For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Freedom To Children: పిల్లలకు ఎంత స్వేచ్ఛ ఇవ్వొచ్చు? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం ముఖ్యం. అయితే అది కొన్ని పరిమితులకు, నిబంధనలకు లోబడి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

|

Freedom To Children: పిల్లల పెంపకం చిన్నపిల్లల ఆట ఏం కాదు. ఎంతో బాధ్యతతో కూడుకున్నది. ఎంతో జాగ్రత్తగా ఉండాల్సింది. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పడం దగ్గరి నుండి ఎదుటి వారితో ఎలా మెలగాలి.. ఎలా మాట్లాడాలి అనేది ఒకటికి రెండు సార్లు వారికి చెప్పాలి. చెడు మాటలను, చెడు చేతలను వారించాలి. అలాగే వారు చెప్పేదానికి తల్లిదండ్రులు విలువ ఇవ్వాలి. వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినాలి. వారి ఇబ్బందులను తెలుసుకోవాలి. ఇలా చాలా చాలా ఉంటాయి పిల్లల పెంపకంలో.

How much freedom can children be given? What experts say in Telugu

సైకాలజీ టుడే ప్రకారం, చైల్డ్ డెవలప్‌మెంట్ జర్నల్‌లో ఈ సంవత్సరం ప్రచురించబడిన ఇటీవలి అధ్యయనం ప్రకారం, పిల్లలకు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలి. తల్లిదండ్రులు మరియు పిల్లలు ఇద్దరికీ ఇది ఎంతో మేలు చేసే చర్య అని అధ్యయనంలో తేలింది. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం ముఖ్యం. అయితే అది కొన్ని పరిమితులకు, నిబంధనలకు లోబడి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

మెరుగైన మానసిక స్థితి

మెరుగైన మానసిక స్థితి

ఎక్కువ స్వేచ్ఛ ఉన్న పిల్లలు మానసికంగా మెరుగ్గా ఉంటారని పలు పరిశోధనల్లో తేలింది. వారి స్వంత అవసరాలు చాలా వరకు తీర్చబడతాయని వెల్లడైంది. మరియు కుటుంబం మొత్తం మరింత మానసికంగా ముడిపడి ఉంటుందని తేలింది.

స్వేచ్ఛ' వారిని సిద్ధం చేస్తుంది

స్వేచ్ఛ' వారిని సిద్ధం చేస్తుంది

'పిల్లలకి సరైన స్థాయి స్వేచ్ఛ ఇవ్వడం వారిని కౌమారదశకు సిద్ధం చేయడంలో సహాయపడుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంత స్వాతంత్ర్యం ఇవ్వాలనే దానిపై అనిశ్చితంగా ఉండటం విలక్షణమైనది. కానీ సమాధానం వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. మీ పిల్లల వయస్సు ఎంత, ఎంత పరిణతి చెందారు, పిల్లలకు కుటుంబ మద్దతు ఎంత, వారి గత అనుభవాలు మరియు ఇతర అంశాలతోపాటు నిర్దిష్ట పరిస్థితుల్లో వారు ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు వంటి చాలా అంశాలపై స్వేచ్ఛ ఎలా ఉండాలనేది ఆధారపడి ఉంటుంది.

మీ బిడ్డకు ఎంత స్వేచ్ఛను ఇవ్వాలో మీరు నిర్ణయించుకున్నప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని పరిగణనలు ఇక్కడ ఉన్నాయి.

మీ బిడ్డకు ఎంత స్వేచ్ఛను ఇవ్వాలో మీరు నిర్ణయించుకున్నప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని పరిగణనలు ఇక్కడ ఉన్నాయి.

వయస్సు ముఖ్యపాత్ర పోషిస్తుంది

పిల్లలకు వారి వయస్సుకు ఏది సరైనదో అదే ఇవ్వాలి. చిన్న వయస్సు వారికి ఇచ్చేది లేదా పెద్ద వారికి ఇచ్చేది ఇవ్వవద్దు. అలాగే ఆ వయస్సుకు తగ్గ పనులు చెప్పాలి. వయస్సుతో పాటు మానసిక పరిణితి పెరుగుతుంది. విషయాలను, వస్తువులను, మనుషును క్రమంగా అర్థం చేసుకునే శక్తి వస్తుంది. దానిని బట్టి ఎలా వ్యవహరించాలో తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి. మరీ తక్కువ, మరీ ఎక్కువ కాకుండా పిల్లలకు వారికి అవసరమయ్యే వాటిని అందించాలి. దాని వల్ల వారు అభివృద్ది చెందేందుకు దోహదం చేస్తుంది.

సరిహద్దులు ఉండాలి

సరిహద్దులు ఉండాలి

నియమాలు మరియు సరిహద్దులను కలిగి ఉండటం వలన పిల్లలు సురక్షితంగా ప్రయోగాలు చేయడానికి, తప్పులు చేయడానికి మరియు వారి అనుభవాల నుండి నేర్చుకోవడానికి అనుమతిస్తుంది. వారు ఒంటరిగా ఎంత దూరం ప్రయాణించవచ్చు, ఎంత సేపు బయట ఉండవచ్చు మరియు ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ, వారు తప్పిపోయినా లేదా గాయపడినా ఏమి చేయాలి వంటి నియమాలు వారికి తరచూ చెబుతూ ఉండాలి. ఇది వారిని సురక్షితమైన సర్కిల్ లోనే ఉంచడమే కాకుండా, కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.

పిల్లలను నమ్మండి

పిల్లలను నమ్మండి

పిల్లలకు ఏది ఇష్టమో అది చేయనివ్వండి. పిల్లలు ప్రారంభించిన ఆటలో పాల్గొననివ్వండి. వారి ఊహలపై మీ విశ్వాసాన్ని ఉంచండి మరియు నిరంతర పర్యవేక్షణ లేకుండా వారి ప్రణాళికలను అమలు చేయనివ్వండి. ఆందోళనను నిర్వహించడం నేర్చుకోవడం మరియు పరిమితులను పరీక్షించుకోవడం తెలిసి వస్తుంది. పిల్లలపై ఉన్న నమ్మకం వారిని మరో స్థాయికి తీసుకువెళ్తుంది. వారిలోనూ మీ పై నమ్మకాన్న పెంపొందిస్తుంది. స్వేచ్ఛ ఇవ్వడమే కాదు, దానిని వాడుకోవడం కూడా నేర్పించాలి.

వారికి ఎప్పుడూ మద్దతుగా నిలవండి

వారికి ఎప్పుడూ మద్దతుగా నిలవండి

పిల్లలు తప్పులు చేస్తారు. కొన్ని తెలిసి చేస్తే, చాలా వరకు తెలియకి చేసేవి ఉంటాయి. అల్లరి పనులు చేయడం పిల్లల హక్కు అని మరచిపోవద్దు. వారిలో ఉండే కుతూహలం వారికి చాలా విషయాలు నేర్చుకునేలా చేస్తుంది. మంచి, చెడు గురించి వారికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు కాబట్టి, తప్పులు చేయడం సర్వ సాధారణం. అలాంటి సమయాల్లో వారికి మీ మద్దతు చాలా అవసరం. ఏదైనా చేసినప్పుడు వారికి మీరున్నారనే భరోసా కల్పించాలి. దీని వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరిస్థితుల పట్ల భయం ఉండదు. మీరు వారికి ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నారని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలియజెప్పండి.

English summary

How much freedom can children be given? What experts say in Telugu

read on to know How much freedom can children be given? What experts say in Telugu
Story first published:Monday, August 22, 2022, 12:58 [IST]
Desktop Bottom Promotion