మీ బుజ్జి పాపాయిలు ఇంకా మాట్లాడ్డం లేదా! కారణాలు ఇవేనేమో!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

బిడ్డ పుట్టగానే తల్లిదండ్రుల్లో సంతోషం పొంగి పొర్లుతుంది. ఆ ఇల్లంతా ఆనందం నిండుతుంది. చిన్నారి చిట్టిపొట్టి మాటలు.. చిలిపి చేష్టలు ముద్దొస్తాయి. వారి మాటలు చెవులను వినిసొంపుగా ఉండి మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. వారి తొలి పలుకులు వినాలని ఎంతో ఆత్రుతగా అమ్మానాన్నలు ఎదురుచూస్తుంటారు.

కొన్నిసార్లు ఆ ఎదురుచూపులే తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తాయి. తమ తోటి వయస్కులు మాట్లాడుతున్నా మన చిన్నారి మాట్లాడకపోవడం బాధ కలిగిస్తుంది.ఏదేమైన్పపటికీ చాలా సందర్భాల్లో పిల్లలు ఆలస్యంగా మాట్లడ్డం ప్రారంభించినా కొన్నాళ్లకే మిగతావారితో సమానంగా మాటలు నేర్చుకుంటారు. ముఖ్యంగా మన దేశంలో చాలావరకు తల్లిదండ్రులు పూర్తిగా తెలుసుకోకుండానే తమ చిన్నారికి మాటలు త్వరగా రావడం లేదని అనవసర ఆందోళనకు గురవుతున్నారు. నిజం చెప్పాలంటే చాలా సందర్భాల్లో చిన్నారులు ఆలస్యంగానే చిన్ని చిన్ని మాటలు వల్లిస్తారు. ప్రతి చిన్నారి సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అలాగే మాటలు నేర్చుకోవడానికి తగినంత కాలం పడుతుంది.

Reasons for speech delay in kids

అప్పటి వరకు తల్లిదండ్రలు సంయమనంతో ఉండి పిల్లలను ఉత్సాహపరచాలి. పై వాటితో పాటు చిన్నారులు సరైన సమయంలో మాట్లాడుతున్నారా లేదా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఇది చిన్న సమస్య నుంచి పెద్ద లోపంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకు పిల్లలు మాట్లాడలేకపోతున్నారో కనుక్కోవాలి. అవసరమైతే చికిత్స చేయించాలి. అయితే ఎలాంటి సమయాల్లో వైద్య సహాయం అవసరం అవుతుందో ఈ కథనంలో తెలుసుకోండి.

1. ఎదుగుదలలో ఆలస్యం

1. ఎదుగుదలలో ఆలస్యం

కొన్నిసార్లు చిన్నారులు తమ వయసు వారితో పోలిస్తే మరి కాస్త ఆలస్యంగా పుంజుకుంటారు. అయితే ఈ ఆలస్యం తాత్కాలికమే. కాలం గడుస్తున్న కొద్దీ చిన్నారి పెరుగుతున్న కొద్దీ సాధారణ స్థితికి చేరుకుంటారు. తెలివితేటలు పెరుగుతాయి. అన్ని రకాల శబ్దాలు గుర్తించే సామర్థ్యం పెరిగి మాట్లాడతారు.

2. ఆటిజం

2. ఆటిజం

మాటలు ఆలస్యంగా రావడం ఆటిజం లక్షణాల్లో ఒకటి. మీ చిన్నారి ఆటిజంతో బాధపడుతున్నాడని మీకు ముందే తెలిస్తే కాస్త ఆలస్యంగా వారు మాటలు నేర్చుకుంటారు. ఈ విషయం మీరు తెలుసుకుని అందుకు సిద్ధంగా ఉండాలి.

3. అప్రాక్సియా

3. అప్రాక్సియా

అప్రాక్సియాతో బాధపడుతున్న చిన్నారులు సరైన శబ్దాలను గ్రహించలేరు. మీ బుజ్జాయి మాట్లాడుతున్న మాటలు అర్ధం పర్థం లేకుండా ఉంటే మీరు ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే. వెంటనే శిశు వైద్యులను సంప్రదించాలి.

4. డైసర్థియా

4. డైసర్థియా

ఈ స్థితిలో చిన్నారి చాలా చురుకుగా ఉండి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది. అయితే సరైన బాడీ లాంగ్వేంజ్‌ ఉండదు. ఒకొకప్పుడు మాట్లడరు. దీనికి థెరపీ అవసరం.

5. ఎక్కువ భాషలు వినడం

5. ఎక్కువ భాషలు వినడం

కొందరు చిన్నారులు బాల్యంలోనే ఎక్కువ భాషాలు వినాల్సిన పరిస్థిలో ఉంటారు. దాంతో వారు ఏదీ ఏ భాషో తెలియక తికమక పడతారు. ఎందుకంటే వారికి చాలా పదసంపద అవసరం అవుతుంది. ఇందులో మంచి ఏమిటంటే కాస్త ఆలస్యంగానైనా ఆ పద సంపదను అర్థం చేసుకుని అన్ని భాషలు మాట్లాడే స్థాయికి ఎదుగుతారు. తల్లిదండ్రలు గాబరా పడి వైద్యుడిని సంప్రదించాల్సిన పనిలేదు.

6.వినికిడి లోపం

6.వినికిడి లోపం

చిన్నారి తన తొలి మాటలు మాట్లాడిన తర్వాత వినికిడి లోపం తలెత్తితే వారు మాట్లాడ్డం ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా కాస్త నత్తికూడా వచ్చే సూచనలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను మీరు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

7. వ్యక్తీకరణ లోపాలు

7. వ్యక్తీకరణ లోపాలు

ఈ స్థితిలో బుజ్జాయి బాగా ఆలోచిస్తుంది. స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. భావోద్వేగపరంగానూ తెలివిగానే ఉంటుంది. ఆ వయసు వారు చేసే ప్రతి పనీ చేయగలుగుతుంది. అయితే వచ్చే ఒక్క సమస్య సరిగ్గా తన భావాలను మాటల్లో వ్యక్తం చేయలేకపోవడం. చిన్న వయసులోనే మానసికంగా గాయపడితే ఇలాంటి లక్షణాలు వస్తాయి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచింది.

8.తక్కువ తెలివితేటలు

8.తక్కువ తెలివితేటలు

కొన్ని సార్లు మీ బుజ్జాయి ఇతరులతో పోలిస్తే అంత తెలివితేటలతో కనిపించదు. అయితే ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రలు నిరశపడొద్దు. తమ సామర్థ్యం మేరకు మాట్లాడ్డం లేదని కోపగించుకోవద్దు. వారికి అండగా నిలవాలి. నమ్మకం కలిగించాలి. వారికి అవసరమైన సమయం ఇచ్చి చిన్నారి ఎదిగేలా చూసుకోవాలి.

9. సెరిబ్రల్‌ పాల్సీ

9. సెరిబ్రల్‌ పాల్సీ

సెరిబ్రల్‌ పాల్సీ ఉన్న వారు నాలికను సరిగ్గా ఆడించలేరన్న సంగతి తెలిసిందే. ఇది నత్తికి దారి తీస్తుంది. అంతే కాకుండా అభివ్యక్తీరణ సరిగ్గా ఉండకుండా చేస్తుంది. పై కింది దవడల సమన్వయంతో ఉండవు. మీ చిన్నారి దీంతో బాధపడుతుందని మీకు అనిపిస్తే వారు మాట్లాడ్డం కాస్త ఆలస్యం అవుతుందని గమనించండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి.

10. తగిన ప్రోత్సాహం కరవు

10. తగిన ప్రోత్సాహం కరవు

కొన్ని సార్లు చిన్నారి అన్ని రకాలుగా ఆరోగ్యంగానే ఉన్నా మాట్లాడకపోవచ్చు. అందుకు కారణం మీరే అవుతారు. ఎందుకంటే అప్పుడప్పుడే ప్రపంచం గురించి తెలుసుకుంటున్న మీ చిన్నారిని మాట్లాడేలా ప్రోత్సహించడం మీ బాధ్యత. వారితో బుల్లి బుల్లి మాటలు మాట్లాడాలి. వారితో ప్రయత్నం చేయించాలి. ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ చిన్నారి చక్కగా మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తుంది.

English summary

Reasons for speech delay in kids

From the time the child is born, parents wait to hear to the kids to speak, listen and play. And when they notice that the child has a delay in the speech, they are too worried. At times, some children who take up speaking on a slow pace often end up catching with the speech rate of their peers in a couple of years' ti
Story first published: Monday, January 29, 2018, 17:00 [IST]
Subscribe Newsletter