For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవజాత శిశువు కడుపు నొప్పితో ఏడుస్తుంటే ఏమి చేయాలంటే..

నవ జాత శిశువుకు తల్లి పాలు కాకుండా ప్యాకెట్ పాలు లేదా డబ్బా పాలను పట్టిస్తే కూడా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

|

నవజాత శిశువులు పుట్టినప్పుడు చాలా ముద్దు ముద్దుగా.. చాలా అందంగా ఉంటారు. వారు సంతోషంగా నవ్వుతూ ఉన్నంతవరకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ ఒక్కసారి వారు ఏదైనా అనారోగ్యానికి గురైతే వారిని సముదాయించడం అంత తేలికైన పని కాదు. చాలా ఓపిక కావాలి. అలాంటి శిశువులకు ఏదైనా చిన్న శారీరక సమస్య వచ్చినా ఆ నవజాత శిశువులు చాలా భయంకరంగా ఏడుస్తారు. అలాంటి ఇబ్బందులలో కడుపు నొప్పి ఒకటి. సాధారణంగా శిశువులు కడుపు నొప్పితో బాధపడే అవకాశం దాదాపు ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు వారి జీర్ణక్రియను, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి. ఈ సందర్భంగా చిన్నపిల్లలకు ఎలాంటి జీర్ణ సమస్యలు వస్తుంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలు..

జీర్ణ సమస్యలు..

జీర్ణ సమస్య ఉన్న పిల్లలు వెంటనే ఏడుపు ప్రారంభిస్తారు. నవజాత శిశువులకు, దాని జీర్ణవ్యవస్థ ఇప్పటికీ సరిగా అభివృద్ధి చెంది ఉండదు. కడుపుకు ఆహారాన్ని పంపే ఫీడింగ్ ట్యూబ్ వాల్వ్ ఇంకా అభివృద్ధి చేయవలసి ఉంటుంది. నవజాత శిశువులకు తరచుగా కడుపు నొప్పి, వాంతులు మరియు వికారం వంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ ఇంటి వద్ద బామ్మల సలహాలు, సూచనలు పాటించాలి. అలాగే డాక్టర్లను నిత్యం సంప్రదించాలి. అలాగే మీ శిశువుకు అమ్మ పాలు కచ్చితంగా పట్టించాలి. అది కూడా పిల్లవాడికి సరైన సమయాలలో ఇవ్వాలి. అప్పుడే మీ పిల్లవాడికి కడుపు నిండుతుంది. హాయిగా నిద్ర పోతారు. బ్బా పాలను, ప్యాకెట్ పాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.

సాధారణ కారణాలు

సాధారణ కారణాలు

వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. పిల్లలు నోటిపై దుమ్ము పెట్టడం, దుమ్ముతో ఆడుకోవడం, నోటిలో చేతులు పెట్టడం వల్ల సాధారణంగా ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. నవజాత శిశువులు ముందుగా తినేటప్పుడు లేదా త్రాగినప్పుడు గాలిని గ్రహిస్తారు. ఇది పిల్లలలో కడుపు నొప్పిని కలిగిస్తుంది. అదేవిధంగా, పిల్లలు ఘనమైన ఆహారాన్ని తినడం ప్రారంభించినప్పుడు మలబద్దకాన్ని అనుభవించవచ్చు. అలాగే ఇప్పుడు శీతాకాలం ప్రారంభమైనందున నీరు కూడా మారుతూ ఉంటుంది. ఇవి కూడా ఒక కారణం కావచ్చు.

ప్యాకెట్ పాలు లేదా డబ్బా పాలు..

ప్యాకెట్ పాలు లేదా డబ్బా పాలు..

నవ జాత శిశువుకు తల్లి పాలు కాకుండా ప్యాకెట్ పాలు లేదా డబ్బా పాలను పట్టిస్తే కూడా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అందుకే సాధ్యమైనంత మేరకు వీటిని దూరంగా పెట్టండి. మీ పిల్లవాడు పెరిగే కొద్ది తల్లి పాలను తగ్గించవచ్చు. అప్పుడు మెల్లమెల్లగా జీర్ణ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అప్పటికీ తగ్గకపోతే మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలి.

కొన్ని లక్షణాలు..

కొన్ని లక్షణాలు..

కడుపు నొప్పి వచ్చినప్పుడు నవ జాత శిశువు కచ్చితంగా ఏడుపు ప్రారంభిస్తాడు. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జ్వరాన్ని కూడా కలిగిస్తుంది. అంతే కాకుండా విరేచనాలు, వాంతులు, మలబద్దకం ఇవన్నీ ఉన్న సమయంలో దీన్ని కడుపు నొప్పి యొక్క లక్షణాలు పరిగణించొచ్చు. ఇవి తీవ్రంగా ఉంటే కూడా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

* అధిక జ్వరం

* తీవ్రమైన విరేచనాలు

* ఆకలి లేకపోవడం

* నిరంతర ఎక్కిళ్ళు

* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

* ఆకుపచ్చ చర్మంలో వాంతులు

* వాంతులు సమయంలో రక్తస్రావం

* నిద్రలేమి

* మలం లో రక్తస్రావం

* అధిక బద్ధకం

ఇలాంటివి మీకు కనబడినప్పుడు మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ సలహాను తీసుకోవాలి. వైద్యుడి సలహా మేరకు తగిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. అప్పుడే మీ శిశువు ఆ సమస్య నుండి ఉపశమనం పొందుతాడు.

English summary

Digestion Problem In Babies Symptoms and Causes

Here are some symptoms and causes of digestion problem in babies. Read on.
Story first published:Thursday, October 31, 2019, 12:39 [IST]
Desktop Bottom Promotion