For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవజాత శిశువు మలవిసర్జన గురించి మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరములు

|

కొత్తగా తల్లిదండ్రులైన, దంపతులు తమ శిశువు మల విసర్జన విషయంలో అనేక రకాల గందరగోళాలకు గురవుతూ ఉంటారు. అది సహజం. ప్రధానంగా మల విసర్జన సమయం, మరియు మలం రంగు మొదలైన అంశాలు ప్రామాణికంగా ఉంటాయి. మరియు ఒక్కోసారి అనూహ్యంగా కొన్ని విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. శిశువు మలం విభిన్న రంగులు, ఆకృతులలోనే కాకుండా, వారి అరుగుదల, మరియు తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఘన, ద్రవ రూపాలలో ఉంటుంది. క్రమంగా తల్లిదండ్రులు కొంత కంగారుకు లోనవడం పరిపాటి.

ఈ వ్యాసం ఇటువంటి అనుమానాలను నివృత్తి చేసేలా తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేయటానికి దోహదపడుతుంది. అంతేకాకుండా, శిశువు మల విసర్జనలో మలంలోని రకాలు, ఆకృతులు, ఆరోగ్య సంబంధిత అంశాల గురించిన సమగ్ర వివరాలను తెలుసుకునేందుకు సహాయపడుతుంది.

నవజాత శిశువు తరచుగా మలవిసర్జన గావిస్తున్న ఎడల...

మల విసర్జన విషయంలో, శిశువు అనేక రకాల వైవిధ్యాలను ప్రదర్శిస్తుంటుంది. కొన్ని సందర్భాలలో ఆహారం తీసుకున్న వెంటనే మల విసర్జన గావించే వారిగా ఉండగా, కొంతమంది శిశువులు వారంలో రెండు లేదా మూడు మార్లు మాత్రమే వెళ్ళేలా ఉంటారు. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్న సామెత చందాన.

అయితే, శిశువు పాస్ చేసిన స్టూల్స్ సులభంగా బయటకు వచ్చేలా, మరియు మృదువైన ఆకృతిలో ఉండాలని గుర్తుంచుకోండి. అలాకాకుండా, పొడిగా మరియు ఘనంగా ఉంటూ, మలబద్దకానికి గురయినట్లుగా కనిపిస్తే, తక్షణమే వైద్యుని సంప్రదించి, క్రమంగా సూచనల మేరకు చర్యలు తీసుకోవలసి ఉంటుంది.

శిశువు వాస్తవిక ప్రపంచంలోకి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టిన రోజులలో, తల్లి పాలను ఆహారంగా కలిగి ఉండి, రోజులో కనీసం ఆరు నుండి పది మార్లు మలవిసర్జన గావించేలా ఉంటారు. సాధారణంగా ఇక్కడ పోస్ట్ ఫీడింగ్ జరుగుతుంది. ఏమైనప్పటికీ, మూడు నుండి ఐదు వారాల వ్యవధిలో వారు తీసుకునే ఆహారానికి (తల్లి పాలు) అలవాటు పడతారు, క్రమంగా వారి ప్రేగు కదలికలు కొంచం తగ్గుముఖం పట్టి తల్లులకు ఉపశమనాన్ని కలిగిస్తుంటారు. అనగా, ఉదాహరణకు సుమారు 10 మార్లు మల విసర్జన గావించే వారు, ఆ సంఖ్యను గణనీయంగా తగ్గిస్తారు.

నవజాత శిశువు పైన చెప్పిన విధంగా ఉంటూ, స్టూల్స్ పాసింగ్ సవ్యంగా ఉన్న ఎడల ఎటువంటి ఆందోళనా లేకుండా ధైర్యంగా ఉండవచ్చు. మరియు శిశువు సంతోషంగా, ఆరోగ్యంగా కూడా ఉండగలదు. ఏదైనా అసహజ మార్పు, వారి ప్రవర్తనలో కనిపిస్తే, వారు ఒకింత అసౌకర్యానికి లోనవుతూ, భిన్న భావాలను ప్రదర్శిస్తుంటారు. అంతేకాకుండా, వారి మలం సాధారణం కన్నా, భిన్నంగా కనిపిస్తుంటే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించడం ఉత్తమం. అంతేకాకుండా, క్రమంతప్పని పరీక్షలు, టీకాలు ఖచ్చితంగా అనుసరిస్తున్నారని నిర్ధారించుకోండి.

నవజాత శిశువు స్టూల్స్ యొక్క రంగు :

నవజాత శిశువు స్టూల్స్ యొక్క రంగు :

నవజాత శిశువు మలాన్ని మికోనియం అని పిలుస్తారు. ఇది ఒక ఆకుపచ్చ రంగు కూడిన నలుపు రంగులో, స్టికీగా, తారు వంటి రూపాన్ని కలిగి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే మోటారు ఆయిల్, గ్రీజ్ వంటి వాటికి దగ్గరగా ఉన్న పోలికను గమనించవచ్చు. ఇది సాధారణంగా శ్లేష్మం, చనిపోయిన చర్మ కణాలు, అమ్నియోటిక్ ద్రావణం, లానుగో, కొంత పైత్యం మరియు నీటిని కలిగి ఉంటుంది. ఇక్కడ ఎటువంటి దుర్వాసనా ఉండదు. క్రమంగా డైపర్స్ మార్చే సమయాన్ని గుర్తించడం కూడా కష్టమవుతుంది. అందువలన తరచుగా తనిఖీ చేస్తున్నారని నిర్ధారించుకోండి.

కొన్ని రోజులు గడిచిన తర్వాత ట్రాన్సిషనల్ స్టేజ్లో :

కొన్ని రోజులు గడిచిన తర్వాత ట్రాన్సిషనల్ స్టేజ్లో :

కొద్ది రోజులు గడిచిన తర్వాత, శిశువు యొక్క స్టూల్స్ క్రమంగా దాని రంగును తేలికపాటి షేడ్ వచ్చేలా మారుస్తుంది. మలం కొద్దిగా స్టిక్కీగా మరియు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. ఇది శిశువు ప్రేగు వ్యవస్థ చక్కగా పని చేస్తున్నదనడానికి సంకేతంగా ఉంటుంది; అనగా తల్లి పాలను తేలికగా జీర్ణం చేసుకోగలుగుతుంది అని అర్ధం.

క్రమం తప్పకుండా తల్లి పాలను అనుసరిస్తున్న ఎడల :

క్రమం తప్పకుండా తల్లి పాలను అనుసరిస్తున్న ఎడల :

క్రమం తప్పకుండా తల్లి పాలను అనుసరిస్తున్న ఎడల పసుపు ఆకుపచ్చ రంగు షేడ్లో స్టూల్స్ పాసింగ్ ఉంటుంది. మలం ఆకారం క్రీమీ ఆకృతిలో మెత్తగా ఉంటుంది. అంతేకాకుండా, విరేచనాల వలె ద్రవ రూపాన్ని సంతరించుకుంటుంది. క్రమంగా తల్లులు వారి శిశువుకు విరేచనాలు ఏర్పడ్డాయేమో అన్న భ్రమకు లోనుకావచ్చు. ఇక్కడ స్టూల్స్, ఆవ పిండి మరియు కాటేజ్ చీజ్ రంగుల మధ్యలో కనిపిస్తుంది మరియు వయోజనుల మలంతో పోల్చినప్పుడు, తేలికపాటి దుర్వాసనను కలిగి ఉంటుంది.

వివిధ రంగుల షేడ్స్లో

వివిధ రంగుల షేడ్స్లో

సాధారణంగా స్టూల్స్ వివిధ రంగుల షేడ్స్లో ఉంటాయి. ఒకవేళ పచ్చ రంగు అంచున ఉన్నట్లయితే, తల్లి తీసుకునే ఆహారంలో మార్పులు ఉన్నాయని సూచిస్తుంది. ఏదిఏమైనా రంగు తప్ప, ఎటువంటి ఇతర అసాధారణ లక్షణాలు లేని ఎడల, భయపడాల్సిన అవసరమే లేదు.

Most Read : రక్తంశుద్దికావాలంటే ఈ ఎనిమిది రకాల ఆహారాలు తినాలి, రక్తం పెరగాలన్నా రోజూ అవే తినాలి

తక్కువ కేలరీలతో కూడిన తల్లి పాలు :

తక్కువ కేలరీలతో కూడిన తల్లి పాలు :

కొన్ని సందర్భాలలో శిశువు యొక్క మలం ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది, అనగా కొద్దిగా ఆల్గే రూపంలో. పైగా నురుగు కూడా ఏర్పడవచ్చు; దీనికి కారణం, తల్లి పాల నుండి తగినన్ని కాలరీలను శిశువు పొందలేకపోతున్నాడని అర్ధం. రొమ్ము నుండి వచ్చే పాలలో మొదటి భాగం తక్కువ కాలరీలతో, తర్వాత భాగం మందముగా, మరియు అధిక క్యాలరీలతో కూడిన పాలు ఉంటాయి. కావున, శిశువు చివరి సారి పాలు తీసుకున్న రొమ్ము నుండే తిరిగి పాలను అందించడం మంచిదిగా సూచించబడుతుంది. క్రమంగా అధిక కాలరీలు ఉండేలా జాగ్రత్త వహించవచ్చు.

పోతపాల మీద శిశువు ఆధారపడి ఉన్నప్పుడు స్టూల్స్ రంగు :

పోతపాల మీద శిశువు ఆధారపడి ఉన్నప్పుడు స్టూల్స్ రంగు :

దాత లేదా పోత పాల మీద ఆధారపడి ఉన్న పిల్లల స్టూల్స్ యొక్క ఆకృతి పీనట్ బట్టర్ రంగును కలిగి ఉంటాయి, ఇది కూడా కొద్దిగా స్టికీగా ఉంటుంది. బంగారు గోధుమ, ముదురు గోధుమ లేదా ఆకుపచ్చ గోధుమ రంగును కలిగి ఉంటుంది. అలాగే, తల్లి పాలు తీసుకుంటున్న శిశువు స్టూల్స్, పోతపాల మీద ఆధారపడి ఉన్న పిల్లల స్టూల్స్ తో పోల్చినప్పుడు దుర్వాసనలో కొంచం తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ, పోతపాలు తీసుకునే శిశువు స్టూల్స్ వాసన, ఘనాహారాలు తీసుకునే పిల్లల స్టూల్స్ కన్నాతక్కువ గాఢతను కలిగి ఉంటుంది.

శిశువు ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు :

శిశువు ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు :

శిశువుకు ఐరన్ ఫోర్టిఫైడ్ పాలను ఇస్తున్న ఎడల, మలం ముదురు ఆకుపచ్చ లేదా కొన్ని సందర్భాలలో నలుపు రంగును కలిగి ఉండవచ్చు. ఇది ఖచ్చితమైన సంఘటనైతే కాదు, కానీ ఒకవేళ జరిగితే భయపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, శిశువు ఎటువంటి ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోకపోయినా కూడా, స్టూల్స్ నలుపు రంగులో ఉన్న ఎడల, తక్షణమే వైద్యుడిని సంప్రదించండి. ఘనాహారాలు తీసుకున్నప్పుడు, జీర్ణం కాబడిన రక్తం లేదా మెలినా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

తల్లి పాలకు అలవాటుపడి

తల్లి పాలకు అలవాటుపడి

శిశువు మొదటి నుండీ తల్లి పాలకు అలవాటుపడి ఉన్నట్లయితే, అరటి ప్యూరీ, శిశువుకు సూచించే తృణధాన్యాల వంటి ఘనాహార పదార్ధాలను ఇచ్చినప్పుడు, శిశువు స్టూల్స్లో గణనీయమైన మార్పును గమనించవచ్చు. అనగా గోధుమ లేదా ముదురు గోధుమ రంగులో మలం కనిపిస్తుంది. పీనట్ బట్టర్ రంగు కన్నా, మందపాటిగా మరియు దుర్వాసన కూడా అధికంగా కలిగి ఉంటుంది.

Most Read : ఈ మొక్కలు ఇంట్లో ఉంటే దరిద్రం పట్టిపీడుస్తుంది, వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోఉండకూడని మొక్కలు,చెట్లు

తీసుకున్న ఆహారం పాక్షికంగా జీర్ణం అవుతున్నప్పుడు :

తీసుకున్న ఆహారం పాక్షికంగా జీర్ణం అవుతున్నప్పుడు :

శిశువు మునుపటి రోజు తీసుకున్న ఆహారం పాక్షికంగా జీర్ణం అవుతున్నప్పుడు స్టూల్స్ లో ఆహారం చిన్న చిన్న భాగాలుగా కనపడే అవకాశాలు కూడా ఉన్నాయి. క్రమంగా నారింజ, నీలం, ఎరుపు, మొదలైన షేడ్స్ కూడిన రంగులలో స్టూల్స్ కనపడవచ్చు. క్యారెట్లు, టమోటాలు వంటివి సరిగ్గా అరుగుదల కాక, మలంలో ఎరుపు రంగులో కనపడవచ్చు. బీట్ రూట్స్ వంటి దుంప కూరల కారణంగా పింక్ రంగులో, మరియు ఆకుపచ్చని ఆకు కూరల కారణంగా ఆకుపచ్చ రంగులో , బ్లూ బెర్రీస్ కారణంగా నీలం రంగులో కనపడే అవకాశాలు ఉన్నాయి.

ఇది అంతగా ఆందోళన చెందాల్సిన విషయమైతే కాదు. కొన్ని సందర్భాలలో ఆహారం సరిగ్గా జీర్ణంకాక ప్రేగులకు త్వరితగతిన చేరుతుంది, క్రమంగా ఆహారం పూర్తిగా విచ్ఛిన్నం కావు. అంతేకాకుండా, ఆహారాన్ని నమలకుండా మింగడం వలన కూడా ఈ పరిస్థితి ఏర్పడవచ్చు.

జీర్ణం కాని ఆహారాన్ని

జీర్ణం కాని ఆహారాన్ని

అయినప్పటికీ, శిశువు తరచుగా ఇలా పాక్షికంగా జీర్ణం కాని ఆహారాన్ని మల విసర్జన గావిస్తున్న ఎడల, తక్షణమే వైద్యుని సంప్రదించవలసి ఉంటుంది. క్రమంగా శిశువు ప్రేగుల పనితీరును పూర్తిగా పరిశీలించి, పరిస్థితిని అనుసరించి మందులను సూచించవచ్చు.

డయేరియా లక్షణాలు కనిపిస్తున్నాయా :

నవజాత శిశువు డయేరియాకు గురైనప్పుడు, మల విసర్జన పూర్తి స్థాయిలో ద్రవరూపంలోకి మారుతుంది. అంతేకాకుండా మలం రంగు, పసుపు, గోధుమ లేదా ఆకుపచ్చ రంగులలో ఉంటుంది. క్రమంగా డైపర్లలో అధిక లీకేజ్ ఉన్న కారణాన, అలెర్జీ రియాక్షన్స్ లేదా ఇన్ఫెక్షన్లకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. సకాలంలో చికిత్స చేయని ఎడల, కొద్ది రోజులలోనే శిశువు నిర్జలీకరణానికి గురికావచ్చు. కావున ఈ సమయంలో డైపర్లను వినియోగించక ప్రత్యామ్నాయం చూడడం మంచిది. అంతేకాకుండా, తరచుగా గమనిస్తూ ఉండాలి. అప్పటికీ, శిశువులు ఎటువంటి అసౌకర్యాన్నైనా తమ హావభావాలలో తెలియజేస్తుంటారు.

శిశువు 3 నెలల కన్నా అధిక వయస్సుకు చేరినప్పుడు, 1 లేదా రెండు రోజుల పాటు అతిసారం కలిగినట్లుగా మలవిసర్జన గావిస్తున్న ఎడల, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది. అంతేకాకుండా మల విసర్జనలో రక్తం మరియు శ్లేష్మం యొక్క జాడలను అధికంగా కలిగి ఉన్న పక్షాన, ఇది మరింత తీవ్రరూపం దాల్చవచ్చు.

శిశువు మలబద్దకాన్ని అనుభవిస్తున్నాడని గమనించినప్పుడు :

శిశువు మలబద్దకాన్ని అనుభవిస్తున్నాడని గమనించినప్పుడు :

శిశువు మలం చిన్న చిన్న రాళ్ళలా కనిపిస్తూ, మరియు స్టూల్స్ పాసింగ్ సమయంలో కష్టంగా ఉన్న ఎడల, మలబద్ధకం అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి శిశువును మల విసర్జన సమయంలో మరింత అసౌకర్యానికి గురిచేస్తుంది. కొన్ని సందర్భాలలో చర్మం చిట్లి రక్తం కూడా మలంలో చేరి కనపడవచ్చు.

ఒకటి, రెండుసార్లు జరిగితే, పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు, కానీ మూడుమార్లకు మించితే, ఎట్టిపరిస్థితుల్లో వైద్యుని సంప్రదించండి. శిశువులు కొన్ని ఆహార పదార్ధాల పరంగా సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. ఉదాహరణకు కొందరు పోతపాల పరంగా కూడా సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. అవి తీసుకుంటున్న సమయంలోనే, ఇటువంటి సమస్యలకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున పర్యవేక్షణ అవసరం.

నవజాత శిశువు మల విసర్జనలో శ్లేష్మం :

నవజాత శిశువు మల విసర్జనలో శ్లేష్మం :

నవజాత శిశువు మల విసర్జనలో శ్లేష్మం కూడుకుని ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ ఉంటే., ఏదైనా అలెర్జీ లేదా ఇన్ఫెక్షన్లను సూచించే లక్షణంగా ఉండవచ్చు. శిశువు అధికంగా శ్లేష్మంతో కూడిన సొంగ కారుస్తూ ఉంటే, ఈ సమస్యను గుర్తించడానికి వీలుంటుంది.రెండు రోజుల కన్నా ఎక్కువగా మలంలో శ్లేష్మం కనిపిస్తున్న ఎడల , తప్పక వైద్యుని అభిప్రాయం తీసుకోవలసి ఉంటుంది.

స్టూల్స్ ముదురు ఎరుపు రంగు లేదా రక్తంతో కూడుకుని ఉన్న ఎడల :

మలం ఎరుపు రంగులో ఉండేందుకు అనేక కారణాలు ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ విషయంలో జాగ్రత్త తప్పనిసరి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించడం మంచిది.

• కొన్నిసార్లు పాలలోని ప్రోటీన్ కూడా అలెర్జీ కారకంగా ఉండి, మలంలో రక్తం చేరడానికి కారణంగా మారవచ్చు.

• శిశువు మలబద్ధకంతో బాధపడుతున్నట్లయితే, పాయువు భాగంలో చీలికలు ఏర్పడి రక్తస్రావము కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇవి చికాకుతో కూడిన బాధను కలిగించవచ్చు.

• అతిసారం సమయంలో మలంలో ఎరుపు రంగు లేదా రక్తం ఉన్నట్లయితే, అది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సూచిస్తుంది.

నలుపు రంగులో చిక్కటి రక్తం స్టూల్సో కనిపించిన ఎడల :

నలుపు రంగులో చిక్కటి రక్తం స్టూల్సో కనిపించిన ఎడల :

శిశువు రక్తాన్ని జీర్ణించుకున్నప్పుడు, మలంలో ఆ రక్తం నలుపు రంగులో చిక్కగా చేరుతుంది. ఇది నలుపు రంగు పొరలుగా ఉంటుంది, ఎక్కువ నల్ల నువ్వులను తలపించేలా కనిపిస్తుంది. తల్లి రొమ్ముల మీద పగుళ్ళు, లేదా శిశువు తల్లిపాలను తీసుకునే సమయంలో రొమ్ము భాగాన్ని కొరికి గాయం చేయడం కారణంగా ఆ రక్తం శిశువు కడుపులోకి వెళ్ళే అవకాశం ఉంది. క్రమంగా జీర్ణం కాబడిన రక్తం, నల్లటి రంగులో మలంలో కనిపించే అవకాశం ఉంది.

ఈ పరిస్థితి తల్లులకు కొంత బాధను కలిగించినా, శిశువుల పరంగా అంతగా ఆందోళన చెందనవసరం లేదు. ఏదేమైనా, సమస్యలను స్పష్టంగా తెలుసుకునే క్రమంలో భాగంగా వైద్యుని పర్యవేక్షణ అవసరమని మర్చిపోకండి. ఒక్కోసారి ప్రేగు సంబంధిత సంక్రమణకు సంబంధించిన సమస్య కూడా అయ్యే అవకాశం ఉంది.

Most Read : పరకడుపున ఒకే ఒక వెల్లుల్లి రెబ్బ చాలు.. మెడిసిన్స్, డాక్టర్స్ అవసరమే లేదు..!

సాధారణం కన్నా భిన్నంగా కనిపిస్తున్న ఎడల :

సాధారణం కన్నా భిన్నంగా కనిపిస్తున్న ఎడల :

సాధారణ రోజుల కన్నా పూర్తిస్థాయిలో భిన్నంగా స్టూల్స్ కనిపిస్తున్న ఎడల, తీవ్రమైన పరిస్థితిని సూచించే అవకాశం ఉంది. కావున శిశువుల స్టూల్స్ విషయంలో తల్లులు ఒక కన్ను వేసి ఉంచడం మంచిది.

మరికొన్ని సూచనలు :

• మలం మందపాటిగా ఘనంగా ఉన్న ఎడల, మరియు స్టిక్కీ నేచర్ తక్కువగా ఉన్న పక్షంలో ఇది తీవ్రమైన ముప్పుగా మరే అవకాశం ఉంటుంది. ఈ మలం శరీరానికి సంబంధించిన రక్తాన్ని కలిగి ఉండవచ్చు., మరియు మెకోనియంలో ఈ రక్తం, తారు వలె ఉంటుంది. దీనిని మెలెనా అని కూడా పిలుస్తారు.

• అలాకాకుండా మలం జెల్లీ వంటి నిర్మాణంతో కూడుకుని, పూర్తిగా రక్తంతో కూడుకుని ఉంటే, అది తీవ్రమైన ప్రేగు సమస్యలను సూచించవచ్చు.

• చాక్ లేదా పాలిపోయిన రంగులో మలం ఉన్న ఎడల, పిత్తాశయ సమస్య తలెత్తే అవకాశం ఉంది.

శిశువు మలం రంగు, ఆకృతి తరచుగా మారుతుంటుంది, కావున శ్రద్ధతో కూడిన పర్యవేక్షణ అవసరమని గుర్తుంచుకోండి. రోజువారీగా వాటిని పర్యవేక్షిస్తున్న ఎడల, వారి ఆరోగ్య సమస్యల గురించిన అవగాహన పూర్తి స్థాయిలో ఉంటుంది. క్రమంగా ఎటువంటి సమస్య తలెత్తినా, తల్లి వెంటనే పసిగట్టగలుగుతుంది.

అంతేకాకుండా ఎప్పటికప్పుడు వైద్యుని పర్యవేక్షణ అవసరంగా ఉంటుంది. ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే ముందు, నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలను పాటిస్తున్నారని నిర్ధారించుకోండి. పసి పిల్లలు నోటితో తమ భావాలను చెప్పలేరు, కానీ వారి హావ భావాలలోనే వారి సుఖ సంతోషాలను కనుగొనవచ్చు. క్రమంగా పర్యవేక్షణ ఉంచడం ద్వారా, వారి సమస్యలు తీవ్రతరం కాకుండా చూసుకోవచ్చు. అదే క్రమంలో, వారికి తల్లిపాలే ఆధారం కాబట్టి, ఆ తల్లి పౌష్టిక ఆహారం తీసుకోవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. లేనిచో కాలరీల లోపం తలెత్తే అవకాశాలు లేకపోలేదు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవనశైలి, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Everything You Need to Know About Baby Stool

Everything You Need To Know About Baby Stool