For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్నారులకు సోకే అలెర్జీలు - సహజ నివారణ చర్యలు

చిన్నారుల అలెర్జీలు - సహజ నివారణ చర్యలు

|

వయోజనులతో పోల్చుకుంటే, చిన్నారులలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే, వారు తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ప్రత్యేకించి, కాలాలు (రుతువులు) మారేటప్పుడు సంక్రమించే సీజనల్ అలెర్జీలు పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంటాయి.

మీ పిల్లవాడు పార్కులో ఆడుతున్నప్పుడు అతని చర్మంపై ఎర్రటి మచ్చ పెరిగినట్లు మీరు గమనించవచ్చు. అలాకాకుండా, మీ చిన్నారి మీ పొరుగింట్లో ఉండే పెంపుడు పిల్లితో ఆడిన తర్వాత ఆమె తరచూ తుమ్మటం మీరు వినవచ్చు. లేదా లాన్ మూవర్‌ను ఉపయోగించి తర్వాత సదరు వ్యక్తి కళ్లు ఎర్రగా ఉండటాన్ని చూడొచ్చు.

అలెర్జీ అంటే ఏమిటి? అదెలా సోకుతుంది?

అలెర్జీ అంటే ఏమిటి? అదెలా సోకుతుంది?

పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా కనిపిస్తే, అవి అలెర్జీ కారకాలని మనం గుర్తుంచుకోవాలి. అలెర్జీలు అనేక రకాలుగా సంక్రమిస్తాయి. ఇదివరకు చెప్పుకున్నట్లుగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇవి వెంటనే బయటపడుతాయి. అదే ఎవరికైనా బలమైన రోగ నిరోధక శక్తి ఉంటే, అసలు ఈ లక్షణాలు కనిపించికపోవచ్చు.

పిల్లలలో అలెర్జీ అనేది దుమ్ము (డస్ట్), పుప్పొడి (పోలెన్), జంతువుల చుండ్రు (యానిమల్ డాండెర్), క్రిములు కుట్టడం (ఇన్‌సెక్ట్ స్టింగ్స్), కొన్ని రకాల మందులు పడకపోవటం మరియు కొన్ని రకాల ఆహారాలు పడకపోవటం వంటి కారణాల వలన సోకుతుంది. ఎలాంటి పిల్లలకైనా అలెర్జీ సోకవచ్చు. వారి రోగనిరోధక వ్యవస్థ సాధారణంగా హానిచేయని పదార్ధానికి అతిగా స్పందించినప్పుడు ఇలా జరుగుతుంది.

మీ పిల్లలు అలెర్జీ కారకాన్ని తిన్నప్పుడు, తాకినప్పుడు లేదా ఊపిరిలో పీల్చుకున్నప్పుడు, వారి రోగనిరోధక వ్యవస్థ హిస్టామైన్‌లను విడుదల చేస్తుంది. ఇది అలెర్జిక్ రియాక్షన్ యొక్క లక్షణాలను కలిగిస్తుంది. ఈ అలెర్జీ లక్షణాలనేవి ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండి. ఇవి వ్యక్తులను బట్టి, వారి రోగ నిరోధక శక్తిని బట్టి మారుతూ ఉంటాయి. ఇలాంటి అలెర్జీ కారకాలు మీ పిల్లల చర్మం, శ్వాస మార్గము మరియు ఇతర అవయవాలను ప్రభావితం చేస్తాయి.

 ఈ అలెర్జీ కారకాలు మీ పిల్లల చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

ఈ అలెర్జీ కారకాలు మీ పిల్లల చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

ఒకవేళ మీ పిల్లలు అలెర్జీ కారకంతో సంబంధం కలిగి ఉండి, వారికి చర్మ సంబంధమైన అలెర్జీ గనుక సోకినట్లయితే, వారి చర్మంపై మీరు వివిధ రకాల మార్పులను గమనించవచ్చు. వీటిలో మీ పిల్లల చర్మం ఎరుపు రంగులోకి మారడం, చర్మంపై దురద పుట్టడం, చర్మంపై పొలుసులు (డెడ్ స్కిన్) ఏర్పడటం, దద్దుర్లు రావటం మరియు చర్మం వాయటం మొదలైన లక్షణాలు ఉంటాయి.

పిల్లలు అలెర్జీ కారకాన్ని తాకినప్పుడు, పీల్చుకున్నప్పు లేదా తిన్నప్పుడు కూడా వారి చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ అలెర్జీలలో ముఖ్యంగా చర్మంపై దద్దుర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి మరియు ఇవి దాదాపుగా ఎల్లప్పుడూ దురద పుట్టేలా ఉంటాయి.

అలెర్జీ ఉన్న కొందరు పిల్లలు తామరను కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఇది వారికి అలెర్జీ కారకాలతో సంబంధం లేకపోయినా కూడా రావచ్చు. ఇలాంటి వారికి అలెర్జీ సోకిన ప్రదేశం ఎర్రగా మారి, దురద పెడుతూ మరియు చిరాకును కలిగిస్తూ ఉంటుంది.

 అలెర్జీలో శ్వాసకోశకు సంబంధించిన లక్షణాలు ఏమిటి?

అలెర్జీలో శ్వాసకోశకు సంబంధించిన లక్షణాలు ఏమిటి?

ఇప్పటి వరకూ మనం చర్మానికి సంబంధించిన సంబంధించిన అలెర్జీల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందులో శ్వాసక్రియను ప్రభావితం చేసే అలెర్జీల గురించి చెప్పుకుందాం. అలెర్జీ కారకాలు మీ పిల్లల శ్వాస మార్గము మరియు సైనస్‌లను కూడా ప్రభావితం చేస్తాయి.

పిల్లలు అలెర్జీ కారకంతో సంబంధంలోకి వచ్చిన తరువాత, వారు తరచూ తుమ్మడం, ముక్కు దిబడ లేదా ముక్కు కారటం వంటి సమస్యతో బాధ పడటం, కళ్లు ఎర్రగా మారటం, దురద పెట్టడం లేదా తరచూ నీరు కారడం, ముఖంపై వత్తిడి (భారం) పడుతున్నట్లు అనిపించడం, దగ్గు, శ్వాసలోపం, ఊపిరి పీల్చుకోవటంలో ఇబ్బంది కలగటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఒకవేళ మీ పిల్లలలో ఈ తరహా అలెర్జీ లక్షణాలు కనిపిస్తే, వాటిని ఉపేక్షించకూడదు, ఇది ప్రాణాంతకమైన అలెర్జిక్ రియాక్షన్. ఈ అలెర్జీ లక్షణాల వలన పిల్లలు ఊపిరి పీల్చుకునే వాయుమార్గాలను మూసివేయబడి, వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.

అలెర్జీలు ఇంకా ఎలాంటి ఇతర లక్షణాలను కలిగి ఉంటాయి?

అలెర్జీలు ఇంకా ఎలాంటి ఇతర లక్షణాలను కలిగి ఉంటాయి?

అలెర్జీ సోకిన పిల్లలలో పైన తెలిపిన లక్షణాలే కాకుండా, ఇతర లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. వాటిలో మైకం వచ్చినట్లు ఉండటం, తల తిప్పుతున్నట్లుగా అనిపించడం, అనవసరమైన ఆందోళన కలగటం, వళ్లు నొప్పులుగా ఉండటం, విరేచనాలు (డయేరియా), వాంతులు, నోటి పుండ్లు మరియు నాలుక లేదా ముఖం వాచినట్లుగా ఉండటం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.

తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య విషయంలో పిల్లలు స్పృహను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. మీ పిల్లలకి అలెర్జీ సోకిందని మీకు అనుమానం వచ్చిన తక్షణమే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. ఒకవేళ అలెర్జీ తీవ్రత అధికంగా ఉన్నట్లయితే, మీ వద్ద అందుబాటులో ఉన్న ఎపినెఫ్రిన్ మెడిసన్ ఇవ్వొచ్చు. పరిస్థితి విషమిస్తున్నట్లుగా అనిపిస్తే, తక్షణమే ఎమెర్జెనీ మెడికల్ సర్వీసుకి ఫోన్ చేయండి.

సాధారణ అలెర్జీ ప్రతిచర్యలను ఎలా నిరోధించవచ్చు?

సాధారణ అలెర్జీ ప్రతిచర్యలను ఎలా నిరోధించవచ్చు?

అలెర్జీ ప్రతిచర్యలను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం అలెర్జీ కారకాలకు దూరంగా ఉండటమే. మీ పిల్లలకి ఏయే అలెర్జీ కారకాలు ఉన్నాయో మీరు గుర్తించగలిగినట్లయితే, వాటిని ఎలా నివారించవచ్చనే అనే అంశాలను వైద్యుడిని సంప్రదించి తెలుసుకోవచ్చు.

ఉదాహరణకు, మీ పిల్లలకి గడ్డి అంటే అలెర్జీ ఉన్నట్లయితే, డాక్టర్ అలాంటి వారిని బయట గడ్డిలోకి తీసుకువెళ్లేటప్పుడు పొడవైన దుస్తులు మరియు సాక్సులు ధరించమని సలహా ఇవ్వొచ్చు. ఒకవేళ మీ పిల్లలకు కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువుల వలన అలెర్జీ సోకుతున్నట్లయితే, డాక్టర్లు వాటికి దూరంగా ఉండమని సలహా ఇస్తారు.

అదేవిధంగా పిల్లలకు కొన్ని రకాల ఆహారాలు మరియు మందులకు అలెర్జీ సోకుతున్నట్లయితే, వాటికి ప్రత్యామ్నాయలను వైద్యులు సూచిస్తారు. ఉదాహరణకు, మీరు ఎప్పుడైనా రెస్టారెంట్‌కి వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే, సదరు డిష్‌లో ఉపయోగించే ఆహార పదార్థాల గురించి చదవటం లేదా రెస్టారెంట్ వారిని అడిగి తెలుసుకోవటం మంచిది. అందులో మీ పిల్లలకు అలెర్జీ కలిగించే పదార్ధాలు ఏవైనా ఉంటే, వాటిని తొలగించమని రెస్టారెంట్ వారిని కోరవచ్చు.

 అలెర్జీ నివారణ కోసం మీరు సహజ నివారణలను ఉపయోగించవచ్చా?

అలెర్జీ నివారణ కోసం మీరు సహజ నివారణలను ఉపయోగించవచ్చా?

సాధారణంగా అలెర్జీలనేవి ఎవరికైనా రావచ్చు. చిన్నపాటి అలెర్జీలకు ఇంటిలో ఉండే వస్తువులతోనే రెమిడీస్ తయారు చేసుకోవచ్చు. సాధారణంగా అలెర్జీ ప్రతిచర్యలకు చికిత్స చేయడానికి, వైద్యులు మీ పిల్లల కోసం కొన్ని రకాల మందులను సిఫారసు చేస్తారు. ఉదాహరణకు, వైద్యులు మెడికల్ కౌంటర్లలో లభించే యాంటిహిస్టామైన్లు, ప్రిస్క్రిప్షన్ యాంటిహిస్టామైన్లు లేదా ఎపినెఫ్రిన్‌లను సిఫారసు చేయవచ్చు.

ఒకవేళ ఇలాంటివి అందుబాటులో లేకపోయినట్లయిత, కొన్ని సహజ నివారణలు తేలికపాటి అలెర్జీ లక్షణాలను ఉపశమనం చేయడంలో కూడా సహాయపడతాయి. కానీ తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యకు చికిత్స చేయడానికి మీరు సహజ నివారణలను ఎప్పుడూ ఉపయోగించకూడదు. అలాంటి తీవ్రమైన అలెర్జీలకు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. మీ పిల్లల అలెర్జీలకు కొత్త చికిత్స చేయడానికి ముందు తప్పనిసరిగా మీ పిల్లల వైద్యుడితో మాట్లాడండి.

చర్మ సంబంధిత అలెర్జీలు - సహజ నివారణలు

చర్మ సంబంధిత అలెర్జీలు - సహజ నివారణలు

చర్మ సంబంధిత అలెర్జీల నివారణ కోసం యాంటిహిస్టామైన్ క్రీములు మరియు లోషన్లు చాలా మందుల దుకాణాల్లో లభిస్తాయి. ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు ఇంట్లో దొరికే వస్తువులతోనే ఉపశమన చర్యలు తీసుకోవచ్చు.

ఉదాహరణకు, చర్మ సంబంధిత అలెర్జీ విషయంలో ఉపశమనం కలిగించడం కోసం, శరీరంపై ప్రభావిత ప్రాంతాన్ని వెచ్చని నీరు మరియు తేలికపాటి సబ్బుతో శుభ్రం చేయటం. ఆ తర్వాత కలబంద (ఆలోవేరా) జెల్ లేదా కలేన్ద్యులా క్రీమ్‌ను అప్లయ్ చేయటం చేయాలి.

అయితే, కొంతమంది పిల్లలు పైన తెలిపిన పదార్థాలకు కూడా సున్నితంగా ఉంటారని మనం గమనించాలి. మీ పిల్లల చర్మం పొడిగా ఉంటే, సువాసన లేని మాయిశ్చరైజింగ్ క్రీమ్ లేదా ఆయింట్‌మెంట్‌లను వారి శరీరంపై ఉపయోగించవచ్చు.

అలెర్జీ వలన శరీరంపై వచ్చే దద్దుర్ల నుండి ఉపశమనం పొందడానికి, ఆ ప్రాంతంపై చల్లని తడి గుడ్డను చుట్టాలి. మీ పిల్లల స్నానపు నీటిలో బేకింగ్ సోడా లేదా ఓట్‌మీల్‌ను ఉంచడం వంటివి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి.

అలెర్జీ వలన కలిగే సైనస్ లక్షణాలు - సహజ నివారణలు

అలెర్జీ వలన కలిగే సైనస్ లక్షణాలు - సహజ నివారణలు

వాయు మార్గం ద్వారా సంక్రమించే అలెర్జీల పూర్తిగా నివారించడం కష్టమే. అయితే, కొన్ని ముందస్తు జాగ్రత్తల వలన వీటిని నివారించవచ్చు. ఉదారణకు, మీ ఎయిర్ కండీషనర్‌లో ఫిల్టర్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం, అలెర్జీని ప్రేరేపించే పెంపుడు జంతువులను దూరంగా ఉంచడం, పుప్పొడి (పోలెన్ కౌంట్) ఎక్కువగా ఉన్నప్పుడు ఆరు బయట తిరగకుండా ఉండటం మొదలైనవి.

తేలికపాటి శ్వాసకోశ లక్షణాలకు చికిత్స చేయడానికి, అలెర్జీ మందులను ప్రయత్నించండి. ఇలాంటి అలెర్జీలకు న్యాచురల్ రెమిడీష్ విషయానికి వస్తే, వేడి నీటితో ఆవిరి పీల్చడం గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. ఇది మూసుకుపోయిన ముక్కు రంధ్రాలను క్లియర్ చేసి, శ్వాసక్రియకు తోడ్పడుతుంది.

ఈ విషయంలో కొంతమంది నాసల్ లావేజ్ సహాయపడుతుందని నమ్ముతారు. ఈ విధానంలో, మీరు మీ పిల్లల నాసికా రంద్రాలను నీటితో బయటకు తీయడానికి నేటి పాట్ లేదా ఇతర పరికరాన్ని ఉపయోగిస్తారు. ఈ విధానానికి సహకరించే పెద్ద పిల్లలతో మాత్రమే దీన్ని చేయండి. చిన్న పిల్లల విషయంలో ప్రయత్నించకండి.

 ఉదరానికి సంబంధించిన అలెర్జీలు - సహజ నివారణలు

ఉదరానికి సంబంధించిన అలెర్జీలు - సహజ నివారణలు

మీ పిల్లలకి విరేచనాలు ఉంటే, బ్లాండ్ డైట్ తినమని వారిని ప్రోత్సహించండి. ఉదాహరణకు, అన్నం, టోస్ట్, అరటిపండ్లు మరియు ఆపిల్‌సాస్‌ను తీసుకోమని సిఫార్సు చేస్తారు. విరేచనాల సమయంలో పిల్లలు పుష్కలంగా నీరు మరియు ఇతర ద్రవాలు తాగడం కూడా చాలా ముఖ్యం.

మీ పిల్లలకు వికారంగా అనిపించినా, వాంతులు ఎక్కువగా అవుతున్నట్లయితే, విశ్రాంతి తీసుకోవడానికి వారిని ప్రోత్సహించండి. రూమ్‌లో వాంతులు తగ్గేందుకు సహకరించే సెంట్ కొవ్వొత్తులు వెలిగించడం లేదా ఎయిర్ ఫ్రెషనర్లను స్ప్రే చేయటం చేయండి.

ఇందుకోసం మీరు మీ స్థానిక ఔషధ దుకాణాల్లో లభించే ప్రత్యేక యాంటినోసా రిస్ట్‌బ్యాండ్‌లను కూడా ఉపయోగించవ్చచు. వికారం నుండి ఉపశమనానికి సహాయపడే ప్రెజర్ పాయింట్‌ను ఉత్తేజపరిచేందుకు ఇవి రూపొందించబడ్డాయి. ఈ పనికి బలమైన ఆధారాలు లేనప్పటికీ, ఇవి తక్కువ ప్రమాదకరమైనవి.

English summary

Natural Remedies for Children's Allergies in Telugu

Children's Allergies And Natural Remedies. Read in Telugu..
Desktop Bottom Promotion