చిన్నారులలో మలబద్దక సమస్యను నిర్మూలించే కూరగాయలు

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

చిన్నారులు తగినంత నీటిని తాగేందుకు ఇష్టపడరు. అందువలన, వారు మలబద్దక సమస్య బారిన పడతారు. మలబద్దక సమస్య నివారణకు శరీరానికి తగినంత నీరు అవసరమవుతుంది.

అయితే, పోషక లోపాలు, వాటర్ రిటెన్షన్, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడంతో పాటు కొన్ని రకాల మెడికేషన్స్ వలన మలబద్దకం సమస్య తలెత్తుతుంది.

అందువలన, చిన్నారుల చేత నీటిని ఎక్కువగా తాగించాలి. అలాగే, ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను వారిచేత తినిపించాలి.

veggies that relive constipation in kids

చిన్నారులు మలబద్దకం సమస్యతో బాధపడుతూ ఉంటే వారి తల్లిదండ్రుల మనసు కలత చెందుతుంది. అయితే, ఈ సమస్యను సులభంగానే నివారించవచ్చు. కొన్ని రకాల పండ్లను అలాగే కూరగాయలను ఆహారంలో భాగంగా చేసుకోవటం వలన మలబద్దకం సమస్య తొలగిపోతుంది. ఖరీదైన మెడికేషన్స్ ని వాడే బదులు నేచురల్ రెమెడీస్ ని పాటిస్తే అద్భుత ఫలితాలను పొందవచ్చు.

మలబద్దకం సమస్యను నివారించే కూరగాయలు అద్భుతంగా పనిచేస్తాయి. ప్రతి రోజూ, వీటిని చిన్నారుల ఆహారంలో భాగంగా చేస్తే వారి ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది.

veggies that relive constipation in kids

అందువలన, ఈ ఆర్టికల్ లో చిన్నారులకు మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలిగించే కొన్ని రకాల పండ్లు అలాగే కూరగాయల గురించి తెలుసుకుందాం. వీటిని చదివి మీ చిన్నారి సమస్యను తొలగించండి మరి.

ప్రూన్స్: ఫైబర్, పొటాషియంలు ప్రూన్స్ లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి మలబద్దకాన్ని నిర్మూలించే అద్భుతమైన పదార్థాలు. సార్బిటాల్ అనే సహజసిద్ధమైన ల్యాక్సటివ్ వలన మలబద్దకం సమస్య తొలగిపోతుంది. అలాగే, ఇందులో వ్యాధులతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కలవు.

పియర్స్: పియర్స్ అనేవి సహజసిద్ధమైన లక్సటివ్స్ లా పనిచేస్తాయి. వీటిని చిన్నారుల ఆహారంలో భాగంగా చేస్తే స్టూల్ మూవ్మెంట్ సులభంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.

veggies that relive constipation in kids

బ్రొకోలీ: బ్రొకోలీలో ఫైబర్ అధికమోతాదులో లభ్యమవుతుంది. ఇది బవుల్ మూవ్మెంట్ ని సులభతరం చేస్తుంది. పచ్చి బ్రొకోలీని తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. మలబద్దకాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడే అద్భుతమైన రెమెడీ ఇది.

కేరట్స్: పచ్చి కేరట్స్ లో ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇవి స్టూల్ మూవ్మెంట్ ని మెరుగుపరుస్తాయి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కేరట్స్ ని పచ్చిగా తీసుకోవచ్చు. వండిన వాటికంటే పచ్చికేరట్స్ మంచి ఫలితాలను ఇస్తాయి.

బీన్స్: బీన్స్ వలన జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగవుతుంది. వీటిని చిన్నారుల ఆహారంలో భాగంగా చేస్తే మలబద్దకం సమస్య నుంచి వారు ఉపశమనం పొందుతారు. బీన్స్ లో దాదాపు 10 గ్రాముల కంటే ఎక్కువగా ఫైబర్ లభిస్తుంది. అందువలన, వీటిని మలబద్దకం సమస్యకు అద్భుతమైన నేచురల్ రెమెడీగా భావించవచ్చు.

English summary

veggies that relive constipation in kids

in this article, we at Boldsky will be listing out some of the best sources of fruits and vegetables that help in relieving constipation in kids. Read on
Story first published: Friday, January 26, 2018, 18:00 [IST]
Subscribe Newsletter