పిల్లల్లో పక్కతడిపే సమస్యను నివారించే కొన్ని ఇంటి చిట్కాలు

Subscribe to Boldsky

పిల్లల జీవితంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను తల్లిదండ్రులు ఎదుర్కొంటారు, అందులో ఒకటి పక్కతడపడం. దీన్ని వైద్యపరంగా 'నాక్టర్నల్ ఎన్యూరెసిస్' అంటారు. ఇది గాఢనిద్రలో ఉన్నప్పుడు, తెలివి లేనప్పుడు మూత్రానికి వెళ్లటం అంటారు.

ఈ స్థితి పసిబిడ్డల్లో, చిన్నారులలో సాధారణమైనది. 7ఏళ్ళ లోపు వయస్సు వరకు ఇది ఏమంత పెద్ద సమస్య కాదు. ఏడేళ్ల వయస్సు తర్వాత వారికి కూడా ఇది కొనసాగుతుంటే వెంటనే దీన్ని పరిష్కరించాలి.

Simple Home Remedies to Stop Bedwetting in Kids

పసిబిడ్డల్లో, చిన్నారులలో పక్కతడపటం సాధారణ విషయం

ఇంట్లో ఉన్నప్పుడు పక్క తడిపితే తల్లిదండ్రులు పొద్దున్నే ఆ బెడ్ షీట్లను ఉతికేస్తుంటారు, కానీ బయట ఈ స్థితిని ఎలా ఎదుర్కోవాలి అన్నది ప్రశ్న. ఇది సమాజంలో మీకు పరిచయాలున్నవారికి తెలిస్తే మీ బిడ్డ మరియు మీ యొక్క మానసిక ఆరోగ్యంపై పెద్ద ప్రభావమే చూపించవచ్చు.

అందరూ కలిసి వెళ్ళే పిక్నిక్ లేదా ఫంక్షన్లలో ఈ సమస్యవల్ల ఫ్రీగా ఉండటం కష్టమవుతుంది. కానీ కొన్ని సింపుల్ ఇంటి చిట్కాలతో పక్కతడపటాన్ని సమర్థవంతంగా పరిష్కరించవచ్చు. చదవండి.

కారణాలు

పక్కతడపటానికి ముఖ్య కారణం పిల్లల్లో మూత్రాశయం చిన్నగా ఉండటం. ఇతర కారణాలు నిద్రలేమి, మూత్రనాళ ఇన్ఫెక్షన్మ్ డయాబెటిస్, మూత్రాశయ నియంత్రణ లేటుగా రావటం, మూత్రం ఎక్కువగా ఉత్పత్తి అవటం, మరియు హార్మోన్ అసమతుల్యత కావచ్చు.

లక్షణాలు

మూత్రానికి హఠాత్తుగా వెళ్ళాల్సి రావటం పక్కతడిపే వారిలో ముఖ్య లక్షణం. ఇతర లక్షణాలు మలబద్ధకం, దాహం పెరగటం, మూత్రానికి వెళ్ళేటప్పుడు నొప్పి, జననాంగాల వద్ద ర్యాష్.

పిల్లల్లో పక్కతడపటాన్ని నివారించే ఇంటి చిట్కాలు

వాల్ నట్ మరియు కిస్మిస్ లు

వాల్ నట్ మరియు కిస్మిస్ లు

వాల్ నట్'స్ మరియు కిస్మిస్ లు మంచి ఆరోగ్యకర స్నాక్ మరియు మీ పిల్లలకి కూడా నచ్చినట్లయితే ఇక అవి ఇవ్వటానికి ఆలోచించకండి. రోజూ పడుకునేముందు అవి వారికి పెట్టండి. ఇది విడివిడిగా వేర్వేరు సమయాల్లో కాక ఒకేసారి ఇవ్వాలి. మంచి ఫలితాలు కన్పించేవరకు ఇలానే కొనసాగించండి.

తేనె

తేనె

ఇది పక్కతడిపే పిల్లలకి సులభమైన ఇంటిచిట్కా. ఎందుకంటే తేనె నచ్చని పిల్లలు దాదాపు ఉండరు. సహజమైన తీపిపదార్థం వలన అది శరీరానికి ఎటువంటి హాని కలిగించదు, ప్రతిరోజూ దాన్ని తినవచ్చు. తేనె హైగ్రోస్కోపిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే అది తేమను మరియు ద్రవపదార్థాలని పీల్చుకుని ఉంచగలదు. అందుకని మూత్రాశయం నిండిపోయినప్పుడల్లా తేనె రాత్రి పూట పనిచేయగలదు. టీనేజ్ పిల్లలకి ఒక చెంచా తేనె మరియు పిల్లలకి ఒక చెంచా ఇవ్వవచ్చు.

బెల్లం

బెల్లం

శరీరంలో తక్కువ ఉష్ణోగ్రత పక్కతడపటానికి దారితీయవచ్చు. రెండు నెలల పాటు బెల్లాన్ని క్రమంతప్పకుండా తినటం వలన ఒంట్లో వేడి పెరిగి పక్కతడపటాన్ని తగ్గిస్తుంది. దీన్ని అలానే తినవచ్చు లేదా పాలతో కలుపుకోవచ్చు. కానీ పిల్లలకి ఎక్కువ పెట్టకండి, ఎందుకంటే బెల్లం ఎక్కువయినా సమస్యలు వస్తాయి.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

భారతదేశ వంటిళ్ళలో దాల్చినచెక్క అద్భుతమైన మొక్క ఉత్పత్తి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అనేక సమస్యలు తీరుస్తుంది, పక్కతడపటాన్ని కూడా. పక్కతడపటం డయాబెటిస్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వలనైతే దాల్చినచెక్క చాలా బాగా పనిచేస్తుంది. మీ పిల్లలని ఒక ముక్క దాల్చినచెక్కను ప్రతిరోజూ చప్పరించమని చెప్పండి. వారికి అది నచ్చకపోతే ఉదయం అల్పాహారం, స్మూతీల్లో, మిఠాయిల్లో దాని పొడిని జతచేయవచ్చు.

దేశవాళీ ఉసిరికాయ

దేశవాళీ ఉసిరికాయ

దేశవాళీ ఉసిరిని ఆమ్లా అని కూడా అంటారు. ఇది పక్కతడిపే సమస్యకి మేటి ఆయుర్వేద పరిష్కారం. చాలామంది పిల్లలకి ఉసిరికాయ దాని రుచి వలన నచ్చకపోవచ్చు, కానీ వారికి అది పెట్టే ఒక ఉపాయం ఉంది. విత్తనాలు తీసేసి, రోటిలో మెత్తగా దంచి, ఒకచెంచా తేనె, మరియు చిటికెడు పసుపు వేయండి. ఈ ఉసిరి గుజ్జును చిటికెడు మిరియాల పొడితో కూడా ఇవ్వవచ్చు.

క్రాన్ బెర్రీ రసం

క్రాన్ బెర్రీ రసం

క్రాన్బెర్రీ రసం పక్కతడిపే సమస్యకి మంచి పరిష్కారంగా అందరికీ తెలుసు. పడుకునే ముందు ఒక గ్లాసు రసం తాగాలి. కేవలం తాజా క్రాన్ బెర్రీ రసం మాత్రమే ఇవ్వండి, ప్యాక్ లలో వచ్చేది కాదు. మీ బిడ్డకి రోజుకి మూడుసార్లు అరకప్పు చొప్పున రసం ఇస్తే మంచిది. ఏ భయం లేకుండా ఇవ్వవచ్చు ఎందుకంటే మూత్రాశయ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే పక్కతడిపే సమస్యకి ఇది మంచి పరిష్కారం.

సోంపు గింజలు

సోంపు గింజలు

సోంఫు కూడా పక్కతడిపే సమస్యలను ప్రభావవంతంగా ఎదుర్కొంటుంది. ఒక చెంచా సోంఫును గ్లాసు వేడిపాలలో వేసుకుని తాగాలి. వెంటనే ఒక చెంచా తీపిసిరప్ తాగాలి, తేనె అయితే మంచిది. ప్రతిరోజూ పడుకునే ముందు ఇలా చేయాలి.

అరటిపండు

అరటిపండు

ఈ రుచికరమైన పండుకి చాలా ఆరోగ్యలాభాలు ఉంటాయి. చాలామంది తినేట్టు అజీర్తి సమస్యలకి చికిత్స చేయటమే కాక, పక్కతడిపే సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. మీ పిల్లలకి రోజూ 2-3 పండిన అరటిపళ్ళు పెట్టండి. ఇది తరచూ మూత్రానికి వెళ్ళాల్సి అన్పించటాన్ని నియంత్రిస్తుంది.

మూత్రాశయ వ్యాయామాలు

మూత్రాశయ వ్యాయామాలు

పక్కతడిపే సమస్య ఉన్న పిల్లలకి మూత్రాశయానికి వ్యాయామం సాయంగా ఉండవచ్చు. ఇది మెరుగైన మూత్రాశయ నియంత్రణ ,మరియు వ్యాకోచానికి సాయపడుతుంది. ఒక వ్యాయామం మూత్రానికి వెళ్ళాల్సి వచ్చినపుడు 10-20 నిమిషాలు ఆపుకోవటం. మరొకటి ఎక్కువనీరు తాగి బ్లాడర్ ను వ్యాకోచింపచేయటం. మోకాళ్ళపై చిన్నబంతిని పెట్టి దాన్ని వత్తుతూ, వదులుతూ చేసే కెగెల్ వ్యాయామం కూడా పెల్విక్ కండరాలను ధృఢం చేస్తుంది.

మసాజ్

మసాజ్

పక్కతడపటం పెల్విక్ కండరాల అసంకల్పిత చర్య వల్ల జరుగుతుంది. రాత్రిపూట ఆలివ్ నూనెతో మసాజ్ ఈ సమస్యకి మంచి పరిష్కారం. కొంచం నూనెను వేడిచేసి, మీ అరచేతుల్లో రుద్ది, మీ బిడ్డ కిందిభాగపు పొట్ట మొత్తం రాయండి. కొద్దినిమిషాలు మసాజ్ చేసి వదిలేయండి. ఆలివ్ నూనె మూత్రాశయ కండరాలను బలపర్చి, మూత్రాశయ నియంత్రణను మెరుగుపరుస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Simple Home Remedies to Stop Bedwetting in Kids

    Smoking is a dangerous habit that might have been cool at one point, but is no longer. So, here's what happens to your body once you quit smoking. Within the first 24 hours, you will observe a decrease in your pulse rate, blood pressure, and cardiac risk. And over time, your sense of taste and smell will return along with.
    Story first published: Tuesday, January 16, 2018, 10:05 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more