For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఆయుర్వేదిక్ మందులు మీ పిల్లలకు మంచివి కావు..!

|

ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్య శాస్త్రం విరివిగా ఉపయోగించబడుతుంది. కానీ, ఏ వైద్యశాస్త్రంలో అయినా సరైన మందులు వాడకపోవడం, అవసరాన్ని మించిన డోసేజ్ వాడకం, రోగానికి మరియు శరీర తత్వానికి సరిపోని మందులు వాడడం, వైద్యులలో కొందరు సరైన ధృవీకరణ లేని నకిలీ వైద్యులు ఉండడం వంటి ఇతరత్రా అనేక కారణాల వలన ప్రజలు కొన్ని ప్రతికూల సమస్యలను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. కొన్ని సందర్భాలలో, వయసుతో సంబంధం లేకుండా కూడా మందుల వాడకానికి పూనుకోవడం మూలంగా అనేక దీర్ఘకాలిక సమస్యలకు సైతం గురవ్వాల్సి వస్తుంది.

వినియోగదారులకు కూడా కొన్ని భాద్యతలు ఉంటాయి, సరైన ధృవీకరణ కలిగిన వైద్యుని వద్దకు వెళ్ళడం, ఇచ్చిన మందుల గురించి వాకబు చేయడం, తమ శరీర సమస్యల గురించిన అవగాహన ఉండడం మొదలైనవి. వైద్య విధానం మారుతున్నప్పుడు, ప్రస్తుతం వాడుతున్న మందులను లేదా మూలికలను కొనసాగించాలా లేదా అన్న నిర్ధారణ తీసుకోవడం కూడా ముఖ్యం. లేనిచో శరీరంలో అవసరానికి మించిన జీవక్రియలు జరగడం, క్రమంగా జీర్ణ వ్యవస్థ, కాలేయం, క్లోమం, మూత్ర పిండాలు మరియు హార్మోన్ల అసమతౌల్యానికి గురవడం జరుగుతుంది.

These Ayurvedic Medicines Are Not Safe For Your Kids!

వాస్తవానికి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని అంతర్జాతీయ ఆయుర్వేద ఆరోగ్య సంస్థ ప్రకారం, శిక్షణ పొందిన ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో, సూచించిన మందులను మాత్రమే వాడాల్సి ఉంటుంది.

గర్భిణీ స్త్రీలు లేదా పిల్లలు చికిత్సకు ఉపక్రమించినప్పుడు, ఈ జాగ్రత్త మరింత ఎక్కువగా ఉండాలి. లేనిచో కొన్ని ఇతరత్రా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది.

ఆయుర్వేద మందుల గురించి ప్రజలకు పూర్తి అవగాహన లేకపోవడం, ఇంగ్లీష్ మందులకు సంబందినచిన డ్రగ్స్ మరియు తదితర విషయాల గురించిన పూర్తి సమాచారం అంతర్జాలంలో ఉచితంగా లభించడం వంటి కారణాల వలన, ప్రజలు ఎక్కువగా అల్లోపతి మీదకే మనసును మళ్ళిస్తున్నారు అన్నది వాస్తవం. కానీ ప్రతి చిన్న సమస్యకు అల్లోపతిని పాటించడం మూలంగా కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చు.

రోగి యొక్క అనారోగ్యం మీద కన్నా, పూర్తి ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ప్రతి అంశాన్ని పరిగణనలోనికి తీసుకుంటుంది ఆయుర్వేదం. ఆయుర్వేదంలో ముఖ్యంగా నవజాత శిశువుల సంరక్షణలో 8 ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. వీటిని బాల తంత్ర మరియు కౌమారభ్రుత్య అని వ్యవహరిస్తారు.

పిల్లలకు చికిత్స చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం, ఎందుకంటే వారి కణజాలాలు ('ధాతువులు' అని పిలుస్తారు) బాల్య దశలో, అభివృద్ధి చెందుతున్న దశలో ఉంటాయి. బాల తంత్ర, బాల్య దశ నుండి కౌమారదశ వరకు శ్రద్ధ వహిస్తుంది.

బాల్య దశలో అనేక వ్యాధులు కఫదోషంలోని అసమతుల్యతల కారణంగా సంభవిస్తాయని ఆయుర్వేదం నమ్ముతుంది. క్రమంగా, సరైన చికిత్స మరియు మందులతో కఫ దోషాన్ని సమతుల్యం చేయడానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.

పసిపిల్లల విషయంలో ఆయుర్వేదం తీసుకునే భద్రతా చర్యలు:

ఆయుర్వేద ఔషధం అనేక చికిత్సా పద్ధతులను, మరియు వివిధ రకాల మందులను కలిగి ఉంటుంది. ఆయుర్వేదిక్ మందులను వాడే నవజాత శిశువులు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటారని నిరూపించబడినది కూడా. అయినప్పటికీ, ఈ మందులలో కొన్ని శిశువుకు హాని కలిగించే మూలికలు, లోహాలు లేదా ఖనిజాలను కలిగి ఉండవచ్చు. ప్రత్యేకించి, శిక్షణ పొందిన వైద్యుడి వద్దకు వెళ్లకపోయినా, లేదా సరిగ్గా మందులను వినియోగించకపోయినా కొన్ని ప్రతికూల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. ఉదాహరణకు, కొన్ని మూలికలు సంప్రదాయ ఔషధాలతో కూడా సంకర్షణ చెందుతాయి. అంతేకాకుండా, అవి ప్రధానంగా లెడ్ వంటి లోహాలను కలిగి ఉన్న ఎడల, విషపూరితంగా మారే అవకాశాలు ఉన్నాయి.

ఆయుర్వేద మందులను తయారుచేసేటప్పుడు, భారీ లోహాలను సైతం వినియోగించడం జరుగుతుంది. సాధారణంగా మందుల శక్తిని మెరుగుపరచడం మరియు చికిత్సా లక్షణాలను మెరుగుపర్చడం వంటివి ప్రధాన సూత్రీకరణలుగా చేర్చబడతాయి.

అయితే, సాంప్రదాయ ఔషదాలలో, 'రసశాస్త్రాలలో' పేర్కొన్నట్లు, ఈ లోహాలను సాధారణంగా ఔషధాలలో ఉపయోగించే ముందు శుద్ధి చేయబడతాయి. ఉదాహరణకు, ఆయుర్వేదిక్ మందుల తయారీలో ఉన్న లోహాన్ని పలు తాపన మరియు శీతలీకరణ చక్రాల ద్వారా శుద్ధి చేస్తారు మరియు ఔషధాల తయారీ, సంప్రదాయ పద్ధతిలో కొన్ని ప్రత్యేక 'పోషకాలతో కూడిన మూలికలను' జోడించడం ద్వారా శుద్ధి చేయబడుతుంది. ఏదేమైనప్పటికీ, ఆధునిక సూత్రీకరణల్లో, భారీ లోహాలు తక్కువ నాణ్యత నియంత్రణ కారణంగా ప్రభావాలను అధికంగా చూపవచ్చు. ఇది కల్తీ లేదా కాలుష్యానికి కూడా దారితీయవచ్చు.

దూరంగా ఉంచవలసిన మందులు: కావున, ఏ నిర్దిష్ట ఔషదాన్నైనా మీ బిడ్డకు ఇవ్వాలనుకుంటే మీరు వేటిని పరిగణనలోనికి తీసుకుంటారు? సమాధానం సులభం. అర్హతగల ఆయుర్వేద అభ్యాసకుడిని సంప్రదించకుండా ఏ ఔషధం ఇవ్వకండి. అయితే, మీకు సహాయం చేయడానికి, కొన్ని దూరం పెట్టవలసిన ఔషదాలను పొందుపరచడం జరిగినది.

ఈ ఆయుర్వేదిక్ మందులు మీ పిల్లలకు మంచివి కావు..!

1. జయపల - క్రోటన్ టిగ్లియం

2. స్నూహి - యుఫోర్బియా నెరిఫోలియా

3. విషముష్టి / తిండుక / లకుచ –స్ట్రైక్నోస్ నుక్స్వోమికా

4. దంతి – బాలియోస్పర్మమ్ మోంటానం (దంత్యారిష్టలో వాడతారు)

5. పరాసికా యవని – హియోస్కైమస్ ఇన్బార్ /హియోస్కైమస్ నైగర్

6. ఐఫెనా - పాపవర్ సోమ్నిఫెరం - ఓపియం

7. భంగా – కన్నాబిస్ సాతివా

8. కరవీరా – గ్లోరియోసా సూపర్బ్

9. ఆర్కా - కలోట్రోపిస్ గిగాన్టియన్

10. దట్టూర – దాతుర మెటల్ (కనకసావలో వాడబడింది)

11. వత్సనాభ – అకోనిటం చస్మాంతుం / అకోనిటం ఫెరోక్స్

12. గున్జ - ఆరస్ ప్రికటోరియస్

13. కరవీరా - నీరియం ఇండికం

14.సర్పవిషా - పాము విషం

15. భాల్లాటక - సెమెకర్పస్ అనాకార్డియం

16. ష్రింగివిష – అకోనిటం చష్మాంతుం

17. లాంగాలి – గ్లోరియోసా సూపర్బ్

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య, జీవన శైలి తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

These Ayurvedic Medicines Are Not Safe For Your Kids!

Majority of the Ayurvedic medicines are safe & effective when it comes to treating kids, but some of these medicines may contain herbs, metals or minerals that may be harmful for your kids if used without the direction of a trained practitioner or when used improperly. The article includes a list of medicines that may be unsafe for children.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more