పిల్లలు ఆహారాన్ని నిరాకరించడానికి గల కారణాలివే

Subscribe to Boldsky

మీరొక ఇంటరెస్టింగ్ రెసిపీ గురించి తెలుసుకున్నారు. ఆరోగ్యానికి మంచిదైన ఆ డిష్ ను తయారుచేసేందుకు మీరు వంటింట్లో గంటల కొద్దీ సమయాన్ని గడిపారు. మీ పాపాయికి ఆ డిష్ ని వడ్డించి పాపాయి తింటే ఆనందిద్దామని కలలుగన్నారు. అయితే, మీరు పాపాయి కోసం ఆ డిష్ ని టేబుల్ పై సర్ది ఉంచుతారు.

మీ పాపాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఆ డిష్ ని నిరాకరించడం వలన మీరు డిజప్పాయింట్ అవుతారు. కనీసం రుచి కూడా చూడకుండా ఆ వంటకాన్ని నిరాకరించడం మిమ్మల్ని బాధకి గురిచేస్తుంది. ఈ సినారియో అనేది చాలా మంది తల్లులకు అనుభవమే. తరచూ ఇటువంటి పరిస్థితినే చాలామంది తల్లులు ఎదుర్కుంటూ ఉంటారు.

ఈ విషయంలో మీరు డిజప్పాయింట్ అవడం సహజం. అయితే, ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన వాస్తవం ఏంటంటే కొంతమంది పిల్లలు ఫస్సీ ఈటర్స్ కిందకి వస్తారు. వీరిని ప్లీజ్ చేయడం కష్టం. వీరికి ఏ వంటకమూ అంత త్వరగా రుచించదు. మనం ఎంతగా ప్రయత్నించినా వారు ఆహారాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపరు.

ఈ విషయం వలన మనం కొంత ఆందోళనకు గురవుతాము. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన పోషకాలు వారికి అందడంలేదని తద్వారా పోషకాహార లోపంతో వారు బాధపడతారని చింతిస్తాము.

మన పిల్లలే మన ప్రపంచం. వారి ప్రతీ మాటా చేతా మనకి ఎంతో ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. వారి ఎదుగుదలను చూస్తున్నప్పుడు వారు నేర్చుకుంటున్న కొత్త విషయాలను గమనిస్తున్నప్పుడు మనకి వారిని చూస్తేనే గర్వంగా ఉంటుంది. అయితే, ఫస్సీ ఈటర్స్ క్యాటగిరీలోకి వచ్చే పిల్లలు మనల్ని నిత్యం ఆందోళనకు గురిచేస్తూ ఉంటారు.

పిల్లలు తినడానికి నిరాకరించినప్పుడు, తల్లులు పిల్లల్ని అనేకవిధాల సముదాయించాలని ప్రయత్నిస్తారు. భయపెట్టడం, తిట్టడం అలాగే వారిని ఆటలాడనివ్వకపోవడంతో పాటు వారికిష్టమైన వాటినుంచి దూరంగా ఉంచడం వంటివి చేస్తూ ఉంటారు.

అయితే, ఇటువంటి ఫస్సీ ఈటర్స్ మొండివారు. వారిని సులభంగా సముదాయించడం కుదరదు. కోపం తెచ్చుకుని వారిపై ప్రదర్శించేకంటే వారు ఎందుకు తినటం లేదో అర్థం చేసుకోవడం ముఖ్యం.

పిల్లలు తినకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. ఆ కారణాలని తెలుసుకుని మనం అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోవాలి.

- పిల్లల మీల్ టైమ్స్ మధ్య తగినంత గ్యాప్ లభించిందా?

- పిల్లలకి నచ్చే విధంగా ఫుడ్ ని ప్రిపేర్ చేశారా?

- మీ పిల్లలకు మీల్స్ కి ముందు స్నాక్స్ తినే అలవాటుందా?

- మీ చైల్డ్ కి తగినంత ఫిజికల్ ఎక్సర్సైజ్ లభిస్తోందా? మీ చైల్డ్ యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉంటోందా?

ఒకవేళ ఈ ప్రశ్నలన్నిటికీ మీ సమాధానం కాదు అని వస్తే మీరు సరైన పరిష్కారాన్ని తక్షణమే ఎంచుకోవాలి.

- మీ పిల్లల మీల్ టైం అనేది ప్రోపర్ గా షెడ్యూల్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ప్రతి మీల్ కి మధ్యలో కనీసం మూడు నుంచి నాలుగు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి.

- అలాగే, మీ పిల్లలకు నచ్చే విధంగా ఆహారాన్ని తయారుచేయండి.

- మీల్స్ కి ముందు కనీసం అరగంటపాటు పిల్లలకు స్నాక్స్ ని అందుబాటులో ఉంచకండి. స్నాక్స్ ఇస్తే వారికి ఆకలి వేయదు.

- మీ చైల్డ్ ఎనర్జటిక్ గా లేదా యాక్టివ్ గా లేకపోయినా మీల్స్ టైం లో వారికి ఆకలి వేయకపోవచ్చు.

ఒకవేళ పై పాయింట్స్ ని పరిగణలోకి తీసుకున్నా కూడా మీ పాపాయి ఆహారాన్ని నిరాకరిస్తూ ఉంటే మీ పాపాయి అలా ప్రవర్తించడం వెనుక బలమైన కారణం ఉండవచ్చు. పిల్లలు ఆహారాన్ని తీసుకోకపోవడానికి గల కారణాలని తల్లులు తెలుసుకుని వారికి బలవంతంగా ఆహారాన్ని పెట్టే బదులు వారి సమస్యకు పరిష్కారాన్ని అందిస్తే మంచిది.

పిల్లలు ఆహారాన్ని నిరాకరించడానికే గల కారణాలను ఈ ఆర్టికల్ లో పొందుబరిచాము. వీటిని పరిశీలించండి మరి.

1) మీ పాపాయి సెన్సిటివ్ టేస్ట్ బడ్స్ ని కలిగి ఉంది:

1) మీ పాపాయి సెన్సిటివ్ టేస్ట్ బడ్స్ ని కలిగి ఉంది:

కొంతమంది పిల్లలకు నాలుకపై టేస్ట్ బడ్స్ అనేవి అధికంగా కలిగి ఉంటాయి. అందువలన వారు టేస్ట్ కి సూపర్ సెన్సిటివ్ గా రియాక్ట్ అవుతారు. వీరికి ఏ వంటమైనా ఇట్టే నచ్చదు. వారికి రుచించకపోవడం వలన వారు ఆహారాన్ని నిరాకరిస్తారు.

2) మీ పాపాయి డిస్ట్రాక్ట్ అయినప్పుడు:

2) మీ పాపాయి డిస్ట్రాక్ట్ అయినప్పుడు:

ఇది సాధారణమైన విషయం. టీవీ చూస్తున్నప్పుడు గానీ మొబైల్ లో వీడియోలను చూస్తున్నప్పుడు గాని వారు డిస్ట్రాక్ట్ అవడం సహజం. ఇది వారి అప్పెట్టయిట్ ను స్పాయిల్ చేస్తుంది. అందువలన, వారికి తిండిపై ధ్యాస ఉండదు.

3) ఇర్రెగులర్ బౌల్ మూవ్మెంట్స్:

3) ఇర్రెగులర్ బౌల్ మూవ్మెంట్స్:

ఒకవేళ మీ పాపాయి ఇర్రేగులర్ బౌల్ మూవ్మెంట్స్ సమస్యతో బాధ పడుతూ మోషన్ ని పాస్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే, ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాస అనేది ఉండదు. బౌల్ మూవ్మెంట్స్ సవ్యంగా ఉంటే ఆహారాన్ని స్వీకరించాలని వారికి అనిపిస్తుంది. ఈ ముఖ్యమైన అంశాన్ని తల్లితండ్రులు విస్మరిస్తారు. వారి బౌల్ మూవ్మెంట్స్ ని రెగ్యులర్ చేయడం వలన వారి అప్పెట్టయిట్ ని సాధారణ స్థితికి తీసుకురావచ్చు.

4) ఛాయిస్ లు ఎక్కువగా ఉండటం వలన:

4) ఛాయిస్ లు ఎక్కువగా ఉండటం వలన:

మీ పాపాయికి మీరు ఎక్కువ ఛాయిస్ లను ఇస్తే ఈ అలవాటును తక్షణమే మానుకోండి. మీరు అన్ని ఛాయిస్ లను వారి ముందుంచితే పిల్లలు కన్ఫ్యూజన్ కి గురవుతారు. కార్బ్స్ కి సంబంధించి ఒక ఆప్షన్ ని (రైస్ లే దా రోటీ) అందివ్వండి. అలాగే వారికి నచ్చిన కూరను తయారుచేయండి.

5) అనారోగ్యం:

5) అనారోగ్యం:

ఏదైనా అనారోగ్యం నుంచి మీ పాపాయి ఇటీవలే కోలుకున్న వారికి ఆహారం రుచించదు. అటువంటి పరిస్థితులలో, వారు బాగా కోలుకునే సమయాన్ని వారికివ్వాలి. వారు సాధారణంగా ఆహారాన్ని ఇష్టపడే వరకు వేచి చూడాలి. వారిని ఫోర్స్ చేసి తినిపించడం వలన ఎటువంటి ఉపయోగం లేదు.

6) ఆహారం టెక్స్చర్ నచ్చినట్టుగా లేకపోతే:

6) ఆహారం టెక్స్చర్ నచ్చినట్టుగా లేకపోతే:

చిన్న చిన్న విషయాలనే పిల్లలు ఎక్కువగా పట్టించుకుంటారు. ఆహారం టెక్స్చర్స్ కి సంబంధించి పిల్లలు ఎంతో కచ్చితంగా ఉంటారు. రోజులతరబడి తిండికి దూరంగా ఉంటారు. కొంతమంది పిల్లలకు అన్నం మెత్తగా ఉంటే నచ్చుతుంది. అందువలన, వారికి నచ్చినవిధంగానే ఆహారాన్ని తయారుచేయండి. వారికి మెత్తని పలుచని చపాతీలు ఇష్టమైతే ఆ విధంగానే చపాతీలను నెయ్యి ఉపయోగించి తయారుచేయండి. వారికి నచ్చిన విధంగా ఆహారాన్ని తయారుచేయడానికి కాస్తంత శ్రమకి గురైనా పరవాలేదు. వారి ఛాయస్ లను మీరు గౌరవిస్తే వారు మిమ్మల్నెప్పుడూ డిజప్పాయింట్ చేయరు.

7) ఫుడ్ అలర్జీలు:

7) ఫుడ్ అలర్జీలు:

కొన్ని ఫుడ్ అలర్జీల వలన పిల్లలు కొన్ని ఆహారాలకి దూరంగా ఉంటారు. మీరు గుర్తించని ఫుడ్ అలర్జీలతో వారు బాధపడుతూ ఉండవచ్చు. ఒక ప్రత్యేకమైన ఫుడ్ ను మీ చైల్డ్ ప్రతీసారి నిరాకరిస్తున్నట్టయితే ఆ ఫుడ్ వలన వారిలో సమస్యలు తలెత్తుతున్నాయని మీరు గుర్తించాలి. వారితో మాట్లాడి వారి అసౌకర్యానికి గల కారణాన్ని తెలుసుకోవాలి.

8. ఇంట్లోని వాతావరణం:

8. ఇంట్లోని వాతావరణం:

మీ పాపాయికి మీరు వేరే ఆహారం పెడతారా? కుటుంబసభ్యులందరూ తినే ఆహారాన్ని పాపాయికి అందించరా? అలా అయితే, "బేబీ ఫుడ్" అనే ట్యాగ్ తో విసిగిపోయిన మీ పాపాయి ఆహారాన్ని నిరాకరిస్తూ రావచ్చు. మీ డిన్నర్ లో బేబీని కూడా భాగం కానివ్వండి. కుటుంబమంతా ఏ ఆహారం తీసుకుంటారో పాపాయికి కూడా అదే ఆహారాన్ని అందివ్వండి. ఒకవేళ మీ ఫామిలీ మెంబర్స్ కోసం ఫుడ్ ని స్పైసీగా చేస్తే మీ పాపాయి కోసం అదే ఫుడ్ ని కారాన్ని తగ్గించి చేయండి. ఇలా చేస్తే మీ పాపాయి ఫుడ్ ని హ్యాపీగా ఆస్వాదిస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Reasons Why Children Don’t Eat

    It really a tough job for all mom's to make their child eat nutritious food. Though most of the time mom's end up cooking a tasty food for their little one, but the little will refuse to eat them and at times not even look at the dish. This is the scenario in most of the houses.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more