే శ‌క్తినిచ్చే పండు అర‌టి. ఇవి చిన్నారుల‌కు త‌ప్ప‌క అవ‌స‌ర‌మైన పిండి ప‌దార్థాల‌నే కాకుండా ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వును అందించి బ‌రువు పెరిగేలా చేస్తుంది.

కోడిమాంసం

కోడిమాంసం

కోడి మాంసం సైతం అధిక మాంస‌కృత్తుల‌కు నెల‌వు. ఇది కండ‌రాల‌ను పెంచ‌డంలో గొప్ప‌గా సాయ‌ప‌డుతుంది. త‌క్కువ బ‌రువుతో బాధ‌ప‌డే చిన్నారుల ఆహారంలో దీనిని త‌ప్ప‌క భాగం చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. రోజూ అవ‌స‌ర‌మైనంత మాత్ర‌మే కోడిమాంసం తింటే త‌ప్ప‌కుండా బ‌రువు పెరుగుతారు.

అవ‌కాడో

అవ‌కాడో

త‌క్కువ బ‌రువుండే చిన్నారుల‌కు క‌చ్చితంగా అవ‌స‌ర‌మ‌య్యే పండు అవ‌కాడో. ఇందులో ఉండే పుష్క‌ల‌మైన కొవ్వు, పోష‌కాలు పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు, అభివృద్ధికి తోడ్ప‌తాయి. క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ పండ్ల‌ను తింటే క‌చ్చితంగా బ‌రువు పెరుగుతారు.

English summary

tips for weight gain in kids

tips for weight gain in kids, in this article, we at Boldsky will be listing out some of the healthy foods that help children to gain weight in a healthier way. Read on to know more ab
Subscribe Newsletter