For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పిల్లలు వర్షాకాలంలో స్కూల్కి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు !

మీ పిల్లలు వర్షాకాలంలో స్కూల్కి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు !

|

వర్షాకాలం అనేది పిల్లలకు చాలా ఆనందకరమైన సమయం. వర్షంలో పరిగెత్తడం, మట్టితో ఆడుకోవటం వంటివి చేశాక, ఇంట్లో ఉన్నవాళ్లందరూ చీవాట్లు పెట్టడం వంటివి మనము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వర్షాకాలంలో పొందిన తీపి జ్ఞాపకాలని చెప్పవచ్చు ! అయితే ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు కూడా చాలా బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది. ఈ వర్షాకాలంలో దోమకాటులు, ఫ్లూ జ్వరాలు, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, స్కూల్లో ఫ్లోర్ మీద జారి పడటం వల్ల కలిగే గాయాలు, ఆకస్మికంగా పిల్లలు గాల్లోకి ఎగరడం & గెంతడం వంటి చర్యల ద్వారా కలిగే ప్రమాదాలు గూర్చి పిల్లల అర్థం చేసుకోలేరు కానీ, తల్లిదండ్రులుగా మీకవన్నీ బాగా తెలుసు.

మీ చిన్ననాటి తనంలో, మీరు కలిగి ఉన్న జ్ఞాపకాల మాదిరిగానే - మీ పిల్లలు కూడా జ్ఞాపకాలను కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్నారు.

Safety measures you should take when your child goes to school in the monsoons

ఈ కింద తెలిపిన 4 సాధారణ చిట్కాలను పాటించడం వల్ల మీ చిన్నారి స్కూల్కి వెళ్లేటప్పుడు చాలా సంతోషకరమైన జ్ఞాపకాలను పొందగలుగుతారని నిర్ధారించుకోండి.

Safety measures you should take when your child goes to school in the monsoons

1. సరైన రైన్ షూస్ను వాడాలి :-

వర్షాకాలంలో కాలు బయట పెట్టాలంటే పిల్లలకు, పెద్దలకు ఇద్దరికీ చాలా గమ్మత్తుగా ఉంటుంది. చలాకీగా ఉన్న పిల్లలు ఎవరైతే స్కూల్ కారిడార్స్, కాంపౌండ్లలో ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటారో, స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వచ్చే పిల్లలకు సరైన పట్టుతో ఉన్న షూస్ పూర్తిగా అవసరమవుతాయి. వీటిని ఉపయోగించడం వల్ల మీ పిల్లలు పడిపోకుండా, గాయాలు కాకుండా ఉంటారన్న హామీతో పాటు, వారి పాదాలను పొడిగా ఉంచడానికి సహాయం చేస్తుంది దీనివల్ల వారికి జ్వరం, జలుబు వంటివి రాకుండా అడ్డుకుంటుంది.

Safety measures you should take when your child goes to school in the monsoons

2. దోమల నుండి రక్షణ :-

ఈ వర్షాకాలంలోనే దోమలు ప్రబలంగా వ్యాప్తిచెందుతాయి. ఈ దోమలు ముఖ్యంగా, పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు (అనగా స్కూలుకి వెళ్లే సమయంలోనూ / స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలోనూ), సూర్యోదయం & సూర్యాస్తమ సమయాలలోనే అత్యంత క్రియాశీలకంగా ఉంటాయని మనందరికీ తెలిసిన వాస్తవం. పిల్లలు ఇంట్లో ఉన్నపుడు దోమల నుంచి రక్షించడానికి లిక్విడ్ రిపెల్లెంట్స్, జెల్స్ వంటివే కాకుండా మంచం చుట్టూ దోమతెరలను ఉంచడం, తెరచివున్న కిటికీలకు మస్కిటో నెట్స్ను అమర్చడం వంటివి చేయాలి.

కానీ మీ చిన్నారి ఇంటి బయట ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి ? దానికి సమాధానంగా, గుడ్ నైట్ ఫ్యాబ్రిక్ రోల్-ఆన్ వంటి ఉత్పత్తులను ఉపయోగించాలి. దీనిని మీ పిల్లల బట్టలపై 4 చుక్కలు అప్లై చేస్తే చాలు, అవి దోమలను మీ పిల్లలకు దూరంగా ఉంచుతాయి. దీనిని అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థవంతంగా ఉపయోగించవచ్చు, అలాగే ఇది 8 గంటల వరకూ తన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, వర్షాకాలంలో బయటకు వెళ్లే స్కూల్ పిల్లల బట్టలకు దీనిని అప్లై చేయడం వల్ల, దోమల విషయంలో మీరు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

3. మంచి రైన్ కోట్ (లేదా) గొడుగు :-

ఈ రెండింటిలో ఏ ఒకటి లేకుండా మీ పిల్లలు బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి. మీ పిల్లలు తడిసిపోకుండా ఉండటానికి వర్షాకాలంలో గొడుగు అవసరమవుతుంది. గాలితో కూడుకున్న భారీ వర్షాలు కురిసేటప్పుడు మాత్రం గొడుగు కన్నా రైన్ కోటు మీ పిల్లలకు అదనపు భద్రతను కలిగిస్తుంది.

ఈ రైన్ కోటు, ఒంటరిగా స్కూలుకి వెళ్లే పిల్లల విషయంలో - వారి స్కూల్ యూనిఫామ్ తడవకుండా పొడిగా ఉంచేందుకు సహాయపడుతుంది. అన్ని రకాలుగా ఆలోచించి వారికి కావలసిన సరైన ఎంపికల గూర్చి పిల్లలు సరిగా ఆలోచించలేరు కాబట్టి, తల్లిదండ్రులుగా మీరే సరైన నిర్ణయం తీసుకోండి.

Safety measures you should take when your child goes to school in the monsoons

4. వాడే బట్టలను, టవల్స్ పొడిగా ఉంచండి :-

పిల్లల వాడిన బట్టలను, సాక్స్లను మార్చడం & టవల్తో మీ పిల్లలు శుభ్రమవడం వంటివి వారిని పూర్తిగా పొడిగా మార్చడానికి సహాయపడలేవు. తడిబట్టలతో పిల్లలు స్కూల్ ఫ్యాన్ కింద కూర్చోవడం వల్ల జలుబు రావచ్చు. టవల్తో శుభ్రంగా తుడుచుకున్న వెంటనే బట్టలను మార్చుకోవడం వల్ల కొన్నిరకాల రుగ్మతల వ్యాపించకుండా నిరోధించబడతాయి.

వర్షంలో స్కూల్ కి వెళ్ళే పిల్లలకు వర్షాకాలం చాలా సరదాగా ఉంటుంది. కానీ మీ పిల్లలు సురక్షితంగా, పొడిగా ఉన్నప్పుడు మాత్రమే పూర్తిస్థాయిలో ఈ వర్షాకాలాన్ని సంతోషంగా ఆస్వాదించగలరని తల్లిదండ్రులుగా నిర్ధారించుకోవడానికి మీరే ప్రయత్నించాలి.

English summary

Safety measures you should take when your child goes to school in the monsoons

The monsoons are an exciting time for children. Running wild in the rain, playing in the mud and getting a scolding for doing it all when you get home are monsoon memories everyone has as children! However, parents have responsibilities as well. Children may not understand, but parents know that monsoons are also a time when mosquitoes, waterborne diseases, the flu, bruises from slippery school floors and other issues are constantly lurking about, waiting to pounce on an unprepared, unsuspecting child.
Story first published:Friday, August 31, 2018, 18:18 [IST]
Desktop Bottom Promotion