For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల్లో చర్మం మీద తెల్లని చారలు (పాచెస్) కనిపిస్తున్నాయా ? కారణాలివే, తెలుసుకోండి

|

మానవ శరీరంలో చర్మం బహిర్గతమై ఉండే అతిపెద్ద అవయవంగా ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు కొత్త కణాలచే భర్తీ చేయబడి, పాత మరియు చనిపోయిన మృత చర్మ కణాలను నిరంతరం తొలగిస్తుంటుంది. కానీ చనిపోయిన చర్మం తాలూకు మృత కణాలు చర్మం ఉపరితలంపై చిక్కుకున్నప్పుడు, చర్మంపై తెల్లటి చారలు (పాచెస్) ఏర్పడుతుంటాయి. కొన్ని రకాల చారలు మెలనిన్ నష్టానికి కూడా కారణమవుతుంది.

చర్మానికి భిన్నమైన, అసాధారణమైన రంగును ఇస్తుంది. మెలెనిన్ లోపం కలిగిన పిల్లలు లేదా పెద్దవారి చర్మం లేత గులాబీ రంగులో కనపడడం మనం తరచూ చూస్తుంటాము కూడా. అనేకరకాల కారణాల వలన ఇటువంటి పరిస్థితులు సంభవిస్తాయి. కొన్నిరకాల ప్యాచెస్ చిన్నవిగా ఉండగా, కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో లేదా సరైన చికిత్సా పద్దతులను అవలంభించకపోవడం మూలంగా, క్రమంగా విస్తరిస్తూ చర్మమంతా పాకుతుంటాయి.

dry white patches on baby skin

చర్మం మీద ఈవిధంగా తెల్లని చారలు ఏర్పడడం అనేది, పిల్లలలో ఒక సాధారణ పరిస్థితిగానే ఉంటుంది. ఈ పాచెస్ అనేకరకాలుగా ఉన్నా కూడా, చూసేందుకు ఒకే విధంగా కనిపిస్తాయి, ఒక్కో సమస్యకు ఒక్కో భిన్నమైన కారణం కూడా ఉంటుంది.

ఇక్కడ, ఈ వ్యాసంలో పిల్లలలో చర్మం మీద పాచెస్ ఏర్పడడానికి గల కారణాలు మరియు చికిత్సలను పొందుపరచబడి ఉన్నాయి.

1) పిటిరియాసిస్ ఆల్బా :

1) పిటిరియాసిస్ ఆల్బా :

ఈ రకమైన పాచెస్ పిల్లలలో అత్యంత సాధారణమైన చర్మ పరిస్థితిగా చెప్పబడింది. ఇందులో అసమాన ఆకారాలలో పాచెస్ ఏర్పడడం ఉంటుంది., ఎక్కువగా బుగ్గలు, మెడ మరియు ఎగువ చేతుల మీద ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది. లేదా సూర్యుడికి ఎక్కువగా బహిర్గతం అయ్యే చర్మం మీది ప్రాంతాలు కూడా ఎక్కువగా ప్రభావితం అవుతాయి. అంతేకాక, పొడి చర్మం కలిగిన పిల్లలలో ఈ పరిస్థితి అత్యంత సాధారణమైన సమస్యగా ఉంటుంది.

చికిత్సా విధానం :

-పిటిరియాసిస్ ఆల్బా అనేది సాధారణంగా చర్మం తేమను ఎక్కువసేపు ఉంచుకోలేని కారణంగా వస్తుంది. సూర్యరశ్మికి అధికంగా ప్రభావితమైన పిల్లలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మరియు రానురాను పరిస్థితి తీవ్రతరంగా మారుతుంది.

- సూర్యరశ్మికి ప్రభావితం అవకుండా, ముందుగా మంచి మాయిశ్చరైజర్ను ఉపయోగించడం మూలంగా పిటిరియాసిస్ ఆల్బా సమస్యను నిరోధించడానికి సహాయపడుతుంది.

- కొన్నిసందర్భాలలో, వైద్యులు పరిస్థితిని అనుసరించి స్టెరాయిడ్ క్రీమ్లను సిఫారసు చేయవచ్చు.

-పెట్రియాసిస్ ఆల్బా పాచెస్ వాటికవే కొంతకాలానికి అదృశ్యమవుతాయి.

2) టినియా వెర్సికోలర్ :

2) టినియా వెర్సికోలర్ :

ఇది పిల్లల్లో కలిగే అత్యంత సాధారణ చర్మ సమస్యలలో ఒకటిగా ఉంది. టినియా వెర్సికోలర్ పెద్ద ప్రభావవంతమైనది కానప్పటికీ, శిలీంధ్ర సంక్రమణ (ఫంగల్ ఇన్ఫెక్షన్) వలన సంభవించేదిగా ఉంటుంది. ఇది మెడ మరియు చేతుల్లో అనేక చిన్న చిన్న చారల వలె కనిపిస్తూ, వేసవి కాలంలో చర్మం టానింగ్ గురైన సందర్భాలలో అధికంగా బహిర్గతమై కనిపించవచ్చు. ఈ సమస్య వేసవి కాలంలో ఎక్కువగా వస్తుంటుంది.

టినియా వెర్సికోలర్ సమస్య, చెమటలు ఎక్కువగా పట్టడం, లేదా బిగువైన దుస్తులను ధరించడం వంటి వివిధ రకాల కారణాల వలన సంభవించవచ్చు. ఈ టినియా వెర్సికోలర్ పాచెస్, చూసేందుకు పిటిరియాసిస్ ఆల్బా సమస్య మాదిరే కనిపిస్తుంటుంది. వైద్యులు ఫంగస్ నిర్ధారణ కోసం ప్రభావిత ప్రాంతం నుండి కొంత చర్మాన్ని స్క్రాప్ (తొలగించి పరీక్షించడం) చేయవచ్చు. శిలీంద్ర చాయలు నిర్ధారించబడిన ఎడల, దీనిని టినియా వెర్సికోలర్ వలె గుర్తించడం జరుగుతుంది.

చికిత్సా విధానం :

- టినియా వెర్రికోలర్ చికిత్సకు యాంటీ ఫంగల్ మందులను సూచించడం జరుగుతుంది.

- టినియ వెర్రికోలర్ చికిత్సకు మరొక ప్రత్యామ్నాయంగా సెలీనియం షాంపూలను ఉపయోగించడం కూడా జరుగుతుంది. ఇవి ఇన్ఫెక్షన్స్ బారి నుండి చర్మాన్ని రక్షించుటకు ఎంతగానో దోహదం చేస్తాయి.

- అయితే టినియా వెర్సికోలర్ పునరావృతమయ్యే సమస్యగా గుర్తుంచుకోవడం ముఖ్యం. కావున, ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నివారించే క్రమంలో, తరచుగా దుప్పట్లు, టవల్స్ వంటివి మార్చడం ముఖ్యం. ఎప్పటికప్పుడు శుభ్రపరచిన దుస్తులనే వాడడం అన్నిటికన్నా శ్రేయస్కరం. ఈ చికిత్సలో శుభ్రమైన దుస్తులు, అలవాట్లు కీలకపాత్ర పోషిస్తాయి.

 3) ఉపరితల ఈస్ట్ ఇన్ఫెక్షన్ :

3) ఉపరితల ఈస్ట్ ఇన్ఫెక్షన్ :

కాండిడియాసిస్ అని పిలిచే ఈ ఈస్ట్ సంక్రమణ సమస్య, కాండిడా ఈస్ట్ కారణంగా కలుగుతుంది. తరచుగా తడి లేదా తేమలో చర్మం ఉండడం కారణంగా కలిగే ఈ సంక్రమణ సమస్య, ఎక్కువగా జననేంద్రియ ప్రాంతాలలో లేదా చర్మం మడతలు పడే ప్రాంతాల్లో కలుగుతుంటుంది. ఇది ఒక పాచెస్ వలె కాకుండా, రాష్ వలె కనిపిస్తుంది. క్రమంగా దురద మరియు ఎర్రబారడం వంటి సమస్యలతో కూడుకుని చిరాకుగా ఉండవచ్చు. సరైన చికిత్స తీసుకుంటే, కొంతకాలానికి పూర్తిగా నయమైపోతుంది. ఈ సమస్య పిల్లలలోనే కాదు, పెద్దలలో కూడా సంభవిస్తుంటుంది. ఇన్ఫెక్షన్ బారిత నీటి వినియోగం కూడా సమస్య కారకంగా ఉంటుంది.

చికిత్సా విధానం :

- కొన్ని ఎంపిక చేయబడిన మృదువైన క్రీమ్స్ మరియు జెల్స్ ఈ రకమైన ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కూడిన దద్దుర్లను మరియు వాపును తగ్గించడంలో సహాయం చేస్తాయి.

- నోటి ద్వారా తీసుకునే ఈస్ట్ వ్యతిరేక ఔషధాలు కూడా సమస్య నుండి బయటవేయడంలో తోడ్పాటును అందిస్తాయి.

4) బొల్లి - (విటిలిగో)

4) బొల్లి - (విటిలిగో)

రోగ నిరోధక కణాలు, మెలనిన్ కణాలను అధిక స్థాయిలో నాశనం చేయడం మూలంగా బొల్లి సమస్య తలెత్తుతుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పనిచేయక పోవడం మూలంగా మెలనిన్ కణాలు అధికస్థాయిలో నాశనానికి గురైనప్పుడు, చర్మం లేత గులాబీ రంగులో కనపడడం ప్రారంభిస్తుంది. బొల్లి కూడా పిల్లలు తరచుగా ఎదుర్కొనే సాధారణ సమస్యగా ఉంది. కొన్ని సంబంధిత సర్వేల ప్రకారం, ప్రపంచ జనాభాలో 1 శాతం వరకు పూర్తిగా ఈ సమస్యతో బాధపడుతూ ఉందని తేలింది.

బొల్లి సమస్య, ఇతర స్వయం రోగ నిరోధక వ్యాధుల కారణంగా కానీ, లేదా బొల్లితో బాధపడుతున్న ఇతర కుటుంబ సభ్యుల నుండి వారసత్వంగా పొందే అవకాశాలు ఉన్నాయి. బొల్లి సంబంధిత చారలు లేదా మచ్చలు ఇతర పరిస్థితుల కన్నా భిన్నంగా కనిపిస్తుంది. ఈ సమస్య కను బొమ్మలు మరియు కను రెప్పలను కూడా ప్రభావితం చేస్తుంది. కంటి రెటినాలో మచ్చలు మరియు నోటి లోపలి భాగంలో కూడా తెల్లటి పాచెస్ ఏర్పడడం బొల్లి యొక్క ప్రధాన సంకేతంగా ఉంటుంది.

చికిత్సా విధానం :

- బొల్లి, సాధారణంగా కార్టికాస్టరాయిడ్ క్రీమ్స్ ద్వారా చికిత్స చేయబడుతుంది., కానీ స్థానికీకరించిన బొల్లి సమస్యలలో మాత్రమే.

- ఫొటోథెరపీ ఉత్తమమైన చికిత్సగా ఉన్నప్పటికీ, కేవలం ఫొటోథెరపీ మీద ఆధారపడడం పిల్లలకు అత్యంత హానికరంగా ఉంటుంది. ఫోటోథెరపీలో వైద్యుని సూచనల మేరకు, అనేక విధివిధానాలను పాటించవలసి ఉంటుంది. ఇది పిల్లల్లో బొల్లి పాచెస్ విస్తరణను తగ్గిస్తుంది.

- కొంత వయసు కలిగిన పిల్లలకు, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో, రీ-పిగ్మెంటేషన్ శస్త్రచికిత్సకు కూడా ఉపక్రమించవచ్చు.

5) సోరియాసిస్ :

5) సోరియాసిస్ :

పీడియాట్రిక్ సోరియాసిస్ అనేది పిల్లల్లో చర్మం మీద తెల్లటి పాచెస్ కలిగించే మరో స్వయం రోగ నిరోధక రుగ్మతగా ఉంది. ఈ పరిస్థితిలో వేగంగా పెరుగుతున్న చర్మ కణాల గురించి రోగ నిరోధక వ్యవస్థ హెచ్చరించడం జరుగుతుంది. చర్మ కణాలు మందపాటిగా ఎరుపు రంగులో నిర్మింపబడుతాయి. ఈ పరిస్థితి కూడా వారసత్వంగా వచ్చే సమస్యగా చెప్పబడుతుంది.

సరైన చికిత్స తీసుకోని ఎడల, పీడియాట్రిక్ సోరియాసిస్ ఒక బాధాకరమైన పరిస్థితిగా మారుతుంది.

చికిత్సా విధానం :

- నిజానికి, సోరియాసిస్ పూర్తిగా నయమవుతుందని చెప్పలేము. ఈ సమస్యను జీవితకాలం నిర్వహించవలసిన పరిస్థితి నెలకొంటుంది.

- సోరియాసిస్ ప్రారంభంలో, సమయోచిత ఔషధాలతోనే చికిత్స చేయడం జరుగుతుంది. ఇవి అత్యంత సురక్షితమైనవిగా, పిల్లలకు ఎటువంటి దుష్ప్రభావాలు కలిగించని సమర్థవంతమైనవిగా ఉంటాయి.

- ఫొటోథెరపీ మరియు ఇతర ఔషధాల కలయిక, సోరియాసిస్ పరిస్థితిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి.

6. రుగ్మతలు సాధారణం

6. రుగ్మతలు సాధారణం

పిల్లల్లో చర్మ సంబంధిత సమస్యలు, రుగ్మతలు సాధారణం అయినప్పటికీ, ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్య సహాయాన్ని తీసుకోవడం అత్యవసరంగా ఉంటుంది. అంతేకాక, మీ బిడ్డ సంబంధిత సమస్యల పరిస్థితుల గురించి పూర్తిగా అవగాహన చేసుకునేలా మరియు సమస్యను నిర్వహించుకునేలా తర్ఫీదు ఇవ్వవలసి ఉంటుంది. అనగా వారు చేయవలసిన మరియు చేయకూడని చర్యల గురించిన అవగాహన కలిగించడం, ఔషధాల వాడకం మొదలైనవి. వీటన్నిటికన్నా ఆత్మన్యూనతకు లోనవకుండా మానసికంగా సిద్దం చేయడం ముఖ్యం. లేనిచో హేళనలకు లోనైన పిల్లలు కొన్ని మానసిక పరిస్థితులకు సైతం గురవ్వడం జరుగుతుంటుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

White Skin Patches In Children What Could It Mean?

White skin patches are a common condition in growing children. While most skin patches look the same, they may have a number of causes.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more