For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పిల్లలకి మందుగా దాల్చినచెక్క ఉపయోగాలు

  |

  ఏ రకమైన సమాచారం అయిన ఇట్టే దొరుకుతున్న ఈ తరంలో,మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటి అంటే వాటిల్లో ఏది నమ్మాలో,ఏది నమ్మకూడదనే విషయం.ప్రత్యేకంగా మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో, మరీ ముఖ్యంగా మన పిల్లల ఆరోగ్య విషయంలో.

  ఈ మధ్య కాలంలో,రకరకాల విషయాల గురించి అందరూ బాగా తెలుసుకుంటున్నారు.గుడ్డిగా వైద్యుల సూచన్లని నమ్మే రోజులు పోయాయి.

  అందరూ ఇప్పుడు వేరే వాళ్ళ అభిప్రాయం తీసుకోవడమో లేక ఇంటర్నెట్ లో చదవడమో చేస్తున్నారు.

  అన్ని విషయాల గురించి తెలుసుకోవడం మరియు వైద్యుల అభిప్రాయాన్ని నిర్ధారించుకోవడం మంచిదే అయినప్పటికీ,ఒక్కోసారి అది తప్పుగా రుజువవుతుంది.అందువల్లన ఎక్కడ వాటి మధ్యలో తప్పు,రైటు అనే గీత గీయాలో మనకి తెలీదు.

  ఆరోగ్యం విషయంలోకి వచ్చేసరికి,ప్రత్యామ్నాయ మార్గాలు మెల్లగా మార్కెట్లోకి మరియు ప్రజల ఆలోచనల్లోకి చేరుతున్నాయి.శాస్త్రీయంగా తయారు చేసిన మందులు మరియు మాత్రలు ఇప్పుడు ప్రజలకి పట్టట్లేదు.

  Uses Of Cinnamon As Medicine For Kids

  ప్రకృతిపరంగా, సహజంగా తయారయిన పదార్థాలు,రసాయినాలు లేనివి మరియు పూర్తిగా సేంద్రీయమైన వాటిని నమ్ముతున్నారు.ప్రజలు ఏ రకమైన దుష్ప్రభావాలు ఉండని ఆయుర్వేద నివారణల వైపు మొగ్గు చూపుతున్నారు.

  ఆయుర్వేదం దాని అధ్బుతమైన నివారణలకు, సురక్షితమైన మరియు సమర్థవంతమైన ప్రయోజనాలకు మెల్లగా ప్రాచుర్యం పొందుతోంది.

  ఆయుర్వేద మూలికల ద్వారా ఇంచు మించి అన్ని రోగాలను నివారించచ్చు.

  పిల్లల తల్లులు కూడా తమ పిల్లలకు ప్రకృతి నివారణలు వాడి ప్రయోజనాలు పొందుతున్నారు,ఎందుకంటే పిల్లలు బాగోలేనప్పుడు వైద్యులని కలిసిన ప్రతీసారి ఏదో ఒక కొత్త ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటున్నాయి.

  పెద్దలకి సురక్షితమైన చాలా మటుకు ఆయుర్వేద మూలికలు, పిల్లలకి కూడా సురక్షితమే. సాధారణంగా పెద్దల కంటే ఎక్కువ పిల్లలు రోగాల బారిన పడతారు.

  అధిక మోతాదులో ఇచ్చే ఇంగ్లీషు మందుల వల్ల దుష్ప్రభావాలు ఉంటాయి కాబట్టి తల్లులు తమ పిల్లలకి ఎప్పుడూ ఆయుర్వేద నివారణల కొరకు వెతుకుతుంటారు.

  మనం ప్రత్యామ్నాయ వైద్యం గురించి మాట్లాడుకుంటున్నపుడు, కొన్ని పదార్థాలకి మిగతావాటి కంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి .వాటిల్లో దాల్చిన చెక్క ఒకటి.

  దాల్చిన చెక్క ఒక వెచ్చని, తియ్యని , ఘాటు వాసన వచ్చే మసాలా దినుసు.కౌమారిన్ అనే ఒక సహజ పదార్థం అందులో ఉంది.వైద్యంలో చాల రోజుల నుంచి వాడుతున్నారు మరియు అనామ్లజనకాలలో శక్తివంతమైనదని పేరు పొందింది.

  దాల్చిన చెక్కలో పాలీ ఫినోల్స్ ఎక్కువగా ఉంటాయి మరియు దాని నూనె ఒక మంచి బాక్టీరియా వ్యతిరేక మరియు ఫంగల్ వ్యతిరేక పదార్థం.దాల్చిన చెక్కతో చాలా రకమైన రోగాలు నివారించవచ్చు;కానీ విస్తృతంగా దగ్గు మరియు జలుబు చికిత్సకి వాడతారు.ఇక్కడ దాల్చిన చెక్క వలన కలిగే వివిధ ప్రయోజనాలు మరియు అది వివిధ ఇన్ఫెక్షన్లని నివారించడానికి ఎలా వాడతారో చదవండి.

  Uses Of Cinnamon As Medicine For Kids

  1) అజీర్తిని తగ్గిస్తుంది

  దాల్చిన చెక్క కడుపుని బాగా పనిచేయించి, జీర్ణ రసాల్ని స్రవింపజేయడం వలన పిల్లలో జీర్ణ శక్తి పెరుగుతుంది.అది రక్త ప్రసరణని మరియు కడుపుకి బలాన్ని పెంచుతుంది.

  పద్దతి:

  చిటికెడు దాల్చిన చెక్క పొడిని ప్రతీ రోజూ భోజనానికి ముందర పిల్లలకి తేనెతో తినిపించాలి.

  Uses Of Cinnamon As Medicine For Kids

  2) ఫంగల్ ఇన్ఫెక్షన్లని తగ్గిస్తుంది

  దాల్చిన చెక్క నూనె సమయం ప్రకారం రాస్తే, అది ఫంగల్ ఇన్ఫెక్షన్లని సమర్ధవంతంగా ఎదుర్కోని పోరాడుతుంది

  పద్దతి:

  సమాన పరిమాణంలో కొబ్బరి నూనె మరియు దాల్చిన చెక్క నూనె కలిపి ఆ మిశ్రమాన్ని ఇన్ఫెక్షన్ ఉన్న చోట రోజుకి రెండు సార్లు రాస్తే,ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి కలిగిస్తుంది.

  Uses Of Cinnamon As Medicine For Kids

  3) కఫాన్ని తీసేయడంలో సహాయం చేస్తుంది

  పిల్లలు తరచూ ఏదో ఒకటి తిని, దాని వల్ల కఫాన్ని పెంచుకుంటారు.దాని వలన దగ్గు,జలుబు వస్తాయి.దాల్చిన చెక్క ఒక వేడి కలిగించే,ఘాటైన దినుసు అవ్వడం వలన అది కఫాన్ని మరియు దగ్గు, జలుగును కూడా పోగొడుతుంది.

  పద్దతి:

  దాల్చిన చెక్క పొడి చిటికెడు మీ పిల్లలు రోజు తాగే పాలలో కలపాండి.

  Uses Of Cinnamon As Medicine For Kids

  4) చెక్కర అధికంగా తినాలనే కోరికలు తగ్గిస్తుంది:

  దాల్చిన చెక్క సహజంగానే తియ్యనైనిది.ఇది చాలా వాటిల్లో చెక్కరకి బదులుగా వాడతారు.ఇది చెక్కరకి మంచి ప్రత్యామ్నాయం, ఎందుకంటే చెక్కర పిల్లలకి చాలా ఆరోగ్య సమస్యలని తెచ్చిపెడుతుంది.

  పద్దతి:

  చెక్కర బదులు దాల్చిన చెక్క ని అన్నిటిలో వాడండి.మీ పిల్లలు తాగే వేడి చాక్లేట్ పాలల్లో దీన్ని వేస్తే ఎంతో రుచి మరియు ఎన్నో ఆరోగ్య పరమైన ప్రయోజనాలు కలుగుతాయి.

  5) రక్తంలో చెక్కర శాతాన్ని అదుపులో పెడుతుంది

  బయట తిండ్లు ఎక్కువ తినడం వలన, పిల్లలు కూడా రక్తంలో అసాధారణ చెక్కర స్థాయిల బారిన పడతారు.దాల్చిన చెక్క వారి రక్తంలోని చెక్కర శాతాన్ని అదుపులో పెట్టి , చెక్కర పదార్థాల వలన కలిగే దుష్ప్రభావాల నుంచి కాపాడుతుంది.

  పద్దతి:

  ప్రతీ రోజూ పడుకునే ముందు వెచ్చని నీళ్ళలో కొంచెం దాల్చిన చెక్క పొడి కలిసి పిల్లలకు పడితే మంచిది.

  English summary

  Uses Of Cinnamon As Medicine For Kids

  Uses Of Cinnamon As Medicine For Kids,Cinnamon is a warm, sweet and strong-smelling spice. It contains a natural ingredient called coumarin. It is since long used in medicine and is also known to be a powerhouse of antioxidants.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more