For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో విచిత్రమైన కలలు ఎందుకు వస్తాయో తెలుసుకోండి..

గర్భధారణ సమయంలో నిద్రలేమి వంటి వివిధ కారణాల వల్ల, సరైన సమయానికి నిద్ర లేకపోవడం వల్ల వింత కలలు వస్తుంటాయి.

|

ఈ విశ్వంలోని ప్రతి మానవునికి కలలు రావడం అనేది అత్యంత సహజం. కొందరికి అందమైన కలలు వస్తుంటాయి. మరికొందరికి చెడు కలలు వస్తుంటాయి. చెడు కలలు వచ్చిన సమయంలో చాలా మంది ఉలిక్కి పడి లేస్తుంటారు. అలాగే గర్భధారణ సమయంలో మహిళలకు కూడా కొన్ని విచిత్రమైన కలలు వస్తుంటాయి. వారు కూడా వింత కలలను కనడం సాధారణమే.

Is it normal to have weird dreams during pregnancy?

కానీ కలలో వికారమైనవిగా ఏదైనా అనిపిస్తే వారు పిల్లల గురించి భయపడుతున్నారని అర్థం. వాస్తవానికి తల్లి అయిన ప్రతి మహిళకు మంచి నిద్ర అనేది చాలా ముఖ్యం. కానీ అదే సమయంలో ఆమెను పిల్లలకు మరియు గర్భధారణకు సంబంధించి అనేకమైన అసాధారణ ఆలోచనలు కూడా బాగా కలవర పెడుతుంటాయి. దీని వల్ల ఆమె రాబోయే పిల్లల బాధ్యత కోసం పూర్తిగా సిద్ధం కాలేదని అనుకుంటుంది. దీని వల్ల ఏదైనా తప్పు జరుగుతుందా? అసలు గర్భధారణ సమయంలో ఇలాంటి కలలు ఎందుకు వస్తాయో, వాటికి అర్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హార్మోన్లలో మార్పు కారణంగా..

హార్మోన్లలో మార్పు కారణంగా..

గర్భధారణ సమయంలో నిద్రలేమి వంటి వివిధ కారణాల వల్ల, సరైన సమయానికి నిద్ర లేకపోవడం వల్ల వింత కలలు వస్తుంటాయి. అలాగే గర్భం దాల్చిన మహిళల్లో హార్మోన్లలో మార్పు కారణంగా నిద్రలో తన పిల్లల గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత దీని గురించి దిగులు చెందుతూ ఒత్తిడికి గురవుతుంది.

కలలో జలం కనిపిస్తే..

కలలో జలం కనిపిస్తే..

గర్భధారణ సమయంలో నిద్రలో కలలో నీటిని చూడటానికి లేదా నీటి వనరుల ఆలోచనలను కలిగి ఉండటానికి చాలా అర్ధాలు ఉన్నాయి. రాబోయే పిల్లల తరువాత, మీ జీవితంలో మరియు దినచర్యలో చాలా మార్పులు జరగబోతున్నాయని మీరు నిరంతరం ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంతేకాదు మీరు మీ బిడ్డకు జన్మనిచ్చే జర్నీ గురించి పూర్తిగా ఆలోచిస్తున్నారని అర్థం. అలాగే సముద్రాలు, నదులు, మొదలైనవి కనబడితే, మీరు అందులో తేలుతున్నట్లు వుంటుంది. అలలు ఒడ్డున ఎగిసిపడుతున్నట్లు కల వస్తుంది. దీనికి అర్ధం మీకు పుట్టబోయే బేబీ మీ గర్భంలోని ఉమ్మనీరులో తేలియాడుతోందని చెప్పాలి. మీలోని ఈ నీరు బయటకు వచ్చేస్తుందనే భయం కూడా మీకు కలుగుతోందని అర్ధం చెప్పవచ్చు.

పిల్లవాడిని మరచిపోవడం..

పిల్లవాడిని మరచిపోవడం..

గర్భధారణ సమయంలో పిల్లవాడి గురించి మరచిపోవడం అంటే ఆ మహిళ తల్లి కావడం గురించి ఆలోచిస్తున్నట్లు అర్థం. నిజానికి ఈ ప్రపంచంలో బిడ్డకు జన్మనివ్వడం మరియు కొత్త జీవిని పెంచడం అనేది చాలా భావోద్వేగ భావన. కాబట్టి మీరు బిడ్డను ఎక్కడో మరచిపోయారని కలలు కంటుంటే అలాంటి మహిళలు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఇది రాబోయే మాతృత్వానికి బాధ్యత యొక్క భావన మాత్రమే.

 అబ్బాయి లేదా అమ్మాయి..

అబ్బాయి లేదా అమ్మాయి..

గర్భధారణ సమయంలో నిద్ర పోయిన మహిళలు పదే పదే పుట్టబోయే బిడ్డ అమ్మాయి లేదా అబ్బాయి అవుతుందని ఆలోచిస్తుంటే, అలాంటి మహిళలు చాలా ఎక్కువగా కలలు కంటున్నారని అర్థం.

కలలో కప్పలు కనిపిస్తే..

కలలో కప్పలు కనిపిస్తే..

Image cutosy

కప్పలపైకి ఎక్కడం స్త్రీ కప్పపై తనకు తానే ఎక్కినట్లు కనిపిస్తే, సాధారణంగా అది కంగారుని సూచిస్తుంది. లేదా కప్పలు ఆకాశం నుండి కిందకు పడినట్టు, ఆమెకు వేరే దారిలేక ఆమె దానిపై కాలువేసినట్టు కలలు వస్తే, ఆమె వైపు వచ్చే బాధ్యతల పట్ల ఆమె ఆనందంగా ఉంటుందని అర్ధం.

కలలో గత సంబంధాలు..

కలలో గత సంబంధాలు..

తొలిసారి గర్భం దాల్చే మహిళలు తమకు పుట్టబోయే బిడ్డ గురించి కలలు కనడం సాధారణమే. కలలో చూసే పిల్లలు మీలాగానే లేదా మీ భాగస్వామి లాగానే పోలికలు కలిగి ఉంటారు. ఈ సమయంలో గత సంబంధాలు కూడా కలలో వస్తుంటాయి. మీరు మీ చిన్నతనంలో ప్రేమించి అనేక కారణాలుగా పెళ్ళి చేసుకోలేకపోతే వారికి సంబంధించిన కలలు కూడా వస్తాయి. ఇవి వివిధ రూపాలలో మీకు కనపడతాయి. ఈ కలలకు అర్ధం, మీరు ఇక ఆ వ్యవహారాలు మరచిపోవాలని, భాధ్యతగల కొత్త తల్లిగా వ్యవహరించాలని గుర్తుచేయటం.

భవనాలు, కార్లు కనబడితే..

భవనాలు, కార్లు కనబడితే..

గర్భధారణ సమయంలో భవనాలు, కార్లు కనబడితే మీ గర్భం పెరుగుతుందనడానికి అదొక గుర్తు. గర్భిణుల కలలో భవనాల పరిధులు ప్రెగ్నెన్సీ సమయంతో పాటు మారుతూ ఉంటాయి. కారు కనబడితే మీ జీవితంలో కొన్ని దశలు దాటుతున్నారని అర్థం. అదే లగ్జరీ కార్లు కనపడితే, మీ జీవితం హాయిగా సాగిపోతోందని అర్ధం. పెద్ద పెద్ద ట్రక్కులు కనపడితే, మీరు రాబోయే మీ జీవితంలో స్ధిరపడేందుకు సతమతమవుతున్నారని అర్ధంగా వుంటుంది.

ప్రతి అనుభవం తాజా అనుభూతిలా..

ప్రతి అనుభవం తాజా అనుభూతిలా..

Image curtosy

గర్భధారణ సమయంలో వచ్చే కలల్లో గర్భధారణకు సంబంధించిన ప్రతి అనుభవం గర్భిణులకు ఒక తాజా అనుభూతిగా ఉంటుంది. హార్మోన్ల స్ధాయి పెరిగిన కారణంగా కొత్త అనుభూతులు చెందుతూంటుంది. ప్రొజెస్టిరోన్ హార్మోన్ లోని పెరుగుదల, తగ్గుదల, కలలను ప్రభావితం చేస్తాయి. హార్మోన్లు మీ బ్రెయిన్ తో నేరుగా సంబంధం కలిగివుంటాయి. కనుక మీ గర్భస్ధ దశలోని జాగ్రత్తలు, భయాలు, మీకు కలలుగా వస్తూ వుంటాయి.

English summary

Is it normal to have weird dreams during pregnancy?

Here we talking about the weird dreams during pregnancy, is it normal?. Read On
Desktop Bottom Promotion